Tag Archives: eye drops

ఐ డ్రాప్స్ అనుకోని కంట్లోకి జిగురు.. చివరికి?

కొన్ని సార్లు మన తొందరపాటు పనుల వల్ల ఎంతో పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు కంగారు కంగారుగా చేసే పనులు వారి ప్రాణాలకే ప్రమాదకరంగా మారే ఘటనలను ఎన్నో చూసాము. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి యూకేలో చోటుచేసుకుంది. యూకేకి చెందిన ఓ మహిళ కంగారుగా కంట్లో వేసుకునే చుక్కలు అని భావించి జిగురును కంటి లోపలకి వేసుకున్న ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.

యూకేకి చెందిన కేటీ బీత్ అనే 35 ఏళ్ల మహిళ జ్వరంతో బాధపడుతోంది. కళ్లు మంటగా అనిపించడం తో కళ్ళలోకి డ్రాప్స్ కోసం వెతక సాగింది. ఈ క్రమంలోనే ఆమె చేతికి ఒక బాక్స్ దొరకడంతో అది కంటిలోకి వేసుకునే చుక్కల మందు అనుకుని వేసుకుంది. ఆ తర్వాత మరి రెండు చుక్కలు ఎక్కువగా వేసుకోవడంతో ఆమె కళ్ళు అధికంగా మంటలు లేచాయి.

కళ్ళు అధికంగా మంట ఉండడంతో మహిళ ఆ డబ్బాను చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యింది. అది కంటిలోకి వేసుకునే చుక్కలు కాదు జిగురు అని తెలియడంతో వెంటనే వంటగదిలోకి పరుగులు తీసే ఆ జిగురు మొత్తం కడిగే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కళ్ళు అధికంగా మంట ఉండటంతో ఆమె బయటకు వెళ్లి ఇతరుల సహాయాన్ని కోరింది. పక్కింటి వారు విషయం తెలుసుకుని వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి మహిళను సరైన చికిత్స కోసం కేటీ హాస్పిటల్‌‌లో చేర్పించారు.

కంటిలోకి జిగురు వేసుకున్న కారణంగా ఆమె కుడికన్ను పూర్తిగా మూసుకుపోయింది. ఈ క్రమంలోనే వైద్యులు మాట్లాడుతూ ఆమె రెండు కనురెప్పలను సర్జరీ ద్వారా నెమ్మదిగా సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆమెకు చూపు వస్తుందా.. రాదా.. అనే విషయం సర్జరీ తర్వాత తెలుస్తుందని డాక్టర్లు తెలియజేశారు.

ఐ డ్రాప్ అనుకోని జిగురుని కంట్లో పోసుకుంది.. చివరికి దారుణంగా?

కొన్ని సార్లు మన ఏమరపాటు వల్ల చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. ఈ విధమైన చిన్న పొరపాట్లతో ఇది వరకే ఎంతో మంది ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం గురించి విని ఉన్నాం. తాజాగా ఇలాంటి సమస్యను మిచిగన్‌కు చెందిన యాసిడ్రా విలియమ్స్ ఎదుర్కొంది. ఈమె చేసిన చిన్న పొరపాటు ఆమెను ఆస్పత్రికి పాలు చేసింది. అసలేం జరిగిందంటే..

యాసిడ్రా విలియమ్స్ ఏప్రిల్ 15 రాత్రి బాగా నిద్ర రావడంతో తన కాంటాక్ట్ లెన్స్ తీయకుండానే నిద్ర పోయింది.అర్ధరాత్రి తర్వాత 1 గంట సమయంలో కళ్లు పొడిబారినట్లు అనిపించడంతో కాంటాక్ట్ లెన్స్ తీయటానికి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే తన కంట్లో వేసుకునే ఐ డ్రాప్స్ కోసం తన పర్స్ లో చేయి పెట్టి ఐ డ్రాప్స్ కి బదులుగా,గోళ్లకు ఉపయోగించే నైల్ గ్లూ బాటిల్ తీసుకుంది. చూడటానికి రెండు ఒకే విధమైన సైజులో ఉండటంతో ఆమె వాటిని గమనించకుండా ఐ డ్రాప్స్ అని భావించి ఆ గ్లూ కంట్లో వేసుకుంది.

నైల్ గ్లూ కంట్లో వేసుకున్న వెంటనే కళ్ళు మంట రావడం, దురద పెట్టడం మొదలయ్యాయి. అదేవిధంగా గ్లూ మొత్తం కంటిలోని లెన్స్ చుట్టూ చేరి గట్టిపడింది. ఈ మంటను తట్టుకోలేక విలియమ్స్ కళ్ళు మూసి వేయడంతో గ్లూ కారణంగా తన కనురెప్పలు అతుక్కు పోయాయి. కళ్ళు తెరవడానికి ఎంత ప్రయత్నించిన రాకపోవడంతో ఆమె గట్టిగా కేకలు వేసి తన భర్తకు ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ కి ఫోన్ చేయమని చెప్పింది.

ఆస్పత్రిలో చేరిన విలియమ్స్ కు దాదాపు రెండు గంటల పాటు వైద్యులు శ్రమించి కను రెప్పలను విడదీశారు. ఆ తరువాత తన కంట్లో పేరుకుపోయిన జిగురును మొత్తం బయటకు తీశారు. అయితే కంట్లో లెన్స్ ఉండటం వల్ల తన చూపు కోల్పోకుండా కాపాడాలని వైద్యులు తెలియజేస్తున్నారు.ఈ చికిత్సలో భాగంగా విలియమ్స్ తన కనురెప్పలు వెంట్రుకలను కోల్పోవాల్సి వచ్చింది. జిగురుకి కనురెప్పల వెంట్రుకలు అతుక్కుపోవడం వల్ల వెంట్రుకలను కత్తిరించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు.ప్రస్తుతం ఆమె కంటి చూపు మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.