కొన్ని సార్లు మన ఏమరపాటు వల్ల చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. ఈ విధమైన చిన్న పొరపాట్లతో ఇది వరకే ఎంతో మంది ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం గురించి విని ఉన్నాం. తాజాగా ఇలాంటి సమస్యను మిచిగన్‌కు చెందిన యాసిడ్రా విలియమ్స్ ఎదుర్కొంది. ఈమె చేసిన చిన్న పొరపాటు ఆమెను ఆస్పత్రికి పాలు చేసింది. అసలేం జరిగిందంటే..
యాసిడ్రా విలియమ్స్ ఏప్రిల్ 15 రాత్రి బాగా నిద్ర రావడంతో తన కాంటాక్ట్ లెన్స్ తీయకుండానే నిద్ర పోయింది.అర్ధరాత్రి తర్వాత 1 గంట సమయంలో కళ్లు పొడిబారినట్లు అనిపించడంతో కాంటాక్ట్ లెన్స్ తీయటానికి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే తన కంట్లో వేసుకునే ఐ డ్రాప్స్ కోసం తన పర్స్ లో చేయి పెట్టి ఐ డ్రాప్స్ కి బదులుగా,గోళ్లకు ఉపయోగించే నైల్ గ్లూ బాటిల్ తీసుకుంది. చూడటానికి రెండు ఒకే విధమైన సైజులో ఉండటంతో ఆమె వాటిని గమనించకుండా ఐ డ్రాప్స్ అని భావించి ఆ గ్లూ కంట్లో వేసుకుంది.
నైల్ గ్లూ కంట్లో వేసుకున్న వెంటనే కళ్ళు మంట రావడం, దురద పెట్టడం మొదలయ్యాయి. అదేవిధంగా గ్లూ మొత్తం కంటిలోని లెన్స్ చుట్టూ చేరి గట్టిపడింది. ఈ మంటను తట్టుకోలేక విలియమ్స్ కళ్ళు మూసి వేయడంతో గ్లూ కారణంగా తన కనురెప్పలు అతుక్కు పోయాయి. కళ్ళు తెరవడానికి ఎంత ప్రయత్నించిన రాకపోవడంతో ఆమె గట్టిగా కేకలు వేసి తన భర్తకు ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ కి ఫోన్ చేయమని చెప్పింది.
ఆస్పత్రిలో చేరిన విలియమ్స్ కు దాదాపు రెండు గంటల పాటు వైద్యులు శ్రమించి కను రెప్పలను విడదీశారు. ఆ తరువాత తన కంట్లో పేరుకుపోయిన జిగురును మొత్తం బయటకు తీశారు. అయితే కంట్లో లెన్స్ ఉండటం వల్ల తన చూపు కోల్పోకుండా కాపాడాలని వైద్యులు తెలియజేస్తున్నారు.ఈ చికిత్సలో భాగంగా విలియమ్స్ తన కనురెప్పలు వెంట్రుకలను కోల్పోవాల్సి వచ్చింది. జిగురుకి కనురెప్పల వెంట్రుకలు అతుక్కుపోవడం వల్ల వెంట్రుకలను కత్తిరించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు.ప్రస్తుతం ఆమె కంటి చూపు మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…