Tag Archives: fined five lakhs

Robo Shankar: హోమ్ టూర్ వీడియో చేసి ఐదు లక్షల జరిమానా కట్టిన నటుడు రోబో శంకర్.. ఏమైందంటే?

Robo Shankar: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి వారికి సంబంధించిన వీడియోలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఇక చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వారు ఇతర సెలబ్రిటీల ఇంటికి వెళ్లి వారి హోమ్ టూర్ వీడియోలను కూడా తీస్తూ వారి యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేస్తూ ఉంటారు.

ఇలా ఓ తమిళ యూట్యూబ్ ఛానల్ నటుడు రోబో శంకర్ హోమ్ టూర్ వీడియోని చేశారు. నటుడు రోబో శంకర్ తమిళ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. తాజాగా నటుడు రోబో శంకర్ ఓ వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది.

ఓ యూట్యూబ్ ఛానల్ ఈయన హోమ్ టూర్ వీడియోని చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ఈయన ఏకంగా ఐదు లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి వచ్చింది అసలు హోమ్ టూర్ వీడియోకి జరిమానాకు సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే నటుడు రోబో శంకర్ తన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అన్నింటి గురించి చాలా అద్భుతంగా వివరించారు. అయితే ఈయన ఇంట్లో అలెగ్జాండ్రేన్‌ పారకీట్స్‌ అనే జాతి చిలకలు ఉన్నాయి.

Robo Shankar: రోబో శంకర్ ఇంటి పై అటవీశాఖ అధికారులు దాడి…

ఇక ఈ చిలుకలను కూడా యూట్యూబ్ ఛానల్ లో చూపించారు. అయితే 1972 జంతు సంరక్షణ చట్టంలో భాగంగా అనుమతి లేకుండా ఇలాంటి పక్షులను పెంచుకోవడం పూర్తిగా తప్పు ఈ క్రమంలోనే ఈ వీడియో చూసినటువంటి ప్రేమికుడు ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు నటుడు రోబో శంకర్ ఇంటికి చేరుకొని ఆ పక్షులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా,పక్షులను పెంచుకోవడం కోసమే ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో ఏకంగా ఐదు లక్షల రూపాయల జరిమానా విధించారు.