Tag Archives: floods

తిరుపతి పై వరుణుడి ప్రతాపం.. జల సందిగ్ధంలో తిరుపతి వాసులు..!

తిరుమల తిరుపతి పై వరుణుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత మూడు రోజుల నుంచి కుండపోతగా వర్షం కురవడంతో తిరుపతి జల సందిగ్ధంలో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే ప్రజలు అష్టకష్టాలు పడుతూ ఈ తిరుపతిని నువ్వే కాపాడాలి శ్రీనివాస అంటూ స్వామివారిని వేడుకుంటున్నారు. ఇక తిరుమల గిరులపై అధిక వర్షపాతం నమోదు కావడం చేత తిరుపతి నగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

కనుచూపుమేరా వరద నీరు పొంగిపొర్లడంతో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు.ఈ క్రమంలోనే వరద ఉధృతికి ఎన్నో వాహనాలు కొట్టుకుపోగా మనుషులు పశువులు కూడా ఆ వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు వదులుతున్నారు. ఇక అధిక మొత్తంలో నీరు ఇళ్లలోకి చేరడం వల్ల ఇంటిలోని సామాన్లు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి.

ఎత్తయిన చెట్లు కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడి తిరుపతి మొత్తం చీకటిలో ఉండిపోయింది. ఈ విధమైనటువంటి దుర్భర పరిస్థితి నుంచి తిరుపతి నువ్వే కాపాడాలి స్వామి అంటూ ప్రజలు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఇలా తిరుపతిని వరద ముంచెత్తడంతో ప్రజలు కొంతమేర భయాందోళనకు గురవుతున్నారు.

ఎప్పుడో 1996 సంవత్సరంలో ఈ విధమైనటువంటి వార్తలు వచ్చాయని ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి వరద రాలేదని అక్కడి ప్రజలు తెలియజేస్తున్నారు. ఇక తిరుమల కొండలలో వరద నీరు జలపాతాలను పోలి ఉన్నప్పటికీ అధిక వర్షపాతం నమోదు కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి.దీంతో భక్తులు ఎవరూ కూడా తిరుమలకు రాకూడదని ఆలయ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

జగన్ చెప్పినా బురదలోకి దిగలేదంటున్న వైసీపీ ఎంపీ..?

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొన్ని నెలలుగా జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ నేతల కంటే రఘురామ కృష్ణంరాజే జగన్ సర్కార్ పై ఎక్కువగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా రఘురామ జగన్ చెప్పినా తాను బురదలోకి దిగలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారాడని అన్నారు.

2014 ఎన్నికలకు కొన్ని నెలల ముందు జగన్ తో మూడు నెలల పాటు ట్రావెల్ చేశానని రఘురామ అన్నారు. ఆ సమయంలో నర్సాపురంలో వరదలు వచ్చాయని.. ఈ విషయం తెలిసి జగన్ అక్కడికి పర్యటించడానికి వచ్చాడని తెలిపారు. ఆ సమయంలో పంట పొలంలో జగన్ బురదలో దిగాడని తనను కూడా దిగమని జగన్ చెప్పినా తాను దిగలేదని అన్నారు. జగన్ బురదలో దిగి పంటను చేతులతో పట్టుకుని చూసి రైతులతో మాట్లాడాడని చెప్పారు.

జగన్ రైతులతో చాలా సమయం మాట్లాడి వారికి ధైర్యం చెప్పాడని అన్నారు. అయితే ఆ తరువాత జగన్ చేసీంది కరెక్ట్ అని తనకు అనిపించిందని.. అయితే జగన్ అప్పటికీ ఇప్పటికీ చాలా మారారని చెప్పారు. జగన్ ప్రస్తుతం ప్రజల మధ్యకే రావడం లేదని… పాదయాత్ర సమయంలో పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ముద్దాడిన జగన్ ఇప్పుడు మారిపోయారని చెప్పారు.

జగన్ ఇప్పటికైనా గతాన్ని స్మరించుకుంటే బాగుంటుందంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పక్షంలో ఉన్న సమయంలో చేస్తున్న పనులకు తేడా గమనించాలని సూచించారు. రఘురామ వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది

తెలంగాణకు సాయం చేస్తున్న సీఎం జగన్.. ఏం జరిగిందంటే..?

గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ మహానగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలో పరిస్థితి అదుపు వచ్చిందనుకునే లోపు నగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురుస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నగరంలోని ప్రధాన ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. వాతావరణశాఖ మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ప్రజలను హెచ్చరిస్తోంది.

వర్షాలు, వరదల వల్ల కొందరి ఇళ్లు పాక్షికంగా దెబ్బ తినగా మరి కొందరి ఇళ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ సాయం కోరారు. జగన్ కేసీఆర్ మధ్య సత్సంబంధాలే ఉన్నప్పటికీ జల వివాదం వల్ల వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే తెలంగాణ ప్రజలు వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జగన్ సహాయం చేయడానికి అంగీకరించారు.

సీఎం కేసీఆర్ నగరంలో వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం స్పీడ్ బోట్స్ అవసరమని అధికారులతో సమ్జీక్ష అనంతరం జగన్ ను కోరగా జగన్ స్పీడ్ బోట్స్ ను పంపించడానికి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించింది. సీఎం జగన్ సహాయం చేయడానికి ముందుకు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం జగన్, సీఎం కేసీఆర్ మధ్య సత్సంబంధాలు ఉంటే ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలు సులువుగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఏపీ తెలంగాణ రాష్ట్రాల బస్ సర్వీసులు దసరా పండుగకు లేనట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొడుకు మాటతో కన్నీరుమున్నీరైన అనసూయ.. ఏం జరిగిందంటే..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర యాంకర్ గా యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ షోను హోస్ట్ చేసినా అనసూయ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇటు బుల్లితెరతో పాటు అటు వెండితెరపై కూడా విజయాలు సొంతం చేసుకుంటున్న అనసూయ కొడుకు మాటతో కన్నీరుమున్నీరయ్యానని తాజాగా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

యాంకర్ అనసూయ అంతలా బాధ పడటానికి కారణమేమిటంటే ఆమె తొమ్మిదేళ్ల కొడుకు అనసూయతో కరోనా వైరస్, లాక్ డౌన్, వరదల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో అనసూయ కొడుకు ఆమెతో తాను గడిచిన కాలానికి వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. 2017, 2018, 2019 సంవత్సరాలలో తాను ఎంతో సంతోషంగా జీవించానని తనకు మళ్లీ అలాంటి రోజులు కావాలని తల్లికి తెలిపాడు. అప్పుడు కరోనా, వరదలు లేకపోవడంతో సంతోషంగా జీవనం సాగించానని చెప్పాడు.

అవకాశం వస్తే తాను గడిచిన వెళ్లాలని అనుకుంటున్నానని కొడుకు తనతో చెప్పాడని ఆమె వెల్లడించారు. కొడుకు అలా చెప్పిన తర్వాత తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని.. కన్నీరు పెట్టుకున్నానని తెలిపారు. రాబోయే తరాల వారికి మనం ఏం అందించనున్నాం…? మనం ఎలాంటి పరిస్థితులను కొని తెచ్చుకున్నానం..? అంటూ ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు. అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వినియోగం మనుషుల జీవితంలో భాగమైపోయింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. గతేడాదిలా సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా చాలా సమయమే పట్టేలా ఉంది. దేశంలో కరోనా అంతమైతే మాత్రమే ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించగలిగే అవకాశం ఉంది.