Tag Archives: good news

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఎక్కడినుండైనా గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం..?

గ్యాస్ సిలిండర్ లు ఉపయోగించే వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ శుభవార్తను తెలియజేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే నిత్యవసర వస్తువుల వినియోగం అధికమయ్యింది. ఈ నిత్యావసరాలలో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ లలో ఒకటి అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఉన్నఫలంగా గ్యాస్ సిలిండర్ అయిపోతే తిరిగి గ్యాస్ బుక్ చేసుకొని మరీ రీ ఫీల్ చేసుకోవాలంటే ఎంతో సమయం పడుతుంది.

ఇలాంటి సమయాల్లోనే వినియోగదారులు ఎక్కడి నుంచి అయినా గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసే అవకాశాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే వినియోగదారుల కోసం ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా మీ సమీప పెట్రోల్  పంప్, కిరాణా దుకాణాల్లో గ్యాస్ సలిండర్ లభించదనుందని కంపెనీ ట్వీట్ చేసింది.

ఈ క్రమంలోనే ఉన్నఫలంగా మన ఇంట్లో సిలిండర్ అయిపోతే 5 కేజీల గ్యాస్ సిలిండర్ ను మన దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంకులు, కిరాణా షాపులలో ఎటువంటి చిరునామా ఆధారం లేకుండా, ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపించు ఐదు కిలోల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది.

ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 495గా ఉంది. ఈ విధమైనటువంటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం కోసం మీరు 8454955555 నంబర్‌కు మిస్డ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా వాట్సాప్ లో కూడా  ‘REFILL’ అని టైప్ చేసి 7588888824 నంబర్‌కు మెసేజ్ పంపించి షార్ట్ సిలిండర్ ను పొందవచ్చని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ పేర్కొంది.

రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈ టిప్స్ పాటిస్తే తత్కాల్ టికెట్ కన్ఫర్మ్..?

దేశంలో ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైళ్ల ద్వారా ప్రయాణిస్తున్నారు. అయితే లాక్ డౌన్ నిబంధనల వల్ల దేశంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తున్నాయి. కరోనా ఉధృతి తగ్గినప్పటికీ దేశంలోని ప్రజలకు పూర్తిస్థాయిలో రైళ్ల సర్వీసులు అందుబాటులోకి రాలేదు. అయితే అత్యసర ప్రయాణాల కోసం చాలామంది ప్రయాణికులు తత్కాల్ టికెట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.

కొందరు సులభంగా తత్కాల్ టికెట్ ను బుకింగ్ చేసుకుంటే కొందరు ప్రయాణికులు ఎంత కష్టపడినా తత్కాల్ టికెట్ దొరకక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా సులభంగా తత్కాల్ టికెట్ ను బుకింగ్ చేసుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులు తత్కాల్ టికెట్ ను ప్రయాణించే తేదీ కంటే ఒకరోజు ముందు ఏసీ టికెట్ల కోసం 10 గంటలకు స్లీపర్ టికెట్ల కోసం 11 గంటలకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

తత్కాల్ టికెట్ బుకింగ్ చేయాలంటే ఒక ఐడీతో ఒకే బ్రౌజర్ లో లాగిన్ కావడం మంచిది. రైళ్లలో ఎక్కువ సీట్లను ఉన్న రైలును ఎంచుకుంటే సులభంగా టికెట్ చేసుకునే అవకాశంతో పాటు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. టికెట్ బుకింగ్ కోసం వన్ టైమ్ పాస్ వర్డ్ అవసరం లేని పేమెంట్లను ఎంచుకుంటే త్వరితగతిన టికెట్ బుకింగ్ చేయవచ్చు. బుకింగ్ మొదలుకావడానికి ముందే స్టేషన్ కోడ్ , బెర్త్ వివరాలను ఎంచుకుంటే సెకన్ల వ్యవధిలో ప్రయాణికుల వివరాలు నమోదు చేసి టికెట్ బుకింగ్ చేయవచ్చు.

మాస్టర్ లిస్ట్ ఆప్షన్ లేదా మై ప్రొఫైల్ సెక్షన్ లో వివరాలను నమోదు చేయడం ద్వారా సులభంగా ప్రయాణికుల పేర్లు ఎంటర్ చేయకుండా టికె్ట్లు బుకింగ్ చేసుకోవచ్చు. టికెట్ల బుకింగ్ సమయంలో ఇంటర్నెట్ స్పీడ్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్నెట్ స్పీడ్ గా ఉంటే సులువుగా టికెట్ బుకింగ్ చేయడం సాధ్యమవుతుంది. ఈ టిప్స్ పాటించడం ద్వారా సులభంగా ట్రైన్ టికెట్ ను బుకింగ్ చేయవచ్చు.

రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈ కార్డుతో తక్కువ ధరకే టికెట్లు..!

దేశంలో సామాన్య ప్రజల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణాన్ని ఎంతో ఇష్టపడతారు. బస్సు, విమాన ప్రయాణాలతో రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం కావడంతో పాటు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. రైలు ప్రయాణికులు రైలు టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

వేరే విధంగా కూడా రైలు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ మంది ప్రయాణికులు ఈ విధానం ద్వారానే టికెట్లను బుక్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే తాజాగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైలు ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఐఆర్సీటీసీ ఎస్బీఐ రూపే కార్డ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డ్ ద్వారా ప్రయాణికులు సులువుగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మోదీ సర్కార్ గత కొన్ని నెలల నుంచి మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మన దేశానికి చెందిన కార్డ్ అయిన రూపే కార్డ్ తో నిబంధనల ప్రకారం ఫ్రీగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. ఎన్పీసీఐ – ఎస్బీఐ ఐఆర్సీటీసీ సంయుక్తంగా ఈ కార్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ప్రయాణికులు ఎవరైతే ఎస్బీఐ ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చిన రూపే కార్డును వినియోగిస్తారో వాళ్లు ఉచితంగా లేదా తక్కువ ధరకే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ తో పెట్రోల్, డీజిల్ పై దేశంలోని అన్ని బంకుల్లో ఒక శాతం ఛార్జీల మినహాయింపును పొందవచ్చు. ఒకే ట్యాప్ తో ఫ్లాట్ ఫాం, మెట్రో, టోల్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ కార్డ్ ద్వారా వినియోగదారులు పలు ఈ కామర్స్ లైట్లలో డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.

నిరుద్యోగులకు శుభవార్త.. 9,640 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం..!

దేశంలోని నిరుద్యోగులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే వాళ్లలో ఎక్కువ మంది బ్యాంకు ఉద్యోగాల కోసం కలలు కంటారు. అలా కలలు కంటున్న వారికి ఐబీపీఎస్ శుభవార్త చెప్పింది. గ్రామీణ బ్యాంకుల్లో 9640 ఉద్యోగాలకు గత నెలలలోనే గడువు ముగియగా మరోసారి వాళ్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఐబీపీఎస్ నిర్ణయం వల్ల దరఖాస్తు చేసుకోని వారికి ప్రయోజనం కలగనుంది.

https://ibps.in/ ద్వారా అభ్యర్థులు నవంబర్ నెల 9వ తేదీ వరకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిన్నటి నుంచి 9,640 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని 43 గ్రామీణ బ్యాంకులలో పని చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల వివరాలను పరిశీలిస్తే తెలంగాణలో 470 ఖాళీలు ఉండగా ఏపీలో 366 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 5 ఆర్ఆర్‌బీల్లో 836 పోస్టులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.

9,640 ఉద్యోగాలలో ఆఫీస్ అసిస్టెంట్‌(మ‌ల్టీప‌ర్ప‌స్‌) ఉద్యోగాలు 4,624, ఆఫీస‌ర్‌(అసిస్టెంట్ మేనేజ‌ర్‌) – 3,800 ఉద్యోగాలు, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 837 ఉద్యోగాలు, ఆఫీస‌ర్‌ (స్కేల్‌-3) 156 ఉద్యోగాలు, అగ్రికల్చర్ ఆఫీసర్ 100 ఉద్యోగాలు, ఐటీ ఆఫీస‌ర్ 58 ఉద్యోగాలు, లా ఆఫీస‌ర్ 26 , మార్కెటింగ్ ఆఫీస‌ర్‌ 8, ట్రెజ‌రీ మేనేజ‌ర్ 3 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలలో కొన్ని ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ, కొన్ని ఉద్యోగాలకు సీఏ అర్హతగా ఉంది.

రాత పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా స్కేల్ 1 ఆఫీసర్ల భర్తీ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉండగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు 175 రూపాయలు, మిగిలిన వారికి 850 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆఫీసర్‌ పోస్టులకు 2020 డిసెంబర్ 31న, ఆఫీసర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 2021 సంవత్సరం జనవరి 2,4 తేదీలలో పరీక్షలు జరుగుతాయి.

ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు శుభవార్త..!

భారతదేశంలో నివశించే వాళ్లకు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎవరి దగ్గరైతే ఆధార్ కార్డ్ లేదో వాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేసే ఏ స్కీమ్ కు అర్హులు కారు. దేశంలో రోజురోజుకు ఆధార్ కార్డ్ కు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఏ పథకానికైనా ప్రస్తుతం ఆధార్ కార్డ్ నే ముఖ్యమైన ధ్రువపత్రంగా అధికారులు భావిస్తున్నారు ఏపీలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న ప్రతి పథకానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి.

నవరవత్నాల హామీలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ లకు కూడా ఆధార్ తప్పనిసరి. ఆధార్ ప్రామాణికంగా తీసుకుని పథకాలను అమలు చేయడం ద్వారా పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ కార్యాకలాపాలకు కూడా ప్రస్తుతం ఆధార్ కార్డ్ ప్రామాణికం అవుతోంది. దీంతో యుఐడీఏఐ వేగంగా ఆధార్ కార్డులు అందించే దిశగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత ఆధార్ కార్డ్ పొందడానికి నెల నుంచి రెండు నెలల సమయం పడుతోంది. ప్రతి రాష్ట్రంలో నెలకు వేల సంఖ్యలో కొత్త కార్డులు జారీ అవుతున్నాయి. కొందరు ఆధార్ కార్డ్ లేక కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మరి కొందరు ఆధార్ కార్డ్ లో తప్పొప్పులను సరిదిద్దుకోవడం కోసందరఖాస్తు చేసుకుంటున్నారు.

ఏపీలో దాదాపుగా 5 కోట్ల 30 లక్షల ఆధార్ కార్డులు ఉండగా తెలంగాణలో దాదాపు 4 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు ఆధార్ కార్డులను వేగంగా జారీ చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీలకు జగన్ సర్కార్ శుభవార్త.. మరో కొత్త స్కీం ప్రారంభం..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కులాల ప్రజలకు శుభవార్త చెప్పారు. జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం పేరుతో కొత్త స్కీమ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లకు ప్రయోజనం చేకూరేలా చేయనున్నారు. సీఎం జగన్ నేడు 2020 – 23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఈ కొత్త స్కీమ్ ను అమలులోకి తెచ్చామని వెల్లడించారు.

రాష్ట్రంలోని ఎస్సీలకు 16,2 శాతం, ఎస్టీలకు 6 శాతం చొప్పున భూములను కెటాయిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అధికారులు ఈ రెండు కులాలకు చెందిన వాళ్లలో ఎవరికైనా పరిశ్రమలు పెట్టుకోవాలనే ఆసక్తి ఉంటే ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియజేయాలని పేర్కొన్నారు. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ స్కీమ్ ను ప్రారంభించారు.

దసరా పండుగ నేపథ్యంలో ఈ కొత్త స్కీమ్ ను అమలు చేస్తున్నామని తెలిపారు. దసరా పండుగ సమయంలో ఈ స్కీంను అమలు చేయడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు కోటి రూపాయల ప్రోత్సాహకాలను ప్రకటించబోతున్నామని వెల్లడించారు.

పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీలు కల్పించబోతునామని సీఎంతెలిపారు. పేదల జీవితాలను మార్చాలనే ఉద్దేశంతో నవరత్నాల హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

వీధివ్యాపారులకు కేంద్రం శుభవార్త.. రేపే రూ.10,000 పంపిణీ..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వీధివ్యాపారులకు శుభవార్త చెప్పింది. ఆత్మ నిర్భర భారత యోజన స్కీమ్ కింద వీధివ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. రేపటినుంచి కేంద్రం వీధివ్యాపారులకు 10,000 రూపాయల చొప్పున రుణాలను అందించనుంది. ప్రధాని మోదీ దాదాపు ముడు లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందిన వారితో మోదీ నేరుగా మాట్లాడనున్నారు

కరోనా వైరస్, లాక్ డౌన్ దేశంలోని వీధివ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి విదితమే. లాక్ డౌన్ వల్ల లక్షల సంఖలో వీధి వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. అన్ లాక్ సడలింపులు అమలు చేసిన సమయంలో సైతం వీధివ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చాలామంది వీధివ్యాపారులు దిక్కుతోచని పరిస్థితుల్లో అప్పులపై ఆధాపడ్డారు. కేంద్రం వీధి వ్యాపారుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన్‌ మంత్రి స్ట్రీట్ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి యోజన స్కీమ్ ను ప్రవేశపెట్టింది.

పీఎం నరేంద్ర మోదీ జూన్ నెల 1వ తేదీన ఈ స్కీమ్ ను ప్రకటించారు. కేంద్రం ఈ స్కీమ్ ద్వారా సబ్సిడీ రేటులో రూ.10,000 మూలధనాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ కొరకు 24 లక్షల మంది వీధివ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మందికి రుణాలు ఇవ్వనుందని తెలుస్తోంది.

5.35 లక్షల మందికి ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని.. మిగిలిన వీధివ్యాపారులకు రుణాలు మంజూరు చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే యూపీ నుంచి ఈ స్కీమ్ కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. 5,57,000 మంది ఉత్తరప్రదేశ్ వీధివ్యాపారులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. పీఎం తమకు ప్రయోజనం చేకూరేలా స్కీమ్ ను అమలు చేస్తూ ఉండటంపై వీధివ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా విషయంలో మరో శుభవార్త.. యాంటీబాడీలు ఎన్ని నెలలు ఉంటాయంటే..?

ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి గురించి వేర్వేరు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ద్వారా కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రజల్లో భయాందోళనకు తగ్గిస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా యాంటీబాడీల గురించి పరిశోధనలు చేసి కీలక ప్రకటన చేశారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ఏడు నెలలు యాంటీబాడీలు ఉంటాయని చెప్పారు.

పోర్చుగల్ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారిపై పరిశోధనలు చేసి 90 శాతం మందిలో ఏడు నెలలు యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. అయితే వయస్సుతో యాంటీబాడీలకు సంబంధం లేదని అందరిలోనూ ఒకే విధంగా యాంటీబాడీలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్ ఇమ్యునాలజీలో ఈ విషయాలను వెల్లడించారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ మాలిక్యులర్‌ పరిశోధకులు ఈ పరిశోధనలు చేశారు.

వైరస్‌ తీవ్రత ప్రభావాన్ని బట్టి యాంటీబాడీల ఉత్పత్తి జరుగుతోందని తాము గుర్తించామని పేర్కొన్నారు. ఏదైనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందని.. వైరస్ పై పోరాటానికి యాంటీబాడీలు దోహదపడతాయని పేర్కొన్నారు. 300 మంది బాధితులు, వైద్య సిబ్బంది, 200 కరోనా నుంచి కోలుకున్న వాలంటీర్లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.

కరోనా నుంచి కోలుకున్న మూడు వారాల తర్వాత యాంటీబాడీలు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే వేగంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని వెల్లడించారు.

ఇంటర్ పాసైన వారికి శుభవార్త… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..!

నేటి తరం యువతలో చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కల. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చాలా తక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. అయితే తాజాగా కేంద్రం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరికొన్ని రోజుల్లో స్టాఫ్ సెలక్షన్ కమిటీకి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. నవంబర్ 6వ తేదీన ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా 2020 డిసెంబర్ 15న నోటిఫికేషన్ ప్రక్రియ ముగియనుంది.

డేటా ఎంట్రీ ఆపరేటర్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, లోయర్ డివిజల క్లర్క్ ఉద్యోగాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, పలు ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, టైర్ 2 పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇంటర్ పాసైన వారంతా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

2021 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ పరీక్షలు జరుగుతాయి. 2021 ఏప్రిల్ 12 నుంచి 27వ తేదీ వరకు లెవెల్ టైర్ 1 ఎగ్జామ్, టైర్ 2 – డిస్క్రిప్టివ్ పేపర్, టైప్ 3 స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటాయి. అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారో తెలియాల్సి ఉంది. గతేడాది 4893 ఉద్యోగాల భర్తీ జరగగా ఈ ఏడాది అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలవుతుంది. సిలబస్ ప్రకారం పరీక్షలకు ప్రిపేర్ అయితే సులువుగా ఉద్యోగం సాధించడం సాధ్యమవుతుంది.

రుణాలు తీసుకున్న వాళ్లకు కేంద్రం శుభవార్త.. వారికి ఊరట..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో రుణాలు తీసుకున్న వాళ్లకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ మారటోరియం వడ్డీ మినహాయింపుకు సంబంధించి తాజాగా కేంద్రం నుంచి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ గతంలో లోన్ మారటోరియం ప్రయోజనం కల్పించిన సంగతి తెలిసిందే.

ఎవరైతే లోన్ మారటోరియం పొంది ఉంటారో వాళ్లు ఆరు నెలల లోన్ మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే వడ్డీపై వడ్డీ భారాన్ని మోయనుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి నేడు వడ్డీపై వడ్డీ మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 2 కోట్ల రూపాయలకు మించని రుణాలకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది.

ఎం.ఎస్.ఎం.ఈ రుణాలు, వెహికిల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ రుణాలు, ఎడ్యుకేషన్ రుణాలు తీసుకున్న వారికి కేంద్రం నిర్ణయం వల్ల భారం తగ్గనుంది. కస్టమర్ల లోన్ అకౌంట్లలో ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు, బ్యాంకులు వడ్డీ డబ్బులను జమ చేస్తాయి. సుప్రీం కోర్టు కేంద్రాన్ని త్వరగా వడ్డీ మీద వడ్డీ మాఫీ నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించగా కేంద్రం దసరా పండుగ కానుకగా రుణాలు తీసుకున్న వాళ్లకు శుభవార్త తెలిపింది.

మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు లోన్ మారటోరియం కాలానికి కేంద్రం నూతన మార్గదర్శకాల ప్రకారం వడ్డీ మాఫీ కానుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల లెక్కల ప్రకారం కేంద్రం నిర్ణయం వల్ల 6,500 కోట్ల రూపాయల అదనపు భారం కేంద్రంపై పడనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి వరకు లోన్లు తీసుకున్న వారికి మాత్రమే ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.