Tag Archives: google pay

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

GOOGLE PAY: ప్రస్తుతం లావాదేవీలన్నీ ఆన్ లైన్ అవతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు చేసే దేశాాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. అతి తక్కువ కాలంంలోనే ఇండియాలోని ప్రజలు డిజిటల్ లావాదేవీలకు అలవాటుపడ్డారు. 

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

కేంద్ర ప్రభుత్వం యూపీఐ తీసుకువచ్చిన తర్వాత.. భీమ్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటి యాప్స్ నేరుగా క్యాష్ లెస్ లావాదేవీలకు ఊతమిచ్చాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ ఉందంటే.. వాటిలో ఈ యాప్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. షాపుల్లో, రెస్టారెంట్లలో, హోటళ్లలో,  మార్కెట్లలో, చివరకు చిన్న స్థాయి వర్తకులు కూడా డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ కరెన్సీని కూడా ఇండియాలో ప్రవేశపెడుతామని… బడ్జెట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

ముఖ్యంగా కరోనా తరువాత ఇండియాలోె డిజిటల్ లావాదేవీల విలువ పెరిగింది. గతంతో పోలిస్తే ఆన్ లైన్ పేమెంట్లు ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది.

గుగూల్ పే ద్వారా రూ. లక్ష పర్సనల్ లోన్:

ఇదిలా ఉంటే.. గూగుల్ పే పే వాడుతున్నవారికి ఆన్ లైన్ పేమెంట్ యాప్ శుభవార్త చెప్పింది. గుగుల్ పే యాప్ ఉపయోగించే వినియోగదారులకు రూ. లక్ష వరకు రుణం పొందేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారు మాత్రమే అర్హులని తెలిపింది. గూగుల్ పే పే ప్రిక్వాలిఫైయర్ యూజర్లకు డీఎంఐ ఫినాన్స్ కంపెనీ.. పర్సనల్ లోన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ రుణాలు ఇవ్వనుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వ్యక్తి గత రుణాలు ఇవ్వనుంది. తీసుకున్న రుణాన్ని 36 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో ఈ సదుపాయాన్ని మరింత మందికి  అందుబాటులోకి తేనుంది.

Aadhar Pay: ఫోన్ పే, గూగుల్ పేతో పాటు..! ఇక నుంచి ఆధార్ పే కూడా..!

Aadhar Pay: క్యాష్ లెస్ డిజిటల్ లావాదేవీలు ఇండియాలో గణనీయంగా పెరిగాయి. డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. భారత దేశంలో డిజిటల్ పేమెంట్లు ఎంతగా మారాయంటే… దేవాలయాల్లో హుండీలకు కూడా క్యూఆర్ కోడ్ లు వచ్చే అంతగా మార్పు చెందాయి.

ప్రస్తుతం దేశంలో గుగూల్ పే, ఫోన్ పే, భీమ్ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. 
తాజాగా త్వరతలో ‘ ఆధార్ పే’ కూడా రానుంది. గుగూల్ పే, ఫోన్ పే లాగే ఆధార్ పే చేసుకోవచ్చు. అన్ని ఎంఓఎస్ డిజిటల్ కేంద్రాల వద్ద ఆధార్ పే ద్వారా చెల్లింపులు జరుపుకునే వెసులుబాటు కలిగింది.

బయోమెట్రిక్ మెషిన్ల ద్వారా ఆధార్ నెంబర్ ఆధారిత ఆర్థిక లావాదేవీలు జరుపుకునే వీలు ఉంది. ఈ సౌకర్యాన్ని ఎంఎస్ఓ యుటిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అందుబాటులోకి తేనుంది. బయోమెట్రిక్ యంత్రాల ద్వారా ఆధార్ నంబర్ ఆధారంగా ఆర్థిక లావాదేవీలు జరుగనున్నాయి.

బ్రాంచ్ లెస్ బ్యాంకింగ్ టై అప్ ల ద్వారా..


దీని వల్ల నగదు రహిత లావాదేవీలకు మరింత ముందడుగు పడనుంది. ఇప్పటికైతే వెండర్ ‘ ఆధార్ పే’ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ లావాదేవీలకు ఆధార్ నెంబర్ ఖచ్చితంగా బ్యాంకు ఖాతాాకు లింక్ అయి ఉండాలి.  ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం యూనిక్ ఫింగర్ ఇంప్రెషన్ వాడుకోనుంది. ఈ ఫింగర్ వెరిఫికేషన్ ద్వారా బ్యాంకు నుంచి నగదు బదిలీ జరుగుతుంది. బ్రాంచ్ లెస్ బ్యాంకింగ్ టై అప్ ల ద్వారా వినియోగదారుడు తమ ఇళ్ల సమీపం నుంచే బ్యాంకింగ్ సేవలను పొందే అవకాశం ఏర్పడింది. దేశంలోని మారుమూల, సుదూర ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సేవలను విస్తరించడంలో ఇది కీలక ముందుడుగా అభివర్ణించవచ్చు.

Digital Payment Apps: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లకు డబ్బులు ఎలా వస్తాయి..! ఆ వివరాలు తెలుసుకోండి..!

Digital Payment Apps: డిజిటల్ టెక్నాలజీ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా.. స్మార్ట్ ఫోన్లతోనే పనులు అన్నీ జరిగిపోతున్నాయి. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మొత్తం దేశాన్ని డిజిటల్ వైపు అడుగులు వేసే దిశగా బడ్జెట్ లో ప్రస్తావించారు.

Digital Payment Apps: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లకు డబ్బులు ఎలా వస్తాయి..! ఆ వివరాలు తెలుసుకోండి..!

అందులో భాగంగానే రైతులకు డ్రోన్లతో పాటు.. చదువుకునే విద్యార్థులకు ఫోన్లను సమకూర్చనున్నట్లు తెలిపారు. అయితే పెద్ద నోట్లు రద్దు అయిన దగ్గర నుంచి కూడా ప్రతీ ఒక్కరి మొబైల్ ఫోన్లలో డిజిటల్ పేమెంట్ యాప్ లు ఉంటున్నాయి.

Digital Payment Apps: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లకు డబ్బులు ఎలా వస్తాయి..! ఆ వివరాలు తెలుసుకోండి..!

డిజిటల్ కరెన్సీని వాడాలని.. ఫిజికల్ కరెన్సీని తగ్గించాలని ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువగా డిజిటల్ పేమెంట్ యాప్ లల్లో ఉపయోగించేవి పేటీఎం, ఫోన్ పే మరియు గూగుల్ పే. వీటిని ఉపయోగించి ఎక్కువ శాతం డబ్బులను ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు.


కమీషన్ బేస్ ద్వారా వాళ్లు డబ్బులను …

అయితే వీటి ద్వారా ఇలా ట్రాన్సా క్షన్స్ చేస్తే వీటికి వచ్చే లాభం ఏంటి అనేది ప్రతీ ఒక్కరికీ కలిగే ప్రశ్న. దాని గురించి తెలుసుకుందాం. ఈ యాప్ ల నుంచి ఎన్నో రకాల సేవలను పొందొచ్చు. అందులో ముఖ్యంగా మొబైల్ రీచార్జ్. యాప్ నుంచి రీచార్జ్ చేసుకుంటే టెలికాం కంపెనీ వాళ్ళు కమీషన్ ఇస్తారు. టీవీ రీచార్జ్ లు అయినా సరే అంతే ఉంటుంది. హోటల్ బుకింగ్స్ చేసుకున్నా సరే కమీషన్ వస్తుంది. ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్ ఇలా ఎన్నో ఉంటాయి. ఇలా కమీషన్ బేస్ ద్వారా వాళ్లు డబ్బులను సంపాదిస్తుంటారు. పలు కంపెనీలు ఇచ్చే కూపన్ల ద్వారా కూడా మనీ సంపాదిస్తుంటాయి. ఇలా ఆ కూపన్ ఆధారంగా కొనుగోలు చేసినా సరే కొంత కమీషన్ ఇస్తారు. ప్రతీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చొకొని.. కమీషన్లను పొందుతారు. ఇక ఇలా యాప్ లను ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే.. ఆ రకంగా కూడా మనీ సంపాదిస్తుంటారు.

గూగుల్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ ఛార్జీలు లేవట..?

మన దేశంలో ఆరు కోట్లకు పైగా యూజర్లు డిజిటల్ లావాదేవీల కోసం గూగుల్ పే యాప్ ను వినియోగిస్తున్నారనే సంగతి విదితమే. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ గూగుల్ పే యాప్ యూజర్లకు మరింత చేరువవుతోంది. దేశంలో కరోనా విజృంభణ, లాక్ డౌన్ తరువాత నగదు రహిత లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రధానీ మోదీ నగదు రహిత లావాదేవీలకు పిలుపునివ్వడంతో ప్రజలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

అయితే గత కొన్ని రోజుల నుంచి వచ్చే ఏడాది నుండి గూగుల్ పే యాప్ ను వినియోగించే కస్టమర్లు డిజిటల్ లావాదేవీల కోసం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వార్తలు వచ్చాయి. గూగుల్ పే ఛార్జీల గురించి అధికారికంగా ప్రకటన చేయకపోయినా అనధికారికంగా వైరల్ అయిన వార్తలు యూజర్లను తెగ టెన్షన్ పెట్టాయి. అయితే గూగుల్ పే కస్టమర్లు టెన్షన్ పడుతున్న నేపథ్యంలో తాజాగా కంపెనీ స్పందించి స్పష్టతనిచ్చింది.

డిజిటల్ లావాదేవీలకు ఛార్జీలను అమలు చేస్తుండటం వాస్తవమేనని అయితే కేవలం అమెరికాలోని కస్టమర్లకు మాత్రమే అమలు చేస్తున్నామని తెలిపింది. భారత్ లోని గూగుల్ పే కస్టమర్లు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కంగారు పడవద్దని గూగుల్ పే సంస్థ వెల్లడించింది. గూగుల్ పే తాజా నిర్ణయం వల్ల భారత్ లోని వినియోగదారులకు టెన్షన్ తగ్గినట్టేనని చెప్పవచ్చు.

భారత్ లో గూగుల్ పే యాప్ కు 110 బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతోంది. సంస్థ భారత్ లో 6.7 కోట్ల మంది గూగుల్ పే యాప్ ను వినియోగిస్తున్నారని, 30 లక్షల మంది వ్యాపారులు గూగుల్ పే బిజినెస్ యాప్ ను ఉపయోగిస్తున్నారని సంస్థ తెలిపింది.

గూగుల్ పే కస్టమర్లకు షాకింగ్ న్యూస్…?

దేశంలో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ లావాదేవీల కోసం వినియోగించే గూగుల్ పే యాప్ కస్టమర్లకు వరుస షాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. గూగుల్ పే తాజాగా చేసిన కొన్ని ప్రకటనలు యాప్ యూజర్లకు నష్టం కలిగించేవిగా ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి గూగుల్ పే వెబ్ యాప్ సేవలు నిలిచిపోనున్నాయి. గూగుల్ పే భవిష్యత్తులో నగదు బదిలీ జరగాలంటే కూడా చార్జీలు విధించే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయాలు అమలులోకి వస్తే మాత్రం గూగుల్ పే యాప్ కస్టమర్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది.

గూగుల్ పే మీడియా నివేదికల ద్వారా నగదు బదిలీకు ఛార్జీలను వసూలు చేయనున్నట్టు సంకేతాలు ఇచ్చింది. అయితే నగదు బదిలీ చార్జీలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గూగుల్ పే వెబ్ అప్లికేషన్ లో పీర్ 2 పీర్ సేవలు 2021 నుంచి జనవరి నుంచి నిలిచిపోనున్నాయి. గూగుల్ పే కస్టమర్లకు ప్రస్తుతం పే.గూగుల్.కామ్ ద్వారా లావాదేవీలు జరుపుకోవడానికి అవకాశమిస్తున్న సంగతి తెలిసిందే.

గూగుల్ పే నోటీసులో వెబ్ యాప్ సేవల నిలిపివేతకు సంబంధించిన విషయాలను పేర్కొంది. అయితే వెబ్ యాప్ సేవలు నిలిచిపోయినా మొబైల్ లో గూగుల్ పే యాప్ వినియోగించే కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే చెప్పాలి. కొన్ని రోజుల క్రితం గూగుల్ పే యాప్ లో కస్టమర్ల కోసం కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. మొదట ప్రయోగాత్మకంగా అమెరికాలోని గూగుల్ పే కస్టమర్లకు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

అయితే భవిష్యత్తులో మన దేశంలోని కస్టమర్లకు సైతం గూగుల్ పే కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. గూగుల్ పే నగదు లావాదేవీలకు ఛార్జీలను వసూలు చేస్తే మాత్రం యాప్ వినియోగించే కస్టమర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.

గూగుల్ పే కస్టమర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే కొంప కొల్లేరే..?

పదేళ్ల క్రితం ఇతరులకు డబ్బులు జమ చేయాలన్నా, అకౌంట్ లో ఉన్న డబ్బులను తీసుకోవాలన్నా బ్యాంకులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పటితో పోలిస్తే ఏటీఎంల వినియోగం చాలా తక్కువ. మారుతున్న కాలానికి అనుగుణంగా గూగుల్ పే, ఫోన్ పే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ప్రజలు సులభంగా డిజిటల్ లావాదేవీలు చేయగలుగుతున్నారు. రోజురోజుకు వీటికి ప్రాధాన్యత పెరుగుతోంది.

గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా లావాదేవీలు జరిగితే ఏదో ఒక రూపంలో క్యాష్ బ్యాక్ లను కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే సైబర్ మోసగాళ్లు గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులను బోల్తా కొట్టించి వాళ్ల ఖాతాలలో డబ్బులను మాయం చేస్తుండటం గమనార్హం. గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిపే వాళ్లకు స్క్రాచ్ కార్డులు లభిస్తాయి.

ఈ స్క్రాచ్ కార్డుల ద్వారా కొంత నగదు రివార్డు రూపంలో మన బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. అయితే సైబర్ నేరగాళ్లు యాప్ వాడుతున్న వినియోగదారులకు గూగుల్ పే రివార్డ్ వచ్చినట్టు మెసేజ్ లు పంపి గూగుల్ పే ను పోలి ఉండే నకిలీ పేజీలను ఆన్ లైన్ లో సృష్టిస్తున్నారు. అక్కడ స్క్రాచ్ కార్డులు కనిపించేలా చేసి ఆ కార్డులను స్క్రాచ్ చేసిన వారికి పెద్ద మొత్తంలో నగదు వచ్చినట్టు చూపించి మన గూగుల్ పేకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మొబైల్ కు వచ్చిన ఫేక్ మెసేజ్ లను, ఫేక్ స్క్రాచ్ కార్డులను నమ్మితే మన ఖాతాలలోని డబ్బులు మాయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గూగుల్ పే నుంచి అరుదుగా మాత్రమే పెద్ద మొత్తంలో రివార్డులు లభిస్తాయి. అందువల్ల ఎక్కువ మొత్తం రివార్డులను చూసి ఆశ పడి మన వివరాలు అందజేస్తే మాత్రం మనం ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.