Tag Archives: Heavy Rains

భారీ వర్షాల కారణంగా.. మునిగిన 12 పడవలు.. 11 మంది గల్లంతు..!

దక్షిణ గుజరాత్‌లో వాతావరణంలో అకస్మాత్తుగా మారిపోయింది. దీంతో పలు నగరాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో.. గిర్-సోమ్‌నాథ్ సమీపంలోని అరేబియా సముద్రంలో బలమైన గాలులు తలెత్తాయి. 12 మత్స్యకారులకు సంబంధించి పడవలు మునిగిపోయాయి. ఈ పడవల్లో 23 మంది మత్స్యకారులు ఉండగా.. వారిలో 11 మంది గల్లంతయ్యారు.

మత్స్యకారుల జాడ కోసం అధికారులు నేవీ సహాయం తీసుకున్నారు. అదే సమయంలో రెండు ఆర్మీ హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. ఒక రోజు ముందుగానే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ కల్లోల ప్రభావంతో దక్షిణ గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అంతే కాకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. సముద్రంలో ఎక్కువ దూరం చేపలు పట్టడానికి వెళ్లే మత్స్యకారులను ముఖ్యంగా హెచ్చరించారు. అయితే వాళ్లు చెప్పిన విధంగానే ఎక్కువ దూరం చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు తమ పడవలు తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ 12 పడవలు మాత్రం ముందుగానే ఒడ్డుకు చేరుకోలే పోయారు.

దీంతో ఎవరూ ఊహించని విధంగా అలలు ఎక్కువగా కావడంతో.. వాళ్లు ఆ అలల్లో చిక్కుకుపోయారు. వాళ్ల జాడ కోసం అధికారులు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. దక్షిణ గుజరాత్ లో వర్షం కారణంగా ఒకే రోజులో మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. డయ్యూలో కూడా బలమైన గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా అక్కడ ఓ పడవ మునిగిపోవడంతో ఒక మత్స్యకారుడు మరణించాడు.

తిరుపతిలో వింత ఘటన.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..!

ఇటీవల తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. దాని ఎఫెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతికి తాకింది. అక్కడ కూడా విపరీతమైన వర్షం కురవడంతో.. తిరుమలపై ఎన్నో కట్టడాలు నేలమట్టం అయ్యాయి. భక్తులు వెళ్లే దారి మొత్తం స్తంభించిపోయింది.

తిరుమల దర్శనానికి వచ్చే భక్తులను కూడా రావొద్దని అధికారులు సూచించారు. అయితే అక్కడి పరిస్థితులు ఇప్పుడు బాగానే ఉన్నాయి. భక్తులు కూడా వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. అయితే శ్రీకృష్ణానగర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ రింగులతో నిర్మించిన ఓ వాటర్ ట్యాంక్​.. భూమిలోంచి పైకి వచ్చింది. దీన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

వర్షాల కారణంగా నీరంతా ఒకేదగ్గర చేరడంతో.. తిరుపతి శ్రీ కృష్ణా నగర్‌లో అక్కడి కట్టడాలు, వస్తువుల అన్నీ మునిగిపోయాయి. అక్కడ భూమి లోపల పాతిపెట్టిన ఓ నీటి ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా.. భూమి ఉపరితలం పైకి ఎగసి వచ్చింది. అది దాదాపు 25 సిమెంట్ వరలతో నిర్మించారు. దాదాపు అది 25 అడుగుల విస్తీర్ణంతో ఉంది.

ఇలాంటిది ఒక్కసారిగా బయటపడటం కాస్త ఆసక్తికరంగా మారింది. నీటి తొట్టిలోకి దిగి మహిళ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె ఒక్కసారిగి ఉలిక్కిపడిపోయింది. కంగారు పడి కళ్లు మూసుకున్న సందరు మహిళ కళ్లు తెరిచి చూసే సరికి భూమి ఉపరితలంలో ఉంది. ప్రస్తుతం ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది.

చెల్లాచెదురైన జీవితాలు అంటూ ఏపీ వరదలపై స్పందించిన రాములమ్మ..!

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అధికంగా పడటంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది. ఇదిలా ఉండగా ఏపీ వరదలపై తాజాగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు సినీ నటి విజయశాంతి స్పందించారు. తుఫాను ప్రభావం వల్ల రాయలసీమ దక్షిణ కోస్తాలోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.

ఈ క్రమంలోనే విజయశాంతి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ కన్నీటి కడలిలా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు రాయలసీమ జిల్లాలను చూస్తే గుండె బరువెక్కుతోంది. అధిక వర్షం ప్రభావం కారణంగా వాగులు వంకలు పొంగి గ్రామాలను నీటిలో ముంచేశాయి.

కళ్ళ ముందే ఎన్నో మూగజీవాలు కుటుంబసభ్యులు కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది అలాగే చేతికొచ్చిన పంట నాశనం కావడంతో ఎంతో మంది జీవితాలు చెల్లాచెదురై పోయాయి. వీరి జీవితాలు ఎప్పటికీ తేరుకు ఉంటాయో అంటూ విజయశాంతి ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ వీరికి తోడుగా మానవవనరుల సహాయం అవసరం అనిపిస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా ఎన్సీసీ విద్యార్థులను తీసుకుంటే త్వరగా ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయట పడవచ్చు అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. రాయలసీమలోని పలు జిల్లాలలో వరద బీభత్సం అధికంగా ఉండటం వల్ల ఇప్పటికే పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అండగా నిలబడ్డాయి.

ఆ కుటుంబాలకు రెండు వేల తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం జగన్!

ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా రోడ్లు, నదులు, కాలువలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి కూడా పెద్ద ఎత్తున నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గుప్పుగుప్పు మంటూ బతుకుతున్నారు. ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాలలో కుండపోత వర్షాల కారణంగా చాలా మంది గల్లంతయ్యారు. పలుచోట్ల మూగజీవాలు కొట్టుకుపోయాయి. వర్షం బీభత్సం కారణంగా అక్కడి ప్రజలకు వెంటనే సహాయ సహకారాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

ఏపీ లోని మూడు జిల్లాలకు వెంటనే ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ క్రమంలోనే నెల్లూరుకు సీనియర్ అధికారి రాజశేఖర్, చిత్తూరుకు ప్రద్యుమ్న, కడపకు శశిభూషణ్ కుమారులను నియమించారు. బాధితులను ఆదుకోవడానికి యుద్ధప్రాతిపదికన పని చేయాలని ఆదేశించారు. వరద బీభత్స ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు ఇవ్వాలని సూచించారు. అలాగే వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

పరిహారాలను వీలైనంత త్వరగా అందించాలని వైయస్ జగన్ ఆదేశించారు. పంటల నష్టంపై అంచనాలు వేసి రైతులు మళ్లీ పంటలు వేసుకునేందుకు విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించారు. అలాగే చెరువులు, రిజర్వాయర్లు, పక్కన ఉన్న గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అలాగే తిరుమల తిరుపతికి వచ్చిన భక్తులకు సహాయంగా ఉండాలని అధికారులను ఆదేశించారు జగన్. రైలు విమానాలు రద్దు అయిన కారణంగా వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండాలని అన్నారు. ఇప్పటికే కడప జిల్లాలో వరదలతో స్వర్ణముఖీ నది ఉద్ధృతతో రోడ్డు తెగిపోయింది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు రోడ్లు,బ్రిడ్జీలు కొట్టుకుపోతున్నాయి. ఇక అనంతపురం జిల్లా చిత్రావతి నది ఉధృతంగా ప్రవహించడంతో నదిలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. ఇలా ఏపీలో పలు ప్రదేశాలలో వరద బీభత్సం వల్ల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు.

వర్షాల కారణంగా కొట్టుకుపోయిన కోళ్ల ఫాం.. డజన్ల కొద్ది కోళ్లను పట్టుకెళ్లిన గ్రామస్తులు..

ప్రస్తుతం వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ వర్షాల కారణంగా కుంటలు, చెరువులు నిండిపోయి పొంగి పారుతున్నాయి. ఈ నేపథ్యంలో జాక్రాన్ పల్లి మండలం చింతలూరులో భారీ వర్షాలకు ఆ ఊరి చెరువు అలుగు ఉప్పొంగుతోంది.

చెరువు నిండి భారీగా మత్తడి దూకుతోంది. అయితే ఆ చెరువు పక్కనే ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి కోళ్ల ఫాం ఉంది. ఇది ఆ నీటి ప్రవాహానికి కొట్టకుపోయింది. దీంతో అందులో ఉండే కోళ్లు ఆ పొలాల్లోకి వెళ్లి కొట్టుకుపోయాయి. అక్కడ పొలాలు అన్నీ నీట మునిగిపోయాయి. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. గుంపులు గుంపులుగా ఆ ప్రదేశానికి చేరుకున్నారు.

ఒక్కొక్క వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా డజన్ల కొద్ది కోళ్లను ఇంటికి పట్టుకొని వెళ్లారు. దీంతో చింతలూరు గ్రామస్తులు కోడి కూరతో సంతోషంగా దావత్ చేసుకుంటున్నారు. కిలోల చొప్పున కాకుండా ఏకంగా డజన్ల కొద్ది కోళ్లను పట్టుకెళ్లి పండగ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలియడంతో ఆ గ్రామ చుట్టు పక్కల గ్రామస్తులు కూడా ఆ ప్రదేశానికి చేరుకొని కోళ్ల కోసం వెతకడం మొదలుపెట్టారు. అయితే బాధితుడు ప్రదీప్ రెడ్డి మాత్రం తమను ఆదుకోవాలని.. ఆ వరద ప్రవాహానికి తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.