Tag Archives: hyderabed

Upasana: ఆ ఒక్క కారణంతోనే తిరిగి మామయ్య ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం : ఉపాసన

Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం గర్భిణిగా ఉన్న సంగతి మనకు తెలిసిందే మరొక నెల రోజులలో ఈమె బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన గురించి తన ఫ్యామిలీ గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఉపాసన తన గురించి అలాగే తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు.ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన గత కొంతకాలంగా హైదరాబాద్ లోనే ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసి ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్న సంగతి మనకు తెలిసింది. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఆ ఇంటిని కాళీ చేయబోతున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ త్వరలోనే తాను చరణ్ ఇద్దరం కూడా తిరిగి అత్తయ్య మామయ్య ఇంటికి షిఫ్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అంటూ ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అసలు వీరిద్దరూ తిరిగి చిరంజీవి ఇంటికి ఎందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారో కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

Upasana: నా పిల్లలకు ఆ ప్రేమ దక్కాలి…


నేను చరణ్ నేడు ఈ స్థాయిలో ఉన్నాము అంటే అందుకు గల కారణం మా గ్రాండ్ పేరెంట్స్ మాకు వారు పంచిన ప్రేమ వల్లేనని ఈమె తెలియజేశారు. అయితే ఆ ప్రేమ నా పిల్లలకు కూడా దక్కాలి అందుకే తిరిగి తాము తన అత్తయ్య మామయ్య ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా ఉపాసన తెలియజేయడంతో వీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పై అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

డూప్ లేకుండా జంపింగ్ చేయడంతో గాయాలపాలైన హీరో!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని యాక్షన్ సీన్లకు హీరోలు కాకుండా వారి స్థానంలో వారికి డూప్ పెట్టి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం మనం చూస్తూ ఉంటాం. అయితే తాజాగా తమిళ స్టార్ హీరోలైన ఆర్య, విశాల్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఆర్య డూప్ లేకుండా యాక్షన్ సీన్ కోసం జంపింగ్ చేస్తుండగా గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆర్య, విశాల్ అటు తెలుగు, ఇటు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. మొదటగా వరుడు సినిమా ద్వారా విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆర్య ప్రస్తుతం విశాల్ హీరోగా, ఆర్య విలన్ గా నోటా చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు “ఎనిమీ”అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చెన్నైలో షూటింగ్ చేస్తుండగా ఆర్య ఎలాంటి డూప్ లేకుండా జంపింగ్ చేయడంతో గాయాలైనట్లు చిత్రబృందం తెలిపారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత చికిత్స పూర్తవ్వగానే తిరిగి ఆర్య షూటింగ్ లో పాల్గొన్నట్లు చిత్రబృందం తెలిపారు. అంతేకాకుండా ఆర్య అల్లు అర్జున్ తో ఇదివరకే వరుడు సినిమాలు విలన్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే, అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప” సినిమాలో కూడా విలన్ పాత్ర కోసం ఆర్య ను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ ఉన్నారనే సమాచారం వినబడుతోంది.

కేసీఆర్ సంచలన నిర్ణయం.. అపార్ట్‌మెంట్ వాసులకు శుభవార్త..?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజలు పనితీరును బేరీజు వేసుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేయాలని సూచనలు చేశారు. ప్రభుత్వం, నేతలు అభివృద్ధి చేస్తున్న తీరును బట్టి నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. చాలా చైతన్యం, చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్ అని కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రజలకు మంచి చేసే నాయకుడికి ఓటు వేస్తే సేవ చేసే మంచి నాయకులు పుట్టుకొస్తారని.. 2001 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం మొదలుపెట్టిన సమయంలో ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారని పేర్కొన్నారు. తాను రాష్ట్రాన్ని నడపలేనని ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరు వెంకటేశ్వరరావు అన్నారని కానీ ఆరు సంవత్సరాలలో వారి అంచనాలు తలక్రిందులు అయ్యేలా పాలన సాగించానని కేసీఆర్ తెలిపారు.

గతంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉండేవని ప్రజలు ఇన్వర్టర్లు, జనరేటర్లపై ప్రజలు ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదని.. తెలంగాణ వచ్చిన తరువాత 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఎన్నో అనుమానాలు, అపోహల మధ్య టీఆర్ ఎస్ పార్టీని ప్రజలు నమ్మి దీవించారని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణకే తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని తెలిపారు.

నగరంలో 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీరు ఇచ్చామని.. అపార్టుమెంట్ల విషయంలో కూడా 20 వేల లీటర్ల పథకం వర్తిస్తుందని అపార్టుమెంట్ వాసులకు మంచి శుభవార్త చెప్పారు. ఈ నిర్ణయం శాశ్వతంగా అమలులో ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి నిబంధనలివే.. వాళ్లు అనర్హులు..?

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లకు సంబంధించిన నిబంధనలను ప్రకటించింది. అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలకు సంబంధించి స్పష్టత ఇచ్చింది. జూన్‌1, 1994కు ముందు ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్లు, ఆ తరువాత మే 31, 1995 వరకు ఇద్దరు సంతానం ఉన్నవాళ్లు పోటీకి అర్హులు. జూన్‌ 1, 1994కు ముందు ముగ్గురు, మే 31, 1995 మరొకరు, ఆ తరువాత మరొక సంతానం ఉన్నవాళ్లు పోటీకి అనర్హులు.

మే 31,1995 నాటికి ఒక్కరు ఉండి ఒకే కాన్పులో కవలలు జన్మిస్తే పోటీకి అర్హులు. అలా కవలలు కాకుండా వేర్వేరు కాన్పుల్లో ఇద్దరు జన్మిస్తే మాత్రం అనర్హులు. మే 31, 1995 తర్వాత ఒకే కాన్పులో ముగ్గురు జన్మించినా ఎన్నికలలో పోటీ చేయవచ్చని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకుని మొదటి భార్య చనిపోయి ఆమెకు ఇద్దరు సంతానం, రెండో భార్యకు ఒక సంతానం ఉంటే పోటీ చేయడానికి వీలు లేదు.

అయితే అతని రెండో భార్య మాత్రం ఒక సంతానం మాత్రమే ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ముగ్గురు పిల్లలు జన్మించి నామినేషన్ల పరిశీలన సమయానికి ఒకరు చనిపోయినా ఎన్నికల్లో పోటీకి అర్హులు. నామినేషన్ల పరిశీలన నాటికి ఇద్దరు పిల్లలు ఉండి గర్భవతి అయినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. రేషన్ షాపు డీలర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు ఎన్నికల్లో పోటీకి అనర్హులు.

మతిస్థిమితం సరిగ్గా లేని వాళ్లు సైతం ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు సైతం పోటీకి అనర్హులు. ఉద్యోగాలకు రాజీనామా చేస్తే మాత్రం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్ వాసులకు శుభవార్త.. త్వరలో ఆ వ్యాక్సిన్…?

ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం మినహా మరో మార్గం లేదనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రజలకు రష్యా కరోనా వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. స్పుత్నిక్ వి పేరుతో రష్యా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా వ్యాక్సిన్ భారతదేశానికి చేరింది.

రెడ్డి ల్యాబ్స్ ఈ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను మొదలుపెట్టింది. రష్యా కరోనా వ్యాక్సిన్ పై ఇప్పటికే తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా ఈ క్లినికల్ ట్రయల్స్ లో రష్యా కరోనా వ్యాక్సిన్ మంచి ఫలితాలను అందుకుంది. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి రెడ్డీస్ ల్యాబ్స్ సిద్ధమైంది.

చాలా నెలల క్రితమే రష్యా కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేయగా ఆ వ్యాక్సిన్ 92 శాతానికి పైగా సమర్థవంతంగా పని చేస్తుందని రష్యా నుంచి ప్రకటన వెలువడింది. రెండు రోజుల క్రితం ఫైజర్ సంస్థ తమ కరోనా వ్యాక్సిన్ 90 శాతానికి పైగా సమర్థవంతంగా పని చేస్తుందని కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో రష్యా తమ వ్యాక్సిన్ కూడా సమర్థవంతంగా పని చేస్తుందని చెబుతోంది.

స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తుదిదశ క్లినికల్ ట్రయల్స్ లో కూడా సక్సెస్ అయితే మాత్రం హైదరాబాద్ వాసులకు త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.