Tag Archives: investments

నెలకు రూ.1000తో లక్షల్లో సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే..?

సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ రాబడి వచ్చే ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. ప్రతి నెలా కొంత మొత్తం పొదుపు చేసి అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. కొన్ని మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. 5 మార్గాల ద్వారా సులభంగా ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందవచ్చు.

స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్లలో కళ్లు చెదిరే లాభాలు ఏ విధంగా ఉంటాయో ఊహించని స్థాయిలో నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి. సరైన అవగాహనతో మంచి షేర్లను ఎంచుకుని తక్కువ మొత్తంలో సంవత్సరాల తరబడి ఇన్వెస్ట్ చేస్తే కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయి.

దీర్ఘకాలంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. నెలకు 500 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ఒక విధంగా రిస్క్ అనే చెప్పాలి. పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్ లో నగదు డిపాజిట్ చేస్తే మంచి లాభాలు సొంతమవుతాయి.

రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో 10 సంవత్సరాల వరకు డబ్బులు దాచుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో కస్టమర్లకు 3 నుంచి 9 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లో కూడా డబ్బులను డిపాజిట్ చేసే అవకాశాలు ఉంటాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ లో డబ్బులు పెడితే పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 6.8 శాతం వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.

డబ్బు రెట్టింపు చేసే పోస్టాఫీస్ స్కీమ్.. అదిరిపోయే లాభాలు గ్యారంటీ..?

మనలో చాలామంది డబ్బు పెట్టుబడుల విషయంలో రిస్క్ తక్కువగా ఉండాలని.. లాభాలు ఎక్కువగా ఉండాలని భావిస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న డబ్బులను రెట్టింపు చేసే స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటూ ఉంటారు. తక్కువ పెట్టుబడితో రెట్టింపు లాభాలను సొంతం చేసుకోవాలనుకునే వాళ్ల కోసం పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్ లను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా గ్యారంటీగా లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

పోస్టాఫీస్ ఎన్నో రకాల కొత్తకొత్త స్కీమ్ లను ఆఫర్ చేస్తుండగా వాటిలో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కూడా ఒకటి ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎలాంటి రిస్క్ లేకపోవడంతో పాటు లాభాలను ఖచ్చితంగా సొంతం చేసుకోవచ్చు. అయితే రిస్క్ లేకపోయినప్పటికీ రెట్టింపు లాభాలను పొందాలంటే మాత్రం దీర్ఘకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కేంద్రం పోస్టాఫీస్ ల ద్వారా అమలు చేస్తున్న స్కీమ్ కావడంతో డబ్బు గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

కనీసం 1000 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 124 నెలలు కాగా పెట్టుబడి పెట్టిన 124 నెలల తరువాత డబ్బులు గ్యారంటీగా రెట్టింపు అవుతాయి. ఈ స్కీమ్ కు జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 6.9 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.

గరిష్ట పరిమితి అనేది లేకపోవడం వల్ల ఇన్వెస్ట్ చేసే వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ స్కీమ్ లో 18 సంవత్సరాల వయస్సు పై బడిన వాళ్లు మాత్రమే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో రెండు లక్షలు పెడితే నాలుగు లక్షలు, 20 లక్షలు పెడితే 40 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.