Tag Archives: jagan government

EBC Nestam: ఆ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. త్వరలోనే వారి ఖాతాలో 15 వేలు జమ!

EBC Nestam: రాష్ట్రంలో వెనుకబడిన అగ్రవర్ణ పేద మహిళలకు జగన్ సర్కార్ శుభవార్తను తెలియజేసింది.ఈ క్రమంలోనే అగ్రవర్ణంలో పేద మహిళలకు చేయూత ఇవ్వడం కోసం ఆర్థికంగా జగన్ ప్రభుత్వం సహాయం చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 25వ తేదీ నుంచి ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

EBC Nestam: ఆ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. త్వరలోనే వారి ఖాతాలో 15 వేలు జమ!

ఈ విధంగా ఈ పథకానికి అర్హులైన మహిళలందరికీ ఈనెల 25వ తేదీ నుంచి 15 వేల చొప్పున వారి ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు. అయితే ఈ పథకానికి కాపు నేస్తం, వైయస్సార్ చేయూత, ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీ మహిళలు అనర్హులుగా ప్రకటించారు.

EBC Nestam: ఆ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. త్వరలోనే వారి ఖాతాలో 15 వేలు జమ!

కేవలం ఈబీసీ కి చెందిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అదేవిధంగా లబ్ధిదారుల అయిన మహిళకు ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు బుక్కు ఉండాలి. అలాగే గ్రామాల్లో అయితే నెలకు 10 వేల ఆదాయం మించకూడదు పట్టణాలలో 12 వేల ఆదాయం మించకూడదు.

ఈ పథకానికి వీరు అనర్హులు..

ఈ పథకానికి అర్హులు కావాలంటే అభ్యర్థికి మూడు ఎకరాల కన్నా మాగాణి తక్కువగా ఉండాలి అదే విధంగా 10 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండకూడదు. ఇలా భూమి ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. అదేవిధంగా లబ్ధిదారుడి కుటుంబంలో ఎవరికీ పెన్షన్ రాకూడదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు.అదేవిధంగా ఫోర్ వీలర్ ఉన్నవారు కూడా ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.

Ram Gopal Varma: టికెట్స్ విషయంలో జగన్ తీరు మండిపడ్డ వర్మ !

Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వం.. టాలీవుడ్ కు మధ్య టికెట్ రేట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. థియేటర్ల టికెట్ రేట్లను ప్రభుత్వం తగ్గిండచంతో ఇండస్ట్రీ పెద్దలు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ కు తీవ్ర నష్టం కలిగిస్తుందన వారంతా అంటున్నారు.

Ram Gopal Varma: జగన్ ప్రభుత్వపై వర్మ షాకింగ్ కామెంట్స్.. ఇంత దైర్యం ఏంటో?

మరోవైపు పేదలు సినిమా చూసే విధంగా టికెట్ రేట్లను తీసుకువచ్చినట్లు ప్రభుత్వ పెద్దలు వెల్లడిస్తున్నారు.  ఇదిలా ఉంటే ఇటీవల నాని, సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హీరో నాని థియేటర్ల కలెక్షన్ల కన్నా.. కిరాణా కొట్టు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తీవ్ర వివాదాన్ని రాజేశాయి.

టికెట్స్ విషయంలో జగన్ తీరు మండిపడ్డ వర్మ !

ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్నినాని కూడా అంతే స్థాయిలో ఫైర్ అయ్యారు. మరికొంత మంది మంత్రులు సినిమా హీరోలు వాళ్ల రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే  టికెట్ ధరలు అదుపులోనే ఉంటాయని అన్నారు.
ఇదిలా ఉంటే సెన్సెషనల్ డైరెక్టర్ వర్మ కూడా.. ఈ వివాదంపై స్పందించారు.

ప్రభుత్వంపై నేరుగా విమర్శలు..

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా  ఉండే వర్మ జగన్ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేశారు. థియేటర్ల టికెట్ రేట్లు, తెలుగు ఇండస్ట్రీపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా.. ఇండస్ట్రీ పెద్దలు స్పందించకపోవడంలో వింతేమీ లేదని వర్శ అన్నారు. ఇండస్ట్రీ పెద్దలు అంటే వెల్ సెటిల్డ్ అని.. వారు మాట్లాడిన అవసరం కూడా లేదని.. వారు కావాలని ప్రభుత్వంతో ఎందుకు గొడవ పెట్టుకుంటారు అని వర్మ అన్నారు. హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని ప్రభుత్వం చేస్తున్నవి స్టుపిడ్ ఆర్గుమెంట్స్ అని.. నిర్మాత ఎంత డబ్బు పెట్టి సినిమా తీశాడని ఎవ్వరూ… చూడరని.. ఏ హీరో సినిమా అని మాత్రమే చూస్తారని.. సినిమాకు హీరో బ్రాండ్ అంటూ వర్మ అన్నారు.

సినీ పరిశ్రమ జోలికి వస్తే .. చూస్తూ ఉరుకోం.. వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఫైర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుంచి సినీ పరిశ్రమకు సంబంధించి విషయాలను మాత్రమే పట్టించుకుంటూ.. తన రాజకీయ విషయాలను పక్కకు పెట్టేశారు. కానీ రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వం ఫైర్ అయ్యారు. నా కారణంగా ఏపీలో సినీ ఇండస్ట్రీని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందనే విధంగా పవన్ వ్యాఖ్యానించారు. తన సినిమాలు ఆపేస్తే భయపడిపోతారని వైసీపీ నాయకులు అనుకుంటున్నారని చెబుతూ.. తన పేరు చెప్పి ఇండస్ట్రీని చావగొడుతున్నారని ఆక్రోశించారు.

సన్నాసి మంత్రి’ అంటూ పేర్ని నానిపై మండిపడ్డారు. చిరంజీవి అంటే సోదర భావన అని ఆ సన్నాసి అంటారు. సోదిలో సోదర భావన.. చిత్ర పరిశ్రమకు ఉపయోగపడని ఆ సోదర భావన ఎందుకంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు ఉపరాష్ట్రపతి వెంకయ్యపైనా నీచంగా మాట్లాడారు… భారత ప్రధాన న్యాయమూర్తిపైనే దాడులు చేశారు.

వీళ్లకు సినిమా పరిశ్రమ ఒక లెక్కా.. వారి లక్ష కోట్ల ముందు రెండువేల కోట్ల విలువైన పరిశ్రమ ఎంత.. అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. సినిమా టికెట్ల ద్వారా ఆడబ్బులను బ్యాంకులకు చూపించి కొత్త అప్పులు తెచ్చుకోవాలనే ఆరాటంలో ఉన్నారన్నారు.

లోన్ల కోసమే సినిమా పరిశ్రమ డబ్బులు వాడుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వకీల్ సాబ్ సినిమా లేకుంటే.. ఏపీలో సినిమాలు రిలీజ్ అయ్యుండేవి. ప్రైవేట్ పెట్టుబడితో మేము సినిమాలు చేస్తుంటే, ప్రభుత్వం కంట్రోల్ చేయడమేంటి? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ఏపీలో ఆ కులం వాళ్లకు శుభవార్త.. ఖాతాల్లో రూ.15 వేలు జమ..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పథకాల అమలు విషయంలో మాత్రం జగన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒకటీఅరా మినహా మిగిలిన అన్ని హామీలను జగన్ ఇప్పటికే నెరవేర్చారు. జగన్ సర్కార్ అర్హత ఉండి పథకాలలో పేరు రాకపోతే వాళ్లకు మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల గత ప్రభుత్వాలకు భిన్నంగా సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర ప్రజానీకం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జగన్ సర్కార్ వైఎస్సార్ కాపు నేస్తం రెండో విడత అమలుకు సిద్ధమవుతోంది. కొందరు వైఎస్సార్ కాపునేస్తం స్కీమ్ కు అర్హులైనా వివిధ కారణాల వల్ల ఈ పథకానికి అర్హత పొందలేదు. దీంతో ప్రభుత్వం కొత్తగా కాపు నేస్తంలో చేరిన లబ్ధిదారులకు ఖాతాలలో 15 వేల రూపాయల చొప్పున నగదు జమ చేసింది. కాపు కులంలో వెనుకబడిన వారిని ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా ఆదుకోనుంది.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా జగన్ సర్కార్ కాపుల కోసం ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. 45 నుంచి 60 సంవత్సరాల మద్య వయస్సు ఉన్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాల మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.