EBC Nestam: రాష్ట్రంలో వెనుకబడిన అగ్రవర్ణ పేద మహిళలకు జగన్ సర్కార్ శుభవార్తను తెలియజేసింది.ఈ క్రమంలోనే అగ్రవర్ణంలో పేద మహిళలకు చేయూత ఇవ్వడం కోసం ఆర్థికంగా జగన్ ప్రభుత్వం సహాయం చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 25వ తేదీ నుంచి ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
ఈ విధంగా ఈ పథకానికి అర్హులైన మహిళలందరికీ ఈనెల 25వ తేదీ నుంచి 15 వేల చొప్పున వారి ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు. అయితే ఈ పథకానికి కాపు నేస్తం, వైయస్సార్ చేయూత, ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీ మహిళలు అనర్హులుగా ప్రకటించారు.
కేవలం ఈబీసీ కి చెందిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అదేవిధంగా లబ్ధిదారుల అయిన మహిళకు ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు బుక్కు ఉండాలి. అలాగే గ్రామాల్లో అయితే నెలకు 10 వేల ఆదాయం మించకూడదు పట్టణాలలో 12 వేల ఆదాయం మించకూడదు.
ఈ పథకానికి అర్హులు కావాలంటే అభ్యర్థికి మూడు ఎకరాల కన్నా మాగాణి తక్కువగా ఉండాలి అదే విధంగా 10 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండకూడదు. ఇలా భూమి ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. అదేవిధంగా లబ్ధిదారుడి కుటుంబంలో ఎవరికీ పెన్షన్ రాకూడదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు.అదేవిధంగా ఫోర్ వీలర్ ఉన్నవారు కూడా ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…