Trisha: ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్ త్రిష… వరుడు ఎవరంటే?
Trisha: గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న నటి త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
త్రిష కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈమె కెరీర్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక వార్త ద్వారా వైరల్ అవుతుంటారు. ఈ క్రమంలోనే ఈమెకు గతంలో ఎంతో మంది హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే త్రిష కొన్ని సంవత్సరాల క్రితం పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌తో ఆమె ఎంగేజ్మెంట్ చేసుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈమె ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. అప్పటి నుంచి త్రిష పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే త్రిష ఈ వార్తలపై స్పందిస్తూ తను గురించి వస్తున్న పుకార్లను కొట్టిపడేశారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడితో త్రిష ప్రేమలో ఉందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, ఆ డైరెక్టర్ తోనే త్రిష ఏడడుగులు వేయబోతుందని తెలుస్తోంది.త్వరలోనే ఈ విషయం గురించి త్రిష అధికారకంగా తెలియ చేయనున్నట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…