Categories: FeaturedMovie News

సినీ పరిశ్రమ జోలికి వస్తే .. చూస్తూ ఉరుకోం.. వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఫైర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుంచి సినీ పరిశ్రమకు సంబంధించి విషయాలను మాత్రమే పట్టించుకుంటూ.. తన రాజకీయ విషయాలను పక్కకు పెట్టేశారు. కానీ రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వం ఫైర్ అయ్యారు. నా కారణంగా ఏపీలో సినీ ఇండస్ట్రీని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందనే విధంగా పవన్ వ్యాఖ్యానించారు. తన సినిమాలు ఆపేస్తే భయపడిపోతారని వైసీపీ నాయకులు అనుకుంటున్నారని చెబుతూ.. తన పేరు చెప్పి ఇండస్ట్రీని చావగొడుతున్నారని ఆక్రోశించారు.

సన్నాసి మంత్రి’ అంటూ పేర్ని నానిపై మండిపడ్డారు. చిరంజీవి అంటే సోదర భావన అని ఆ సన్నాసి అంటారు. సోదిలో సోదర భావన.. చిత్ర పరిశ్రమకు ఉపయోగపడని ఆ సోదర భావన ఎందుకంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు ఉపరాష్ట్రపతి వెంకయ్యపైనా నీచంగా మాట్లాడారు… భారత ప్రధాన న్యాయమూర్తిపైనే దాడులు చేశారు.

వీళ్లకు సినిమా పరిశ్రమ ఒక లెక్కా.. వారి లక్ష కోట్ల ముందు రెండువేల కోట్ల విలువైన పరిశ్రమ ఎంత.. అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. సినిమా టికెట్ల ద్వారా ఆడబ్బులను బ్యాంకులకు చూపించి కొత్త అప్పులు తెచ్చుకోవాలనే ఆరాటంలో ఉన్నారన్నారు.

లోన్ల కోసమే సినిమా పరిశ్రమ డబ్బులు వాడుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వకీల్ సాబ్ సినిమా లేకుంటే.. ఏపీలో సినిమాలు రిలీజ్ అయ్యుండేవి. ప్రైవేట్ పెట్టుబడితో మేము సినిమాలు చేస్తుంటే, ప్రభుత్వం కంట్రోల్ చేయడమేంటి? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago