Movie News

నాతో వకీల్ సాబ్ సినిమా ఎందుకు తీశావయ్యా : పవన్ కళ్యాణ్

దిల్ రాజుపై పవన్ కళ్యాణ్ ఓ రేంజిలో విరుచుకుపడ్డాడు. సీఎం జగన్ రెడ్డే.. నువ్వు కూడా రెడ్డే కదా.. వెళ్లి అడుగు అంటూ పవన్ ఫైర్ అయ్యారు. దిల్ రాజు అంటే సినిమా ప్రముఖులకు మాత్రమే తెలుస్తుంది..కానీ నేను కూడా రెడ్డి అని చెప్పు.. సీఎం జగన్ నీ పట్ల సానుకూలత చూపిస్తాడేమో.. వెళ్లి అడుగు అంటూ పవన్ ఆక్రోశంతో మాట్లాడారు.

అస్సలు తనతో వకీల్ సాబ్ ఎందుకు తీశావయ్యా.. నా సినిమా తియ్యకపోతే ఇప్పుడు ఆంధ్రాలో కొన్ని వందల సినిమాలు రిలీజ్ అయ్యేయి. నా సినిమా తీసి తప్పు చేశావ్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పవర్ స్టార్. రిపబ్లిక్ మూవీ ఫ్రీ రిలీజ్ వేదికగా పవన్ ఆవేశంతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పరిశ్రమ పెద్దలు, వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు నిర్మాతలకు హాని చేకూరే విధంగా ఉన్నాయని.. అటువంటి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు.

ఈ క్రమంలో అతడు ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై వివాదాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మీరు రెడ్డే కదా.. మీరు వెళ్లి మాట్లాడండి.. అప్పుడు సీఎం వింటాడేమో అంటూ మాట్లాడారు. అప్పుడైన సినీ వర్గాలకు మేలు చేకూరుతుందన్నారు. దిల్ రాజు అంటే తెలియదేమో నేను రెడ్డి అని చెప్పు.. సీఎం జగన్ నీ పట్ల సానుకూలత చూపిస్తాడేమో అన్నారు. తనతో వకీల్ సాబ్ సినిమా తీయకపోతే.. ఆంధ్రాలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యేవని.. తనతో ఎందుకు వకీల్ సాబ్ తీశావంటూ ఆగ్రహంతో మాట్లాడారు.

ఇదిలా ఉండగా.. సాయితేజ్, దేవ కట్టా కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం వచ్చే నెల అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు వచ్చిన పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర ఈ వ్యాఖ్యలు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago