Tag Archives: jobs

నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా రూ.1,50,000 వేతనంతో జాబ్స్..?

ఎయిర్ఇండియా లిమిటెడ్ కు చెందిన అలయ‌న్స్ ఎయిర్ ఏవియేష‌న్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 1,50,000 రూపాయల వేతనంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రభుత్వ విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ మొత్తం 23 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. విడుదలైన నోటిఫికేషన్ లో హెడ్ ఇంజినీరింగ్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్, డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, ఎయిర్ఇండియా లిమిటెడ్ కు చెందిన అలయ‌న్స్ ఎయిర్ ఏవియేష‌న్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 1,50,000 రూపాయల వేతనంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రభుత్వ విమానయానహెడ్ రెవెన్యూ మేనేజ్ ‌మెంట్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

ఇంటర్, డిప్లోమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులై అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 1,50,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 15వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. http://www.airindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తివివరాలను తెలుసుకోవచ్చు.

ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 1500 రూపాయలు కాగా ఆఫ్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలియ‌న్స్ ఎయిర్, ప‌ర్స‌న‌ల్ డిపార్ట్‌మెంట్, అలియ‌న్స్ భ‌వ‌న్, డొమెస్టిక్ టెర్మిన‌ల్‌-1, ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌, న్యూదిల్లీ-110037 అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

35 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంటుంది.

టెన్త్ పాసైన వాళ్లకు శుభవార్త.. భారీ వేతనంతో 358 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

‌ ఇండియ‌న్ కోస్ట్ గార్డు పదోతరగతి పాసైన వాళ్లకు శుభవార్త చెప్పింది. నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 358 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం జనవరి 5వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2021 సంవత్సరం జనవరి 19 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

మొత్తం 358 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా నావిక్ జ‌న‌ర‌ల్ డ్యూటీ ఉద్యోగాలు 260, నావిక్ డొమెస్టిక్ డ్యూటీ 50 ఉద్యోగాలు, యాంత్రిక్ మెకానికల్ 31, యాంత్రిక్ ఎలక్ట్రికల్ 7, యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ 10 ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతల్లో మార్పులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ, ఓబీసీ అభ్యర్థులు 250 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు https://joinindiancoastguard.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలలో కొన్ని ఉద్యోగాలకు పదో తరగతి అర్హత కాగా మరికొన్ని ఉద్యోగాలకు ఇంటర్ విద్యార్హతగా ఉంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వివిధ దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష, రెండో దశలో ‌ క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, మూడో దశలో మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేస్తే మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హత పొందవచ్చు.

నిరుద్యోగులకు ఇస్రో బంపర్ ఆఫర్.. రూ. 2 లక్షల వేతనంతో ఉద్యోగాలు..?

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు, ప్రతిభ ఉన్న విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2 లక్షల రూపాయల వేతనంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 61 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్రో నుంచి విడుదలైంది. https://www.vssc.gov.in/vssc/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎం.ఈ, ఎంటెక్, పీహెచ్డీ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 సంవత్సరం జనవరి 4వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. పోస్టుల ఆధారంగా 74,660 రూపాయల నుంచి 2,08,000 రూపాయల వరకు ఉన్నాయి. ఎంపికైన ఉద్యోగాన్ని బట్టి వేతనంలో మార్పులు ఉంటాయి. ఇస్రో విడుదల చేసిన నోటిఫికేషన్ లో పలు ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంది.

కొన్ని ఉద్యోగాలకు మాత్రం ఎటువంటి వయోపరిమితి నిబంధనలు లేవు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం లేకపోయినా, ఫోటో, సంతకంలలో పొరపాట్లు చేసినా దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు 250 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండగా ఫిమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.

నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త.. రూ.45 వేల వేతనంతో ఉద్యోగాల భర్తీ..?

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 727 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బ్రాడ్ కాస్ట్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ లో వేర్వేరు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్ ఇండియా ఇన్‌సిట్యూట్‌‌ ఆఫ్ మెడికల్ సైన్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 26 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

https://www.becil.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మెకానిక్, లైన్ మెన్, స్టోర్ కీపర్, వైర్ మెన్, ప్లంబర్, ఆపరేటర్, అసిస్టెంట్ ల్యాండ్రీ సూపర్ వైజర్, స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, శానిటరీ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒక్కో ఉద్యోగానికి ఒక్కో విద్యార్హత ఉండగా ఉద్యోగాన్ని బట్టి 20,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు అధికారిక వెబ్ సైట్ అయిన https://www.becil.com/ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 10వ తరగతి, ఇంటర్ పాసైన వాళ్లకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలకు మాత్రం ఐటీఐ, డిప్లొమా చదివిన వాళ్లు మాత్ర్మే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 830 రూపాయలుగా ఉంది. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు మాత్రం 600 రూపాయలు ఫీజు చెల్లించి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా అర్హత, వేతనం దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఇతర వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

యువతకు అదిరిపోయే శుభవార్త.. నేవీలో భారీ వేతనంతో ఉద్యోగాలు..?

ఇండియ‌న్ నేవీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 210 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మహిళలు, పెళ్లి కాని పురుషుల నుంచి ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్, ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది.

ఆన్ లైన్ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పోస్టులను బట్టి వేరువేరు అర్హతలు ఉన్నాయి. మొత్తం 210 ఉద్యోగాలలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌ ఉద్యోగాలు 122 ఉండగా టెక్నికల్ ఉద్యోగాలు 70, ఎడ్యుకేష‌న్ బ్రాంచ్ ఉద్యోగాలు 18 ఉన్నాయి.

కరోనా విజృంభణ నేపథ్యంలో ఇండియన్ నేవీ పరీక్షలు నిర్వహించకుండా మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తుంది. మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూతో పాటు మెడికల్ పరీక్షలను నిర్వహిస్తారు. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభిస్తుంది.

బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, బీఎస్సీ, బీకాం, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చదివిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ కేరళలో శిక్షణ ఉంటుంది.

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 9 వేల ఉద్యోగాల భర్తీ..!

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతోంది. కొన్ని రోజుల క్రితం సీఎం కేసీఆర్ 50,000 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నట్టు కీలక ప్రకటన చేయగా ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కార్యాచరణను మొదలుపెట్టామని ఒక్క సంతకంతో 50 వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలపనున్నామని వెల్లడించారు.

అయితే ఈ ఉద్యోగాలతో పాటు మరో 9,000 ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైన కార్పొరేషన్లలో, సహకార సంస్థలైన సొసైటీల్లో ఉద్యోగాల భర్తీ చేయడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. అన్ని శాఖల కార్యదర్శులకు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల 50,000 ఉద్యోగాలతో పాటు మరో 9,000 ఉద్యోగాలకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల కానుందని తెలుస్తోంది. రాష్ట్రంలో సొసైటీలు, సంస్థలు మొత్తం 190 ఉండగా వీటిలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరిగి రెండు సంవత్సరాలు కావడంతో నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలని భావిస్తున్నారు.

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు సైతం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావడానికి పరోక్షంగా కారణమవుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు తక్కువ వేతనాలతో కాంట్రాక్ పై పని చేస్తున్న ఉద్యోగులు పర్మినెంట్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే బాగుంటుందని కాంట్రాక్ట్ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇంజనీరింగ్, ఎంబీఏ చదివిన వాళ్లకు శుభవార్త.. రూ.35 వేల వేతనంతో ఉద్యోగాలు..?

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెల్ కంపెనీ 137 ట్రెయినీ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదిన ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంజనీరింగ్, ఎంబీఏ ఫైనాన్స్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు గజియాబాద్ లోని బెల్ కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. https://www.bel-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 137 ఉద్యోగాలలో ట్రెయినీ ఇంజినీర్ ఉద్యోగాలు 70 ఉండగా ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు 61, ట్రెయినీ ఆఫీసర్ ఉద్యోగాలు 6 ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ట్రెయినీ ఆఫీస‌ర్ ‌(జ‌న‌ర‌ల్‌) ఉద్యోగాలకు 25 సంవత్సరాలు, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 28 సంవత్సరాల లోపు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపులు ఉంటాయి.

ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు వేతనం 35,000 రూపాయలు కాగా ట్రెయినీ ఇంజనీర్, ట్రెయినీ ఆఫీసర్ ఉద్యోగాలకు 25,000 రూపాయల వేతనం లభిస్తుంది. జనరల్, ఈడ‌బ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 500 రూపాయలు. ట్రెయినీ ఇంజనీర్, ట్రెయినీ ఆఫీసర్ ఉద్యోగాలకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

డిగ్రీ ఉత్తీర్ణతతో భారీ జాబ్‌ నోటిఫికేషన్.. వేతనం ఎంతంటే..?

నిరుద్యోగ అభ్యర్థులు జాబ్ నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు నోటిఫికేషన్లను విడుదల చేయగా ఎక్కువ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్లు విడుదలైతే నిరుద్యోగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేయగా మరో భారీ నోటిఫికేషన్ కు సిద్ధమైంది. గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల భర్తీ కోసం డిసెంబర్ 21న నోటిఫికేషన్ విడుదల కానుంది.

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ ను గూగుల్ విడుదల చేయనుంది. ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా అభ్యర్థులు 2021 సంవత్సరం జనవరి లోపు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://ssc.nic.in/ వెబ్ సైట్ లో గ్రూప్ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా 2021 సంవత్సరం మే నెల 9వ తేదీ నుంచి 2021 సంవత్సరం జూన్ నెల 7 వరకు పరీక్షలు జరుగుతాయి.

పోస్టులను బట్టి ఆయా సబ్జెక్టులలో బ్యాచిలర్స్ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. గతేడాది ఇదే సమయంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 9488 ఉద్యోగల భర్తీ చేసింది.

ఈ ఏడాది అంతకంటే ఎక్కువ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్, సబ్ ఇన్‌స్పెక్టర్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుందని తెలుస్తోంది.

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. విభాగాల వారీగా ఖాళీలు ఇవే..?

తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు రెండు రోజుల క్రితం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రం ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఉద్యోగాల భర్తీ చేపడుతోంటే సీఎం కేసీఆర్ మాత్రం నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గత కొన్నేళ్ల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో సీఎం కేసీఆర్ త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపట్టబోతున్నట్టు కీలక ప్రకటన చేశారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. విద్యాశాఖ అధికారుల సమాచారం ప్రకారం రాష్ట్రంలో 15,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఖాళీల్లో విద్యా వాలంటీర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.

విద్యాశాఖతో పోల్చి చూస్తే పోలీస్ శాఖలో ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుందని సమాచారం. కేసీఆర్ సర్కార్ ఏకంగా 20,000 పోలీస్ ఉద్యోగాల భర్తీ చేయనుందని తెలుస్తోంది. హోం శాఖ వర్గాల నుంచి ఈ మేరకు సమాచారం అందుతోంది. వైద్య, ఆరోగ్య శాఖలో 12,000 ఉద్యోగాలు, రెవెన్యూ శాఖలో 4 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అయితే మొత్తం 50,000కు పైగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

అయితే వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదలైతే బాగుంటుందని నిరుద్యోగ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. మరి నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయో చూడాల్సి ఉంది. త్వరగా నోటిఫికేషన్లు విడుదలైతే మాత్రం వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి ప్రయోజనం చేకూరనుంది.

ఫ్రెషర్లకు విప్రో గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాలు..?

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన విప్రో కరోనా సంక్షోభ సమయంలో కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎలైట్ నేషనల్ టాలెంట్ 2021 ద్వారా దేశంలోని ఫ్రెషర్లకు ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధమైంది. ప్రతిభ ఉండి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు విప్రో కంపెనీ ద్వారా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలను పొందవచ్చు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో చదివిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2021 సంవత్సరం జనవరి 5వ తేదీ అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కంపెనీ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి సందేహాలు ఉంటే manager.campus@wipro.com కు మెయిల్ చేయడం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

2021 సంవత్సరం జనవరి 18వ తేదీ నుంచి జనవరి 23వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు మూడున్నర లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. పదో తరగతి, ఇంటర్ 60 శాతం కంటే ఎక్కువ మార్కులతో గ్యాడ్యుయేషన్ 65 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

10వ తరగతి, గ్రాడ్యుయేషన్ మధ్య మూడు సంవత్సరాలు గ్యాప్ లేని విద్యార్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన కాలేజీల నుంచి ఫుల్ టైమ్ డిగ్రీ కోర్సు చదివి సెలక్షన్ నాటికి బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.