Tag Archives: jobs

కేంద్రం సంచలన నిర్ణయం.. 5 కోట్ల ఉద్యోగాలకు ప్రణాళిక..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాపు కోల్పోయి ఇంటికే పరిమితమయ్యారు. ఈ రంగం, ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై వైరస్ ప్రభావం పడింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు కొత్తగా ఉద్యోగాల్లో చేరాలనుకునే వాళ్లకు సైతం ఇబ్బందులు తప్పవు. అయితే నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
దేశంలో ఏకంగా 5 కోట్ల ఉద్యోగాలను కల్పించడానికి ప్రణాళిక సిద్ధంచేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ద్వారా ఈ ఉద్యోగాలను కల్పించనున్నట్టు తెలిపారు. భారతదేశం మరో ఏడాదిలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా మారుతుందని వెల్లడించారు. భారత్ లో చైనాతో పోల్చి చూస్తే అన్ని విధాలుగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.

మన దేశంలో ముడి పదార్థాల లభ్యతతో పాటు నైపుణ్యం ఉన్న యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారని వెల్లడించారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను 30 నుంచి 40 శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఎగుమతులను 48 నుంచి 60 శాతం పెంచనున్నట్టు వెల్లడించారు. 2020 హొరాసిస్ ఆసియా వర్చువల్ మీటింగ్ లో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

ప్రపంచ దేశాల వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై పలు విషయాల్లో సాయం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రెండున్నర లక్షల ఉద్యోగాలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామ, వార్డ్ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో పాటు రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థల్లోని ఖాళీల వివరాలను తెలియజేసి ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్న సంగతి తెలిసిందే.

జగన్ సర్కార్ తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్న మెగా పారిశ్రామిక పార్కులో ఏ కంపెనీలు పెట్టుబడులు పెడతాయో ఆ కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను ఇవ్వనుంది. వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ పేరుతో ప్రారంభమైన ఈ ఇండస్ట్రియల్ హబ్ ద్వారా ప్రభుత్వం 2.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలమని భావిస్తోంది.

జగన్ సర్కార్ కనీసం 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక పాలసీ 2020 – 2023లో ఇచ్చే రాయితీలకు అదనంగా వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్ లో పెట్టుబడులు పెట్టే వాళ్లకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీఐఐసీ పెట్టుబడులు పెట్టే సంస్థలకు 33 సంవత్సరాలకు లీజు పద్ధతిలో భూమిని ఇస్తుంది.

లీజును గరిష్టంగా 99 సంవత్సరాల వరకు పొడిగించుకునే ఛాన్స్ ఉంటుంది. ఉత్పత్తి ప్రారంభమైన పది సంవత్సరాల తర్వాత భూమిని కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రభుత్వం ఐదేళ్లపాటు యూనిట్‌ విద్యుత్‌పై రూపాయి సబ్సిడీ అందిస్తుంది. స్థిర మూలధన పెట్టుబడిలో గరిష్టంగా ప్రభుత్వం 10 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తుంది.

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఎయిర్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు..?

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 368 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థుల నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 368 ఉద్యోగాలలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ఉద్యోగాలు 264 ఉండగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్) 83 ఉన్నాయి.

మేనేజర్ (ఫైర్ సర్వీసెస్) ఉద్యోగాలు 11, మేనేజర్ (టెక్నికల్) ఉద్యోగాలు 2, జూనియర్ ఎగ్జిక్యూటివ్(టెక్నికల్) ఉద్యోగాలు 8 ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ/బీటెక్‌తో పాటు 5 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు మేనేజర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌, ఫైర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఫిజిక్స్, మ్యాథమాటిక్స్‌ లో బీఎస్సీ చదివిన వాళ్లు లేదా ఇంజనీరింగ్ కోర్సులలో ఫిజిక్స్, మ్యాథమాటిక్స్ సబ్జెక్టులు ఉన్నవాళ్లు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం లేకపోయినా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి.

జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 170 రూపాయలుగా ఉంది. డిసెంబర్ 15, 2020లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 14, 2021 దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. www.aai.aero వెబ్ సైట్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రూ.45,000 వేతనంతో ఉద్యోగాలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 206 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఏకంగా రూ.45,000 వేతనం పొందవచ్చు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా స్టైపెండరీ ట్రైనీ, సైంటిఫిక్ అసిస్టెంట్, సబ్ ఆఫీసర్, స్టెనో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది.

రేపు(నవంబర్ 24)వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://npcilcareers.co.in/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలలో ఒక్కో ఉద్యోగానికి ఒక్కో తరహా విద్యార్హతలు ఉన్నాయి.

ఉద్యోగాన్ని బట్టి ఎంపిక విధానం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధిత బ్రాంచ్ లో డిగ్రీ, డిప్లొమా ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలకు రాత పరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ ఉండగా మరికొన్ని ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి ఉద్యోగ ఎంపిక విధానం ఉంటుంది.

మొత్తం 206 ఖాళీలలో డిప్లొమా హోల్డర్, సైంటిఫిక్ గ్రాడ్యుయేట్స్, సైంటిఫిక్ అసిస్టెంట్ సీ, సైంటిఫిక్ అసిస్టెంట్ బీ, అసిస్టెంట్ గ్రేడ్ 1 (హెచ్ఆర్), అసిస్టెంట్ గ్రేడ్ 1 (f&a)>, అసిస్టెంట్ గ్రేడ్ 1 (c&mm)>, స్టెనో గ్రేడ్ 1, సబ్ ఆఫీసర్ బీ, లీడింగ్ ఫైర్‌మ్యాన్, డ్రైవర్ కమ్ పంబ్ ఆపరేటర్ కమ్ ఫైర్‌మ్యాన్ ఉద్యోగాలు ఉన్నాయి. డిప్లొమా హోల్డర్ కు 120 ఉద్యోగ ఖాళీలు ఉండగా, సైంటిఫిక్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాలకు 30 ఖాళీలు ఉన్నాయి

నిరుద్యోగులకు శుభవార్త… పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్ ఉద్యోగాలు..?

గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ పోస్టల్ శాఖ 2582 పోస్టల్ సర్వెంట్ల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదో తరగతి పాసైన వాళ్లను మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూలు ఉండవు.

ప్రస్తుతం ఈశాన్య, పంజాబ్ పోస్టల్, జార్ఖండ్ సర్కిల్ లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. జీడీఎస్ ఉద్యోగాలు కాకుండా ఇతర ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే appost.in వెబ్ సైట్ ద్వరా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 2582 పోస్టులలో జార్ఖండ్ పోస్టల్ సర్కిల్ లో 1,118 పోస్టులు, నార్త్ ఈస్టర్న్ పోస్టల్ సర్కిల్ లో 948 పోస్టులు , పంజాబ్ పోస్టల్ సర్కిల్ లో 516 పోస్టులు ఉన్నాయి.

గ్రామీణ్ డాక్ సేవక్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాస్ కావాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.

అధికారిక పోర్టల్ కు వెళ్లి ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ నెల 11వ తేదీలోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్ట‌ర్‌, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్ట‌ర్ ఉద్యోగాల భర్తీ కూడా జరుగుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నిరుద్యోగులకు అలర్ట్.. రాతపరీక్ష లేకుండా భారీ వేతనంతో ఉద్యోగాలు..?

యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్‌) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 244 ట‌్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష లేదు. మార్కులను ఆధారంగా చేసుకుని ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న పది, ఇంటర్ మార్కులను పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. http://uraniumcorp.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. పదోతరగతి 50 శాతం మార్కులతో, ఐటీఐ సంబంధిత ట్రేడ్ లో 60 శాతం మార్కులతో పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఖాళీల విషయానికి వస్తే ఫిట్ట‌ర్ 80, ఎల‌క్ట్రిష‌న్ 80, వెల్డ‌ర్ 40, ట‌ర్న‌ర్ లేదా మెషినిస్ట్ 15, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 10, ఎంవీ మెకానిక్ 10, కార్పెంట‌ర్ 5, ప్లంబ‌ర్ 4 ఖాళీలు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మొదట్లో తక్కువగానే వేతనం లభించినా అనుభవం పెరిగే కోద్దీ వేతనం పెరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం గతంలో ప్రకటన విడుదల చేయగా పరీక్షల నిర్వహణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సిద్ధమైంది. నిజానికి చాలా నెలల క్రితమే పరీక్షలు జరగాల్సి ఉన్నా కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పరీక్షలు జరగలేదు. స్టీల్ ప్లాంట్ లో మొత్తం 188 ఉద్యోగాల భర్తీ జరగనుంది.

డిసెంబర్ నెల 13, 14 తేదీలలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు త్వరలో స్టీల్ ప్లాంట్ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. గ్యాడ్యుయేషన్ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల ఖాళీలను పరిశీలిస్తే మెకానికల్ బ్రాంచ్ చదివిన వాళ్లకు అత్యధికంగా 77 ఖాళీలు ఉన్నాయి.

ఆ తరువాత ఎలక్ట్రికల్ 45, కెమికల్ 26, మెటలర్జీ 19, సివిల్ 5, సిరామిక్స్ 4, మైనింగ్ కు సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వైజాగ్ స్టీల్ ప్రకటన విడుదల చేసి మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీ చేపడుతుంది. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు ఎంపికైన వారికి భారీ మొత్తంలో వేతనం లభిస్తుంది. అయితే పోస్టులు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంటుంది.

సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రశ్నలు కఠినంగా ఉంటాయి కాబట్టి సమాధానాలను ఎంచుకునే విషయంలొ జాగ్రత్త వహిస్తే సులువుగా ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు.

నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా హైదరాబాద్ లో ఉద్యోగాలు..?

గత కొన్ని రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని ప్రముఖ సంస్థలు నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతుండగా హైదరాబాద్ లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఈఎస్ఐసీ) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈఎస్ఐసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 187 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈఎస్ఐసీ సిద్ధమవుతోంది.

ఫోరెన్సిక్ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, బ‌యోకెమిస్ట్రీ, మైక్రోబ‌యాల‌జీ, పాథాల‌జీ, ఫిజియాలజీ, అనాటమీలలో ఇతర విభాగాల్లోని ఖాళీలను ఈఎస్ఐసీ భర్తీ చేస్తోంది. https://www.esic.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.

మొత్తం ఉద్యోగాల్లో సీనియ‌ర్ రెసిడెంట్ ఉద్యోగాలు 103 కాగా ఫ్యాక‌ల్టీ పోస్టులు 46, అడ్జంక్ట్ ఫ్యాక‌ల్టీ సూప‌ర్ స్పెష‌లిస్ట్ పోస్టులు 15, స్పెషాలిటీ స్పెష‌లిస్ట్ పోస్టులు 7, క‌న్స‌ల్టెంట్‌ పోస్టులు 4, రిసెర్చ్ సైంటిస్ట్‌ పోస్టులు 2 ఉన్నాయి. ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నవంబర్ 11వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈఎస్ఐసీ అభ్యర్థులకు అర్హతకు, అనుభవానికి తగిన వేతనం అందిస్తోంది.

ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. రూ. 42,000 వేతనంతో ఉద్యోగాలు..?

గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు వరుసగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర గృహ, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఎన్‌బీసీసీ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 100 ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌బీసీసీ (ఇండియా) నిరుద్యోగ అభ్యర్థులు ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, గ్రూప్‌ డిస్క‌ష‌న్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.nbccindia.com/ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 100 ఇంజనీర్ ఉద్యోగాలకు ఖాళీలు ఉండగా వాటిలో 80 సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలు, 20 మెకానికల్ ఉద్యోగాలు ఉన్నాయి.

బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవాళ్లు 550 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు 42,000 రూపాయలు వేతనంగా చెల్లిస్తారు.

వరుసగా వెలువడుతున్న నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుంది. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్లు కష్టపడి ప్రయత్నిస్తే సులువుగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం సాధ్యమే.

నిరుద్యోగులకు మరో శుభవార్త.. 50,000 వేతనంతో ఉద్యోగాలు!

గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, రైల్వే శాఖ వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తూ వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా బెల్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ నోటిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 1,059 ఖాళీలను భర్తీ చేయడానికి బెల్ సిద్ధమైంది.

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఇప్పటికే ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. బెంగ‌ళూరు యూనిట్‌, ఎక్స్‌పోర్ట్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ ఎస్‌బీయూ, ఐపీఎస్ఎస్ ప్రాజెక్ట్‌ (బెంగ‌ళూరు), పంచ‌కుల యూనిట్‌ లలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో వచ్చిన మార్కులను బట్టి ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

https://bel-india.in/ వెబ్ సైట్ ను సందర్శించి ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారంన్ తెలుసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలకు నవంబర్ 21 చివరి తేదీ కాగా, మరికొన్ని ఉద్యోగాలకు నవంబర్ 25 ఆఖరు తేదీ. ట్రయినీ ఆఫీస‌ర్‌, ఇంజినీర్ పోస్టుల‌కు దరఖాస్తు ఫీజు 200 రూపాయలు, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ ఉద్యోగలకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుచెల్లించాల్సి ఉంటుంది.

బీఈ లేదా బీటెక్ లేదా బీఆర్చ్ లేదా బీఎస్సీ చదివిన అభ్యర్థులు పోస్టును బట్టి ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనాన్స్ పోస్టులకు, హెచ్ఆర్ పోస్టుల‌కు ఎంబీఏ చేసిన వాళ్లు మాత్రమే అర్హులు.