ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం గతంలో ప్రకటన విడుదల చేయగా పరీక్షల నిర్వహణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సిద్ధమైంది. నిజానికి చాలా నెలల క్రితమే పరీక్షలు జరగాల్సి ఉన్నా కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పరీక్షలు జరగలేదు. స్టీల్ ప్లాంట్ లో మొత్తం 188 ఉద్యోగాల భర్తీ జరగనుంది.
డిసెంబర్ నెల 13, 14 తేదీలలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు త్వరలో స్టీల్ ప్లాంట్ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. గ్యాడ్యుయేషన్ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల ఖాళీలను పరిశీలిస్తే మెకానికల్ బ్రాంచ్ చదివిన వాళ్లకు అత్యధికంగా 77 ఖాళీలు ఉన్నాయి.
ఆ తరువాత ఎలక్ట్రికల్ 45, కెమికల్ 26, మెటలర్జీ 19, సివిల్ 5, సిరామిక్స్ 4, మైనింగ్ కు సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వైజాగ్ స్టీల్ ప్రకటన విడుదల చేసి మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ చేపడుతుంది. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన వారికి భారీ మొత్తంలో వేతనం లభిస్తుంది. అయితే పోస్టులు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంటుంది.
సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రశ్నలు కఠినంగా ఉంటాయి కాబట్టి సమాధానాలను ఎంచుకునే విషయంలొ జాగ్రత్త వహిస్తే సులువుగా ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…