Tag Archives: Kantara Movie

Manasi Sudhir: కాంతర సినిమాలో రిషబ్ తల్లి పాత్రలో నటించిన నటి ఎవరు…ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Manasi Sudhir: ఈ మధ్యకాలంలో ఎంతోమంది నటీమణులు డీ గ్లామర్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ కూడా ఇలాంటి కోవకే చెందినవే. ఇలా నటీమణులు డీ గ్లామర్ పాత్రలలో నటించడం వల్ల వాళ్లు చూడటానికి అందంగా ఉండరని అనుకోవడంమన పొరపాటు అయితే వాళ్ళు నిజ జీవితంలో ఎంతో అందంగా చాలా చిన్న వయసు వారై ఉంటారు.

తాజాగా కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా అన్ని భాషలలో ఎలాంటి సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమా సుమారు 50 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి తల్లి పాత్రలో నటించిన కమల తన పాత్రలో ఎంతో లీనమై సహజంగా నటించారు.

ఇక ఈ సినిమాలో కమల పాత్రలో నటించిన ఈ నటి పేరు మానసి సుధీర్. ఈమె ఈ సినిమాలో కమల పాత్రలో నటించారు. ఇందులో బాధ్యతలేని కొడుకును చితకొట్టే తల్లి పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమాలో ఈమెను చూస్తే ఒక సీనియర్ నటి అనే భావన అందరికీ కలుగుతుంది. నిజానికి ఈమె వయసు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే.

Manasi Sudhir:టిక్ టాక్ వీడియోల ద్వారా సినిమా అవకాశాలు అందుకున్న నటి…


ఇందులో హీరో రిషబ్ శెట్టి 39 సంవత్సరాలు కాగా తనకు తల్లి పాత్రలో నటించిన నటికి మాత్రం 35 సంవత్సరాలు కావడం విశేషం.అయితే ఈమెకు సినిమాలలో అవకాశాలు ఎలా వచ్చాయనే విషయానికి వస్తే కరోనా లాక్డౌన్ సమయంలో ఈమె టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యారు. ఇలా టిక్ టాక్ వీడియోల ద్వారా ఈమెను చూసినటువంటి హోంభలే నిర్మాణ సంస్థ వారు తనను ఈ సినిమా ఆడిషన్స్ కి రమ్మని చెప్పి తనకు అవకాశం కల్పించారు. ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

Varaha Rupam: వరాహ రూపం పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిన సింగర్ శ్రీ లలిత.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Varaha Rupam: రిషబ్ శెట్టి హీరోగా, ఆయన దర్శకత్వంలో నటించిన కాంతార సినిమా ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఇలా అన్ని భాషలలోనూ ఈ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలో వరాహ రూపం పాట ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి.

ఈ విధంగా ఒక సినిమాలో హిట్ అయిన పాటలను చాలామంది కవర్ సాంగ్స్ చేస్తూ మరింత ఫేమస్ అవుతారు. ఈ క్రమంలోనే వరాహ రూపం సాంగ్ ను కవర్ సాంగ్ చేస్తూ ఫేమస్ అయినటువంటి వారిలో సింగర్ శ్రీ లలిత ఒకరు. ఈ పాటను ఈమె సరికొత్త ఇన్స్ట్రుమెంట్ తో రీ క్రియేట్ చేసి వార్తల్లో నిలిచారు. మరి ఈ శ్రీ లలిత ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.

శ్రీ లలిత తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంగీత నేపథ్యం ఉన్నవాళ్లు కావడం విశేషం అయితే చిన్నప్పటి నుంచి సంగీతంపై ఎంతో మక్కువ ఉన్నటువంటి శ్రీ లలితకు శిక్షణ ఇప్పించడమే కాకుండా ఈమె ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు. బోల్ బేబీ బోల్, సూపర్ సింగర్, స్వరాభిషేకం,స్వర్ణ నీరాజనం సరిగమ లిటిల్ చాంప్ వంటి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని తన స్వరాన్ని అందరికీ వినిపించారు.

Varaha Rupam: సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలలో సందడి చేసిన శ్రీ లలిత…

అయితే అప్పుడు ఈమె చిన్నగా ఉండటం వల్ల పెద్దగా ఎవరు తనని గుర్తుపట్టకపోవచ్చు కానీ ప్రస్తుతం వరాహ రూపం అనే పాటను రీ క్రియేట్ చేయడంతో ఒక్కసారిగా ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ పాటకు ఏకంగా 3 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇలా కజు అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ పాట అనంతరం ఈమె ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.ఇప్పటివరకు ఎన్నో సిగ్గింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలలో సందడి చేసిన ఈమెకు ఇప్పటివరకు సినిమా అవకాశాలు రాలేదు. అయితే ఈ వరాహ రూపం పాట ద్వారా ఈమెకు అవకాశాలు వస్తాయి అనడంలో ఏ మాత్రం సంకోచం వ్యక్తం చేయాల్సిన పనిలేదు.

Kantara Movie: ఓటీటీ విడుదలకు సిద్ధమైన కాంతార.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Kantara Movie: కాంతార ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది.కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని భాషలలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలా 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వందల కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ విధంగా కాంతార సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి కూడా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.నవంబర్ 4వ తేదీని ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారమవుతుందంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై నిర్మాత స్పందించి ఇప్పుడే ఈ సినిమాని డిజిటల్ మీడియాలో ప్రసారం చేయబోమంటూ వెల్లడించారు.

తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ మీడియా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని నవంబర్ 18 వ తేదీ నుంచి అమెజాన్ లో ప్రసారం చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Kantara Movie: అమెజాన్ లో సందడి చేయనున్న కాంతార…


ఈ సినిమా కన్నడ భాషలో సెప్టెంబర్ 30వ తేదీ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అదేవిధంగా ఈ సినిమా తెలుగులో అక్టోబర్ 15వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమా విడుదలయ్యి దాదాపు 45 రోజులు అనంతరం ఈ సినిమాని నవంబర్ 18 వ తేదీ అమెజాన్ లో ప్రసారం చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది.

Rishab Shetty: కాంతార హీరో రిషబ్ శెట్టి ఇదివరకే తెలుగు స్ట్రైట్ సినిమాలో నటించాడని మీకు తెలుసా?

Rishab Shetty: కన్నడ హీరో రిషబ్ శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారిపోతుంది.కన్నడ చిత్ర పరిశ్రమలో ఈయన నటించిన కాంతార సినిమా సూపర్ హిట్ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చలు జరుపుతున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో సెప్టెంబర్ 30వ తేదీ విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అన్ని భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

ఇక ఈ సినిమాని తెలుగులో అల్లు అరవింద్ సమర్పణలు విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులో సుమారు 25 కోట్ల షేర్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి కేవలం కన్నడ హీరోగా అందరికీ పరిచయం కానీ ఈయన కూడా తెలుగులో ఓ సినిమాలో నటించారనే విషయం చాలా మందికి తెలియదు. రిషబ్ శెట్టి తెలుగులో కూడా ఓ సినిమాలో నటించి సందడి చేశారు.

రిషబ్ శెట్టి తెలుగులో నటించిన సినిమా ఏంటి అనే విషయానికి వస్తే..ఆర్.ఎస్.జె తెరకెక్కించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే చిత్రం ఈయన ఖలీల్ అనే ఒక పాత్రలో నటించారు. ఇలా మిషన్ ఇస్తాంబుల్ సినిమా ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

Rishab Shetty: ఖలీల్ పాత్రలో నటించిన రిషబ్..

నటి తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సందీప్ రాజ్, సుహాస్ లతో కలిసి ముగ్గురు పిల్లల్ని మోసం చేసే వ్యక్తిగా అతను కనిపిస్తాడు.ఇలా మిషన్ ఇస్తాంబుల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులుముందుకు రిషబ్ శెట్టి వచ్చారనే విషయం చాలామందికి తెలియదు. అయితే కాంతర సినిమా ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమయ్యారు.

Kantara Movie: వివాదంలో కాంతార వరాహ రూపం సాంగ్… కాఫీ అంటూ తెరపైకి కొత్త వివాదం?

Kantara Movie: కన్నడ చిత్ర పరిశ్రమలో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార.ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ కన్నడ చిత్ర పరిశ్రమలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. హోంభలే ఫిలిమ్ సమస్థ వారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాని అన్ని భాషలలో విడుదల చేశారు.

ఇక ఈ సినిమా పెద్ద ఎత్తున లాభాలను అందుకొని భారీ కలెక్షన్లను రాబట్టింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చేటటువంటి వరాహ రూపం అనే పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని చెప్పాలి.ఇలా ఈ సినిమా విడుదలయ్యి దాదాపు నెలరోజులు కావస్తున్న తరుణంలో ఈ సినిమా గురించి ఓ వివాదం చోటు చేసుకుంది.

ఈ సినిమాలో వరాహ రూపం అనే పాట కాపీ కొట్టారంటూ  ‘తైక్కుడం బ్రిడ్జ్’ మ్యూజిక్ బ్యాండ్ వారు ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవరసం అనే పాట నుంచి వరాహ రూపం అనే పాటను కాపీ చేశారంటూ
తైక్కుడం బ్రిడ్జ్ ఆరోపణలు చేయడమే కాకుండా ఈ కాఫీ ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ వీరు హెచ్చరించారు.

Kantara Movie: ఏం ఆశించి ఆరోపణలు చేస్తున్నారు…


ఈ విధంగా ఈ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ఈ విధమైనటువంటి కాపీ వివాదం తెరపైకి రావడంతో ఏం ఆశించి తైక్కుడం బ్రిడ్జ్ వారు ఆరోపణలు చేస్తున్నారు అంటూ పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇలాంటి ఆరోపణలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే ఈ పాటపై కాపీ ఆరోపణలు రావడంతో ఇప్పటివరకు కాంతారా సినిమా చిత్ర బృందం ఏ విధంగాను స్పందించకపోవడం గమనార్హం.

Kantara Movie: కాంతార సినిమాపై స్పందించని రష్మిక.. దారుణంగా ట్రోల్ చేస్తున్న కన్నడిగులు?

Kantara Movie: ప్రస్తుతం ఏ భాషలో చూసినా కాంతారావు సినిమా పేరు మారుమోగిపోతుంది.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కన్నడ భాషలో విపరీతమైన ఆదరణ సంపాదించుకోవడంతో ఈ సినిమాని అన్ని భాషలలో విడుదల చేశారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఈ క్రమంలోనే కాంతార సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా నిజ జీవిత ఆధారంగా రిషబ్ శెట్టి ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే అనుష్క శెట్టి, ప్రభాస్ కార్తీ, వర్మ, ధనుష్ వంటి ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమాపై స్పందిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేశారు.

ఇకపోతే ఈ సినిమాపై ఇంతవరకు కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న ఏమాత్రం స్పందించలేదు. ఈ క్రమంలోనే కన్నడ ప్రేక్షకులు పెద్ద ఎత్తున రష్మికపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసింది రిషబ్ శెట్టి. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన కిరిక్ పార్టీ సినిమా ద్వారా రష్మిక హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

Kantara Movie: అంత తీరిక లేకుండా గడుపుతున్నావా రష్మిక…

ఇలా తనని ఇండస్ట్రీకి పరిచయం చేసి అద్భుతమైన హిట్ అందించిన దర్శకుడు సినిమా నేడు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ సినిమాపై కనీసం స్పందించే తీరిక కూడా రష్మికకు లేకుండా పోయిందా.. నేడు రష్మిక ఈ స్థాయిలో ఉందంటే అందుకు గల కారణం రిషబ్ శెట్టి అని చెప్పాలి.అలాంటి విజయాన్ని అందించిన రిషబ్ శెట్టి సినిమాపై రష్మిక స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున అభిమానులు కన్నడ ప్రేక్షకులు తీవ్రస్థాయిలో ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా రష్మిక స్పందిస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Kantara Movie: కాంతార సినిమాలో చూపించిందంతా నిజమేనా? ఆ తెగవారు ఆత్మలతో నిజంగానే మాట్లాడతారా..?

Kantara Movie: కాంతార ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరే వినబడుతుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత నిజంగానే ఇలా దేవుళ్ళ ఆత్మతో మాట్లాడేవారు ఉంటారా వారు చెప్పినవే జరుగుతాయా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంటుంది.

నిజానికి రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలో గత కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఒక నిజ సంఘటన ఆధారంగా ఈ సినిమాని చిత్రీకరించారు. కర్ణాటకలోని బంట్ అనే తెగవారు నివసించేవారు. వీరి భాష తులు. అయితే ప్రస్తుతం ఈ తెగ వారందరూ కూడా వివిధ రకాలుగా విడిపోయి మతాలు మార్చుకున్న వారు ఉన్నారు అయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనుష్క శెట్టి, కృతి శెట్టి, రిషబ్ శెట్టి, నేహా శెట్టి, రక్షిత్ శెట్టి, శిల్పా శెట్టి శ్రీనిధి శెట్టి ఇలా వీరందరి పూర్వీకులు కూడా ఇదే తెగకు చెందిన వారే.

ఈ విధంగా ప్రస్తుత కాలంలో ఈ తెగకు చెందినవారు వివిధ ప్రాంతాలలో ఉండే మతాలు మార్చుకున్నప్పటికీ వీరందరూ కలిసి ఇప్పటికీ ఎంతో నమ్మకంగా “కంబళ” అనే నృత్యాన్ని నమ్ముతూ ఉంటారు. ఈ నృత్యాన్ని మనం కాంతార సినిమాలో చూసాము. ఈ తెగకు చెందినవారు ఈ డాన్స్ చేస్తూ వారి కులదైవాన్ని పూజించడం వల్ల వారి కుటుంబంలో మరణించిన పూర్వీకుల ఆత్మ వారిని ఆవహించి జరగబోయేది చెబుతారని అలాగే ఆ కుటుంబ సభ్యులకు దిశా నిర్దేశం చేస్తారని భావిస్తారు.

Kantara Movie: నిజ సంఘటన ఆధారంగా..

ఈ విధంగా రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలో మూడు దశాబ్దల క్రితం జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా కథను తీర్చిదిద్దారు అయితే ఈ సినిమాలో చూపించినది మొత్తం నిజ సంఘటన ఆధారంగా మాత్రమే జరిగినదని నిజంగానే ఆ తెగ వారికి ఆత్మలు ఆవహిస్తాయని ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి అంతరించిపోతున్న వారి కలను బయటకు పెట్టారు. ఏది ఏమైనా ఈ సినిమా మాత్రం అన్ని భాషలలోనూ విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుందని చెప్పాలి.