Tag Archives: kerala

నిఫా వైరస్.. కరోనా వైరస్ మధ్య తేడా ఏంటి.. ? దీనిలో ఏది ప్రమాదకరం..?

ఇప్పటికే కరోనాతో విలవిలలాడిన కేరళను మరో వైరస్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే ఇటీవల ఓ 12 ఏళ్ల బాలుడు నిఫా వైరస్ తో చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. వైద్య అధికారులతో సమావేశాలు నిర్వహించి వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు.

అయితే ఇంతలా భయపెడుతున్న నిఫా వైరస్ కు.. కరోనా వైరస్ కు మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రెండేళ్ల కిందట ఈ నిఫా వైరస్ కేరళను వణికించింది. అయితే దీనిని 1999 మలేసియాలో సున్గాయ్ నిఫా అనే గ్రామంలో దీనిని గుర్తించారు. కావునా ఆ గ్రామం పేరు మీదనే నిఫా వైరస్ అనే పేరు పెట్టారు. అయితే పందులు, గబ్బిలాలు, మేకలు, పిల్లులు, గుర్రాలు, గొర్రెలు లాంటి జంతువులను ఈ వైరస్ హోస్ట్‌గా చేసుకుంటుంది.

ఇన్ఫెక్షన్‌కు సంబంధించి ఎలాంటి లక్షణాలను వెంటనే చూపదు. నిఫా వైరస్ అనేది జోనేటిక్ ఇన్ఫెక్షన్ కిందకు వస్తుంది. ఇక కరోనా వైరస్ అనేది పేరు ఇప్పటి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం సార్స్ వ్యాధి అనేది అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. అయితే ఆ వ్యాధి కరోనా వైరస్ వల్ల వచ్చింది. దీంతో ఆ కరోనా పేరు అనేది మొదటి నుంచే ఉంది.

కానీ ఇటీవల చైనాలో వుహాన్‌లో కరోనా మరో రూపాంతరం చెంది కోవిడ్ 19 వైరస్ గా మొదటిసారి వెలుగుచూసింది. అప్పుడు కొన్ని నిర్ధారణ పరీక్షలు చేసి అది కరోనా వైరస్ గా గుర్తించారు. అయితే ఈ రెండింటికి ఎలాంటి మందు లేదు. కరోనా వైరస్ అంత వ్యాప్తి నిఫా వైరస్ కు లేదు. కావునా దీని యొక్క వ్యాప్తి కరోనాతో పొల్చితే తక్కువనే చెప్పాలి. కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. కానీ నిఫాకు అది కూడా లేదు. దీంతో కేరళవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

మైనర్ బాలుడితో యువతి ప్రేమలో పడింది.. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు… కానీ చివరికి ఏమైందంటే!

ప్రేమకు, ఆకర్శణకు తేడా తెలియని వయస్సు వీరిద్దరిది. ఒకరు మైనర్, మరొకరు మేజర్ కానీ వీరిద్దరి మధ్య రెండేళ్ల గ్యాప్ ఉంది. వయస్సులో రెండేళ్ల పెద్ద అయిన ఆ యువతి అతడి ప్రేమలో పడింది. ప్రేమిస్తున్నానంటూ చెప్పింది. కానీ చివరకు ఏమైందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. అది కేరళలోని పొల్లాచి. అక్కడ ఓ పెట్రోల్ బంక్ లో 19 ఏళ్ల ఓ యువతి పనిచేస్తుంది.

అక్కడకు ఎంతో మంది బంక్ లో పెట్రోల్ కోసం వచ్చి వెళ్తుంటారు. కానీ ఓ 17 ఏళ్ల మైనర్ మాత్రం అక్కడకు వచ్చి పెట్రోల్ కొట్టించుకోవడమే కాకుండా.. ఆమె వంక ఒక రకంగా చూస్తూ ఉండేవాడు. ఇలా వాళ్ల మధ్య చూపులతోనే రెండు నెలలు గడిచింది. వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు కూడా లేకుండానే ఇలా చూపులతోనే ఒకరినొకరు ఇష్టపుడుతున్నట్లు ఊహించుకున్నారు. ఓ రోజు అతడి కోసం ఎదురు చూస్తున్న సదరు యువతి.. సాయంత్రం వరకు అతడు బంక్ వద్దకు రాలేదు.

ఏమైందా అంటూ ఆరా తీయగా.. అతడికి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుసుకుంది. వెంటనే వెళ్లి అతడిన చూసి.. ఆరోగ్యం ఎలా ఉంది అంటూ.. పలకరించింది. తర్వాత అతడిని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. దీంతో ఇద్దరు గుడికి వెళ్లి పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత ఈ విషయం ఆ మైనర్ బాలుడి తల్లిదండ్రులకు తెలవడంతో ఆగ్రహించారు. కనీసం మైనర్ కూడా తీరకుండా.. పెళ్లి ఏంట్రా అని వాళ్లు మందలించారు.

పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువతిని స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె అంతకు ముందే కోయంబత్తూరు లో కూడా మరో యువకుడిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయగా.. ఆ సమయంలో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అతడు మైనర్ తీరే వరకు వేచి చూస్తానని.. అతడే తన భర్త అంటూ పోలీసులకు చెప్పింది ఆ యువతి.

ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ పట్ల.. ఓ పోలీస్ అధికారి దారుణంగా..

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్నా.. ఆడపిల్లలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోతోంది. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే మహిళల పట్ట అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే ఇక సమాజంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది..? తనకు అన్యాయం జరిగిందంటూ.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిల పట్ల ఓ పోలీస్ అధికారి అసభ్యకరంగా ప్రవర్తించాడు.

ఆమె ఫోన్ నంబర్ తీసుకొని వేధించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కొల్లాం జిల్లా కాలయపురానికి చెందిన ఓ మహిళను అక్కడే ఉన్న కొందరు అల్లరి చేస్తున్నారని.. నాలుగు రోజుల క్రితం కొట్టారక్కర పోలీసులను ఆశ్రయించింది.

మద్యం తాగి వచ్చి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఆ అల్లరిమూఖలను స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మరో సారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించేశారు. ఇదిలా ఉండగా.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళకు పోలీసు అధికారి బిజు జాన్ (43) ఫోన్ చేయడం ప్రారంభించాడు.

ఆమెకు ఫోన్ చేసి ముద్దు కావాలని అడగడంతో పాటు.. అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా.. పోలీసు అధికారి బిజు జాన్ పై చర్యలు కూడా తీసుకోనున్నట్లు ఉన్నత పోలీసులు అధికారులు వెల్లడించారు.

గాడిద పాలు లీటరు రూ.10 వేలు.. ఇంత డిమాండ్ ఎందుకో తెలుసా..?

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ లోని ఉమర్గాకు చెందిన ధోత్రే కుటుంబం 20 గాడిదలను పెంచుతూ లీటరు గాడిద పాలను రూ. 10 వేలకు అమ్ముతున్నారు. గాడిద పాలకు ఇంత డిమాండ్ ఉండటానికి గల కారణం ఏంటంటే.. ఒక్క గాడిద పాలలోనే కాదు.. పాలల్లో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. అయితే ఈ గాడిద పాలల్లో అన్నింటికంటే ఎక్కవ విశేష గుణాలున్నాయని అంటున్నారు సైంటిస్టులు. జన్యుపరమైన, వైరల్ సంబంధిత సమస్యలకు గాడిద పాలు చక్కని పరిష్కారాన్ని సూచిస్తాయని తెలిపారు.గాడిద పాలతో ఔషధాలే కాకుండా బ్యూటీ ఉత్పత్తులను కూడా రూపొందిస్తున్నారు.

మహారాష్ట్ర మరియు కేరళలలో గాడిద పాల ఉపయోగాల గురించి చేసిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గాడిద పాలను తాగడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని.. దగ్గు, జలుబు, ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్, టీబీ తదితర వ్యాధుల నివారణలో గాడిదపాలు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

కేరళలోని కొచ్చీకి చెందిన ఏబీ బేబీ… గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు రూపొందించి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. అలా ఏడాదికి రూ. 20 లక్షలకుపైగా సంపాదిస్తున్నారు. ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాతనే వీళ్లు ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ సౌందర్య ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది. అంతే కాకుండా వీటి ధర కూడా ఎక్కువగానే ఉంది.

లిప్ బా‌మ్‌లు, బాడీ లోషన్లు, సబ్బులు మొదలగునవి తయారీలో ఈ గాడిద పాలను ఉపయోగిస్తున్నారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్‌కు(షోలాపూర్) చెందిన ఆరుగురు విద్యార్థులు గాడిద పాలతో బ్యూటీ ప్రొడక్ట్స్ రూపొందిస్తున్నారు. చిన్న పిల్లలకు ఎంతో బలాన్ని ఇస్తాయట. అంతేకాకుండా ఒక్కో గాడిద రోజుకు 200 నుంచి 250 మిల్లీ లీటర్ల పాలను ఇస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం.. అక్కడ తొలి కేసు నమోదు.. !

కరోనా కారణంగా ప్రతీ ఒక్కరి జీవన విధానంలో పూర్తిగా మార్పులు సంభవించాయి. దీనికి తోడు ఫంగస్‌లు, డేల్టా వేరియంట్ భయపెడుతోంది. సెకండ్ వేవ్ కేసులు అక్కడక్కడ నమోదవుతున్నా.. మరీ విపరీతంగా మాత్రం లేవు. వచ్చే నెల నుంచి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరు దాని భారి నుంచి రక్షించుకునేందుకు సిద్దంగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా జికా వైరస్ కలవరపెడుతోంది. ఇటీవల కేరళలో జికా వైరస్ కేసులు రాగా.. అదీ మహారాష్ట్రకు పాకింది. మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. రూరల్ పుణెలోని పురందర్‌లో ఓ మహిళకు పాజిటివ్ వచ్చింది. జికా వైరస్ లక్షణాలు ఉండడంతో ఐదుగురి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయగా.. ఒకరికి పాజిటివ్ వచ్చింది. బెస్లార్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఇంటికి పంపించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ జులై 30వ తేదీన ఆమెకు పరీక్షలు జరిపి జికా వైరస్‌తో పాటు చికెన్ గున్యా కూడా ఉన్నట్లు నిర్ధారించింది.

జికా వైరస్ అనేది దోమల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. జబ్బు తీవ్రత అనేది చాలా తక్కువగా అనిపించొచ్చు అని స్టేట్ సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ అవాతె అంటున్నారు. బాధితురాలి కుటుంబంలో మరెవరికీ జికా వైరస్ సోకలేదని అధికారులు తెలిపారు. ఐతే ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు చేశారు. వారిలో కొందరికి చికెన్ గున్యా ఉన్నట్లు తేలింది. ఇన్ఫెక్షన్ సాధారణ లక్షణాలు ఒంటి నొప్పులు, కంటి శుక్లాలు, రెట్రో ఆర్బిటల్ పెయిన్, చర్మంపై మచ్ఛలు లాంటివి కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. జికా వైరస్ అనేది దోమ కుట్టిన 14 రోజుల తర్వాత బయటపడుతుందని తెలిపారు.

ఎడిస్ ఈజిప్ట్ అనే దోమల జాతి ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అందుకే వర్షా కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. జికా వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకునేందుకు కఠినంగా శ్రమిస్తున్నామని.. సాధ్యమైనంత వరకూ హెల్త్ కేర్ అందిస్తామని జిల్లా అధికారి తెలిపారు.

వామ్మో ఏకంగా మద్యం షాప్ వద్దే వివాహం… కారణం అదే!

సాధారణంగా వివాహం అంటే ఏ కళ్యాణమండపము లేదా ఏ గుడి వద్దనో అది లేకపోతే ఇంటి వద్దనో వారికున్న స్థోమతకు తగ్గట్టుగా జరుపుకుంటారు. కానీ మీరెప్పుడైనా వివాహం మద్యం షాపు దగ్గర జరుపుకోవడం చూశారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కేరళలోని కోజికోడ్‌లో ఓ జంట మాత్రం మద్యం షాపు ముందు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ విధంగా వీరిరువురు మద్యం షాపు ముందు వివాహం చేసుకోవడానికి కారణం లేకపోలేదు. అసలు వీరు అక్కడ పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

కేరళలోని కోజికోడ్‌ కు చెందిన ప్రమోద్‌, ధన్యాలు కొంత కాలంగా క్యాటరింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా పెళ్లిళ్లకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి తెలపడంతో వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. పెళ్లికి పెద్దగా జనాలు రాకపోవడంతో వీరికి ఆర్డర్లు రావడం తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ఈ విధంగా క్యాటరింగ్ నిర్వహించేవారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అందుకే ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ మద్యం షాపు ముందు వివాహం చేసుకున్నామని ఈ జంట తెలిపారు.

ప్రభుత్వం మద్యం షాపులకు అనుమతి ఇవ్వడంతో మద్యం షాపుల ముందు పెద్దఎత్తున జనాలు ఉన్నారు.ఈ విధంగా మద్యం షాపుల ముందు పాటించని కరోనా నిబంధనలు వివాహ వేడుకలలో ఎందుకు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని క్యాటరర్స్‌ను ఆదుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో పెళ్లిళ్లకు వందమందికి అనుమతివ్వాలని కోరారు.

ఈ విధంగా ఈ జంట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ మద్యం షాపు ముందు వివాహం చేసుకున్నటువంటి సంఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆలోచింపజేశాయి. ఈ పోస్టు చూసిన కొందరు వీరి ఐడియా బాగుంది… అని కామెంట్ చేయగా మరికొందరు తక్షణమే వీరికి సహాయం చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ జంట మద్యం షాపు ముందు వివాహం చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

యజమాని కోసం కుక్క విశ్వాసం.. వైరల్ వీడియో!

సాధారణంగా మనలో చాలామంది మన ఇంటిలో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా చాలా మంది ఎక్కువగా పెంపుడు జంతువులుగా కుక్కలని పెంచుకోవడం చూస్తుంటాము. ఈ విధంగా వారు ఎంతో ఇష్టంగా పెంచుకొనే పెంపుడు కుక్కల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. వాటిని ఒక జంతువు మాదిరి కాకుండా సొంత కుటుంబంలోని సభ్యులుగా భావించి వాటి ఆలనాపాలన చూసుకుంటూ ఉంటారు.

ఈ విధంగా పెంపుడు జంతువుల పట్ల మనం ఎంత అభిమానం చూపిస్తామో అవి కూడా మన పట్ల అంతే విశ్వాసం చూపిస్తాయి.ఈ విధమైన విశ్వాసం చూపుతూ తమ కుటుంబ సభ్యులను ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడేసిన సంఘటనలను గురించి మనం చాలానే విన్నాం. అచ్చం అలాంటి ఘటనే కేరళలో చోటుచేసుకుంది.

సాధారణంగా మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే కొద్దిరోజుల పాటు వారి గురించి బాధపడి తర్వాత ఎవరి పనులలో వారు నిమగ్నమవుతారు. కానీ ఒక శునకం మాత్రం తన యజమాని పట్ల చూపించిన విశ్వాసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను ఎంతో అపురూపంగా చూసుకునే యజమాని చనిపోవడం వల్ల ఆ శునకం బాధ వర్ణనాతీతంగా మారింది.

కేరళ మలప్పురంలో నివసించే యజమానురాలు చనిపోవడంతో ఆమె ఎంతో ఇష్టంగా చూసుకున్న శునకం నిత్యం ఆమె ఫోటో ముందు నిలబడి విలపిస్తోంది. తన యజమానురాలు మరణించి ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఆమెను తలుచుకొని ప్రతి రోజు తన ఫోటో ముందు నిలబడి ఫోటోను చూస్తూ అరుస్తూ ఉంది. ఈ విధంగా ఒక శునకం తన యజమాని పట్ల చూపించే ప్రేమకు, విశ్వాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

11 ఏళ్లుగా ఇంట్లోనే నివసిస్తున్నా ఆ యువతిని కనిపెట్టలేకపోయారు!

సాధారణంగా మన కుటుంబంలో వ్యక్తి లేదా మన బంధువులలో ఎవరైనా తప్పి పోతే వారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసి, వారి కోసం ఇతర ప్రాంతాలలో గాలింపు చర్యలు మొదలు పెడతాము.ఈ విధంగా అనేక చోట్ల వారి గురించి వెతికిన కూడా వారి ఆచూకీ తెలియక పోతే వారు బహుశా మన కంటికి కనిపించనంత దూరంలోకి వెళ్లిపోయారని, లేదా ఏదైనా అఘాయిత్యం చేసుకొని చనిపోయి ఉంటారని భావిస్తాము. కానీ ఓ యువతి ఇంటిలో నుంచి వెళ్లిపోయి పదకొండు సంవత్సరాల పాటు తమ కుటుంబ సభ్యులకు కనిపించకుండా తన ఇంటికి కేవలం అతి దగ్గరలోనే అదే ఊర్లో నివసిస్తున్న కనిపెట్ట లేకపోవడం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకీ ఈ విచిత్రమైన ఘటన జరిగింది మన ఇండియాలోనే. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళలోని అయలూర్ గ్రామానికి చెందిన సజిత అనే యువతి 2010లో అకస్మాత్తుగా ఇంటి నుంచి మాయమైంది. సజిత తాను ప్రేమించిన వ్యక్తి అలించువట్టి రెహ్మాన్‌తో కలిసి జీవించేందుకు వెళ్లిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు తన కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. సంవత్సరాలు గడుస్తున్నా తన ఆచూకీ తెలియకపోవడంతో తనపై తమ కుటుంబ సభ్యుల ఆశలు వదులుకున్నారు.

కానీ సజిత మాత్రం అదే ఊరిలో తన ఇంటికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి తన ప్రియుడు రెహ్మాన్‌ ఇంటిలోనే నివసించేది. అయితే ఈ విషయం రెహ్మాన్‌ కుటుంబ సభ్యులకు కూడా తెలియక పోవడం గమనార్హం.రెహ్మాన్‌ ప్రతిరోజు తన గదికి తాళం వేసుకుని వెళ్లేవాడు.ఈ విధంగా గదికి తాళం ఎందుకు వేస్తున్నావ్ అని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా వారిపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ఇలా ఎవరికీ తెలియకుండా తన ప్రియురాలు 11 సంవత్సరాలపాటు ఒకే గదిలోనే ఉంచాడు.

తన ప్రియురాలికి బోర్ కొట్టకుండా ఒక చిన్న టీవీని ఏర్పాటు చేసి టీవీ శబ్దం బయటకు రాకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకునేది.రెహ్మాన్‌ గదిలో బాత్రూమ్ సదుపాయం లేకపోయినప్పటికీ రాత్రి సమయంలో అందరూ పడుకున్నప్పుడు ఆమె బాత్రూం వెళ్ళేది. అదేవిధంగా రెహ్మాన్‌ కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు వీరిద్దరు స్వేచ్ఛగా ఇంట్లో తిరిగేవారు. ఇలా 11 సంవత్సరాల పాటు ఒకే గదికే పరిమితమైన సజితకు స్వేచ్ఛ కల్పించాలని వారిద్దరూ కలిసి జీవించడం కోసం వేరే ఊరికి వెళ్ళిపోయారు.

ఈ విధంగా రెహ్మాన్‌ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకరోజు అనుకోకుండా రెహ్మాన్‌ సోదరుడు బషీర్‌కు రోడ్డు పక్కన రెహ్మాన్ కనిపించాడు. దీంతో బషీర్ అతడిని అనుసరించాడు. రెహ్మాన్ ఓ అద్దె ఇంట్లో సజితతో కలిసి ఉంటున్నట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలోనే పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టుకు పంపగా కోర్టు వీరిద్దరి పెళ్ళికి నిరాకరించిన అప్పటికీ వీరిరువురు కలిసి ఉండాలని తీర్పునిచ్చింది. చనిపోయిందన్న తమ కూతురు 11 సంవత్సరాల పాటు అదే ఊరిలోనే ఉందని తెలుసుకున్న సజిత కుటుంబ సభ్యులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పీజీ చదువుతూ పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ గా యువతి.. వైరల్ వీడియో!

మనకు కష్టపడే గుణం ఉండాలి కానీ పని చిన్నదా పెద్దదా అనే ఆలోచన లేకుండా ఆ పనిని ఎంతో సునాయాసంగా పూర్తి చేయగలము. సాధారణంగా మహిళలు కేవలం కొన్ని పనులకు మాత్రమే పరిమితం అని భావిస్తుంటారు. కానీ అలా భావించడం పూర్తిగా తప్పని కేరళకు చెందిన 24 సంవత్సరాల యువతి దెలిషా డేవిస్ నిరూపించారు. కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసి నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుని తన పనిని తాను ఎంతో ఇష్టపడుతూ మగువలందరికి ఎంతో ఆదర్శంగా నిలబడిందని చెప్పవచ్చు.

మగవాళ్ళకే ఎంతో కష్టంగా ఉండే ఈ డ్రైవింగ్ ను ఎంచుకున్న దెలిషా డేవిస్ తన వృత్తిని ఎంతో ఇష్టపడుతున్నట్లు తెలిపారు. సుమారు 300 కిలోమీటర్ల పాటు ఏమాత్రం అలుపు లేకుండా పెట్రోల్ ట్యాంకర్‌ను నడుపుతూ డ్రైవింగ్ వృత్తిని ఎంతో ఆస్వాదిస్తూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. వృత్తిపరంగా దెలిషా తండ్రి కూడా లారీ డ్రైవర్ కావడంతోనే ఆమెకు ఈ వృత్తిలో మంచి పట్టు, ఇష్టత నెలకొని ఉంది. తన తండ్రి ప్రోత్సాహం వల్లనే తను ఈ వృత్తిని ఎంచుకున్నట్లు తెలిపారు.

గత మూడు సంవత్సరాల నుంచి తన పెట్రోల్ ట్యాంకర్ ను రోడ్డు పై పరుగులు పెట్టిస్తున్న ఈమె ఒకసారి రోడ్డు రవాణా శాఖ అధికారుల కంటపడింది. అన్ని బండ్లను ఆపిన విధంగానే ఈమె ట్యాంకర్ ను కూడా అధికారులు ఆపగా డ్రైవింగ్ చేస్తున్నది ఒక యువతి అని తెలుసుకొని అధికారులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్, ప్రమాదకర వస్తువులను రవాణా చేసే లైసెన్స్ చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.

ఈ సందర్భంగా దెలిషా మాట్లాడుతూ మల్టీయాక్సిల్ వోల్వో బస్సును నడపాలన్నదే తన కలని అందుకు వీలుగా ప్రత్యేక లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. ఈ విధంగా డ్రైవింగ్ ఎంచుకున్న ఈమె చదువును మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చదువును కూడా కొనసాగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలబడిందని చెప్పవచ్చు.

మరణ శిక్షను అడ్డుకున్నారు.. కోటి రూపాయిలు పరిహారం కట్టారు?

కోట్లకు పడగలెత్తిన సంపన్నులు ఆ డబ్బులు సంపాదించడం కంటే వాటిని ఖర్చు చేయడంలో కూడా తన మానవత్వాన్ని చాటుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఓ వ్యక్తి చేసిన సహాయం, ఆయన మంచితనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న ఘటన తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది.లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ కోటి రూపాయలు పరిహారం చెల్లించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళకి చెందిన కృష్ణన్(45) యూఏఈలో ఉద్యోగం చేసేవారు. తొమ్మిదేళ్ల కిందట 2012లో కారు యాక్సిడెంట్ చేయడంతో సూడాన్‌కి చెందిన ఒక బాలుడు మృతి చెందాడు.దీంతో కేవలం అతని నిర్లక్ష్యం కారణంగానే కారు ప్రమాదం చోటుచేసుకుని బాలుడు మృతి చెందాడని సాక్షాలు ఉండడంతో కేవలం అతని నిర్లక్ష్యం కారణంగానే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని భావించిన న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది.

న్యాయస్థానం విధించిన మరణశిక్ష నుంచి కృష్ణన్ కాపాడటం కోసం తమ కుటుంబం అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా క్షమాభిక్ష కోరుతూ బాలుడు కుటుంబాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే బాలుడి కుటుంబం సూడాన్ వెళ్లిపోవడంతో క్షమాభిక్ష ప్రయత్నాలు నెరవేరలేదు. చివరికి లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీని కలిసి విషయం విన్నవించారు. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ తనకు అందజేయాల్సిందిగా యూసఫ్ తెలిపారు.

కేసు వివరాలన్నింటినీ పరిశీలించిన యూసుఫ్ ఈ ప్రమాదం నిర్లక్ష్యం కారణంగా కాదని,కేవలం ప్రమాదవశాత్తు మాత్రమే జరిగిందని భావించి ఎలాగైనా తనని మరణ శిక్ష నుంచి విముక్తి కల్పించాలని భావించాడు. అప్పటినుంచి అతను ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అదే విధంగా సూడాన్ లో ఉన్నటువంటి బాలుడు కుటుంబాన్ని అబుదాబి రప్పించారు. పలు దఫాలు వారితో చర్చించి వారిని క్షమాభిక్షకు ఒప్పించారు.ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదుర్చుకొని కోర్టుకు కోటి రూపాయలను పరిహారం చెల్లించి అతనికి మరణశిక్ష నుంచి విముక్తి కల్పించారు.ఈ విధంగా చేయని తప్పుకు శిక్ష పడే కాపాడటమే కాకుండా కుటుంబానికి మొత్తం సహాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు.