Tag Archives: kurnool district

ఆగ్రహించిన ఉల్లి రైతు.. మార్కెట్ కు తీసుకొచ్చిన పంట విషయంలో..!

మొన్నటి వరకు ఉల్లి ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమయంలో ఎక్కువగా రైతులు లాభపడ్డారు. ప్రస్తుతం అదే ఉల్లి రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేదని ఓ రైతు ఆగ్రహించి తాను పండించిన పంటకు నిప్పు పెట్టాడు.

ఈ ఘటన కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంచలింగాల గ్రామానికి చెందిన ఉల్లి రైతు వెంకటేశ్వర్లు ఉల్లిని విక్రయించేందుకు మార్కెట్ కు వెళ్లాడు. మొన్నటి వరకు మంచి డిమాండ్ ఉన్న ఉల్లికి ప్రస్తుతం కూడా అదే డిమాండ్ ఉంటుందని అనుకున్నాడు.

కానీ అతడు కర్నూలు మార్కెట్‌కు తన ఉల్లిని తీసుకొచ్చిన తర్వాత షాక్ అయ్యాడు. ఈ-నామ్‌ పద్ధతిలో క్వింటా రూ.350 ధర పలకడంతో దీంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. గిట్టుబాటు ధర లభించడం లేదంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ-నామ్‌ పద్ధతి ద్వారా కొంతమంది రైతులకు మాత్రమే మంచి ధరలు వస్తున్నాయని.. మిగతా వారు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అంతే కాకుండా.. ఆగ్రహించిన రైతు ఉల్లి బస్తాలపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టాడు. ఇక దీనిపై అధికారులు స్పందించారు. క్వింటాల్ కు రూ.600 నుంచి రూ.700 మధ్య ఇప్పిస్తామని ప్రకటించడంతో రైతులు శాంతించారు. ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇటువంటివి మరోసారి చోటు చేసుకోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

ఇదెక్కడి సాంప్రదాయ…కర్రలతో కొట్టుకున్నారు.. 100 మందికిపైగా గాయాల పాలయ్యారు..!

విజయదశమి సందర్భంగా అక్కడ సంప్రదాయంగా వస్తున్న పద్ధతి కర్రలతో సమరం. ఈ సారి అక్కడ హింస చెలరేగింది. ఈ ఘటనలో 100 మందికిపైగా గాయాలు అయ్యాయి. 9 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆలూరు, ఆదోని, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం క్షణ క్షణం ఉద్విగ్నభరితంగా సాగుతుంది. శుక్రవారం అర్థరాత్రి ఈ సమరం ప్రారంభమైంది.

ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జైత్రయాత్రలో హింస చెలరేగింది. సుమారు వంద మందికి గాయాలయ్యాయి. స్వామి వార్ల కల్యాణానికి ముందు నెరిణికి, నెరిణికి తాండ, కొత్తపేట గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అక్కడే ఉన్న కొండపై నుంచి ఉత్సవానికి సంబంధించిన విగ్రహాలను భక్తులు పల్లకిలో జైత్రయాత్ర కోసం కిందకు తీసుకువచ్చారు.

ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు చుట్టు పక్కల గ్రామాల భక్తులు.. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు ఉండగా.. అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భక్తులు ఒకవైపు ఉండి.. ఇరువురు విడిపోయి కర్రలతో తలపడ్డారు. రింగులు తొడిగిన కర్రలతో భక్తులు కొట్టుకున్నారు.

ఇటువంటి హింస జరగకూడదని పోలీసులు ముందుగానే పహారా కాశారు. కానీ వాళ్లు ఈ హింసను నిలువరించలేకపోయారు. ప్రతి ఏటాలానే వంద మందికిపైగా తలలు పగిలాయి. దీంతో ఆ ఘటనపై లోకాయుక్తతో పాటు మానవహక్కుల కమిషన్ సీరియస్ అయింది. కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. కళ్లెదుటే హింస జరగుతుంటే పోలీసులు నియంత్రించలేకపోయారు అంటూ సీరియస్ అయింది.

జంటహత్యలు కలకలం.. వివాహేతర సంబంధమే కారణమా..

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరి వ్యక్తులను రాత్రి సమయంలో అతికిరాతంగా నరికి అక్కడ నుంచి పారిపోయారు. అనంతరం అందులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒక్కసారిగా సీమలో జంట హత్య కలకలం రేపింది.

స్థానికంగా ఉండే ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమైందో తెలుసుకునే లోపే రెండు హత్యలు జరిగాయి. కర్నూలు జిల్లా సిద్దాపురం గ్రామానికి చెందిన మల్లికార్జునకు ఇద్దరు భార్యలు ఉన్నారు. వారు వెలుగోడులో నివాసం ఉంటున్నారు. అయితే మల్లికార్జున్ దగ్గర గత కొన్నేళ్ల నుంచి ఓబులేసు అనే వ్యక్తి పని చేస్తున్నాడు.

అతడు ఆ ఇంట్లోనే పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో మల్లికార్జున రెండో భార్య చిన్నిని, ఓబులేసును ఎవరో దుండగులు అతికిరాతంకంగా హత్య చేసి పారిపోయారు. దీనికి సూత్రదారి మల్లికార్జున్ తండ్రే అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

ఈ హత్యలకు అక్రమ సంబంధం కూడా కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ హత్యలకు మల్లికార్జున్ తండ్రితో పాటు మరొకరు కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

వింత ఆచారం…తేళ్లతో దేవునికి పూజలు..ఎక్కడంటే..?

కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు, నమ్మకాలు ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. టెక్నాలజీ ఎంత దూసుకుపోతున్నా కొన్ని ప్రాంతాల వారు మాత్రం మూఢనమ్మకాలను నమ్ముతూ వాటినే ఆచరిస్తుంటారు. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే.. పాములను, తేళ్లను చూస్తే వాటికి దూరంగా పోని మనిషి అంటూ ఉండడు.

ఎందుకంటే వాటికి విషం ఉంటుంది కాబట్టి. మహిళలు అయితే బొద్దింకలు, జెర్రులను చూసినా కేకలు వేస్తూ కంగారు పడిపోతుంటారు. ఇక తేళ్లను చూస్తే.. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఉండరు. కానీ ఇక్కడ ఆచారంలో భాగంగా..తమ దేవుడిని దర్శించుకోవాలంటే తేళ్లను తీసుకెళ్లి దర్శించుకుంటారు. అందేంటి అనుకుంటున్నారా.. అయితే వివరంగా తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోడుమూరులో తేళ్లను పట్టుకుంటూ పండగ జరుపుకుంటారు. తేళ్లనే చేతితో పట్టుకొని దేవుడికి హారంగా వేసి పూజిస్తారు. అవి అక్కడ ఉన్న వారికి ఎలాంటి హానీ చేయవంట. ఒకవేళ ఆ తేళ్లు కుట్టినా కూడా.. గుడి చుట్టు మూడు ప్రదక్షిణలు చేస్తే నొప్పి కూడా ఉండదని అక్కడ ప్రజల నమ్మకం. శ్రావణమాసం మూడో సోమవారం ఇక్కడ కొండలరాయుడి స్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు.

ఆకొండపై ఉన్న ఏ రాయిని కదిపినా తేళ్లే కనిపిస్తాయి. అక్కడ తేళ్లను పట్టుకొని దేవుడిని పూజిస్తారు. వాటిని పట్టుకొని విచిత్రమైన విన్యాసాలు చేసినా ఏమి కాదనేది వారి నమ్మకం. కానీ ఇదంతా మూఢ నమ్మకమని.. వాటి వల్ల ప్రమాదం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ ఆచారం కాస్త విచిత్రంగా ఉంది కదు..