Tag Archives: lakhs

Shrihan: గోల్డెన్ బ్రీఫ్ కేస్ అందుకొని రన్నర్ గా నిలిచిన శ్రీహన్ ఎన్ని లక్షల గెలుచుకున్నాడో తెలుసా? పాపం రేవంత్ !

Shrihan: బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు కార్యక్రమం నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో ఎవరు విజేతగా నిలుస్తారన్న అంశంపై ఆతృత నెలకొంది. ఈ క్రమంలోనే టాప్ త్రీ కంటెస్టెంట్ గా ఉన్న సమయంలో హీరో రవితేజ హౌస్ లోకి వెళ్లి 10% డబ్బును ఆఫర్ చేశారు.

ఆ డబ్బు తీసుకొని బయటకు రావడానికి ఎవరు ఇష్టపడలేదు. ఇక రవితేజ అందులో ఉన్న ప్రైజ్ మనీ 25% పెంచినప్పటికీ ఎవరు కూడా డబ్బు తీసుకొని బయటకు రావడానికి ఇష్టపడలేదు.అయితే బయట ఉన్న కీర్తి స్నేహితులు తనని 25 లక్షల తీసుకొని రమ్మని చెప్పినప్పటికీ ఆమె మాత్రం తీసుకోకుండా టాప్ త్రీ లో హౌస్ నుంచి బయటకు వచ్చారు.

ఇక హౌస్ లో శ్రీహాన్ రేవంత్ ఇద్దరూ ఉన్న సమయంలో నాగార్జున 25 లక్షల క్యాష్ ఉన్నటువంటి గోల్డెన్ బ్రీఫ్ కేస్ తో హౌస్ లోపలికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆ 25 లక్షలు తీసుకొని రావడానికి ఇద్దరు ఆసక్తి చూపలేదు. ఇక దానిని 30 మరియు 40 లక్షలు చేశారు. ఇలా 40 లక్షలు చేసేటప్పటికీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల అభిప్రాయం కూడా అడిగారు.

Shrihan: విజేతకు 10 లక్షలు రన్నర్ కు 40 లక్షలు…


చాలామంది డబ్బు తీసుకోమని శ్రీహానికి సలహా ఇచ్చారు. ఇక శ్రీహాన్ తల్లిదండ్రులు కూడా తనకు డబ్బులు తీసుకోమని చెప్పడంతో తన తల్లిదండ్రుల చెప్పిన మాట ప్రకారం శ్రీహన్ 40 లక్షల తీసుకొని బయటకు వచ్చారు.ఇలా రన్నర్ గా నిలిచిన శ్రీహన్ 40 లక్షల గెలుచుకోగా విన్నర్ గా నిలిచిన రేవంత్ మాత్రం కేవలం పదిలక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు.

అమ్మ బాబోయ్.. టీ పొడి కిలో రూ. 99,999.. ఎందుకింత ధర.. తెలుసా?

ఎన్ని డ్రింక్స్ ఉన్నా.. టీకి ఉండే ప్రత్యేకతే వేరు.. ఉదయాన్ని ఓ కప్పు టీ కడుపులో పడనిదే ఏ పని మొదలు పెట్టని వారు చాలా మంది ఉంటారు. ఉదయం నుంచి మొదలుపెడితే.. సాయంత్రం దాకా పదుల సంఖ్యలో టీలను తాగే టీ వ్యసనపరుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. టీ లేనిదే ఏ ఆతిధ్యం కూడా మొదలుకాదందే అతిశయోక్తి కాదు.. 

ఇలాంటి టీకి కారణమైన టీ పొడికి ఎంత ధర ఉంటుంది. ఒక కిలోకు వందల్లో ఉంటుంది.. మరి ఎక్కువ డిమాండ్ ఉన్న టీ పొడి అయితే మహా అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది.. కానీ ఒక కిలో టీ పొడి పౌడర్ లక్ష రూపాయలు ఉందంటే ఎవరైనా నమ్ముతారా… నమ్మకపోతే టీ పొడి గురించి తెలుసుకోవాల్సింది. 

టీ పౌడర్లలో అస్సాంలో పండే టీ పౌడర్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండే తేయాకు మంచి సువాసన, టేస్ట్ ఇస్తుందని చాలా మంది చెబుతుంటారు. కాగా ఇటీవల నాణ్యమైన తేయాకును అక్కడి యజమానులు వేలానికి పెట్టారు. దీంట్లో కిలో టీ పౌడర్ ఏకంగా లక్ష రూపాయలు పలికింది. సౌరవ్ టీ ట్రేడర్స్ అనే సంస్థ ’మనోహరి గోల్డ్ టీ పొడి‘ని రికార్డ్ ధర పెట్టి కొనుగోలు చేశారు.

ఏకంగా రూ.99,999ను వేలంలో పాడి ఈ తేయాకును దక్కించుకున్నారు. గతంలో కూడా ఒక కిలో ఈ టీపౌడర్ రూ. 75 వేలకు అమ్ముడైంది. టీ కాచేటప్పుడు గోల్డ్ రంగు రావడం మనోహరి గోల్డ్ టీ పొడి ప్రత్యేకత. అంతే కాకుండా ఈ టీ వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉండటం కూడా టీ పొడికి ఈ రేటు పలుకుతోంది.

ఈ 5 ఉద్యోగాలు చేస్తే సులువుగా లక్షల్లో వేతనం మీ సొంతం..!


మనలో చాలామందికి ఆరంకెల జీతం తీసుకోవాలనే ఎంకల ఉంటుంది. అయితే మనం చదివిన చదువు, చేరే కంపెనీ, పని చేసే ప్రాంతం ఆధారంగానే వేతనాల చెల్లింపులు ఉంటాయి. రాండ్ స్టాడ్ కంపెనీ దేశవ్యాప్తంగా సర్వే చేసి ఎక్కువ వేతనం చెల్లించే ఉద్యోగాల జాబితాను విడుదల చేసింది. మన దేశంలో ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరు నగరంలో కంపెనీలు ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో వేతనాలను చెల్లిస్తున్నాయని ఈ సర్వేలో తేలింది.

బెంగళూరు తర్వాత ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, పూణె ఆ జాబితాలో ఉన్నాయి. ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు 5 ఉద్యోగాలలో ఏదో ఒక దానిని ఎంచుకుంటే సంవత్సరానికి 40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం వేతనాన్ని పొందవచ్చు. దేశంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఉద్యోగాలకు డిమాండ్ బాగా ఉంది. స్టాక్స్, సెక్యూరిటీస్ అంశాలపై అవగాహనతో పాటు కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్స్ లాంటి ఫైనాన్స్ అసెట్స్ బాగా అర్థం చేసుకుంటే ఈ ఉద్యోగం మంచి కెరీర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

మెడికల్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు కూడా ఎంతో డిమాండ్ ఉంది. కరోనా వైరస్ విజృంభణ తర్వాత ఈ ఉద్యోగాలకు డిమాండ్ మరింత పెరిగింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు సెప్షలైజేషన్ చేసి ఈ ఉద్యోగలకు అర్హులు కావచ్చు. ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఉద్యోగాలలో ఛార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. చార్టెడ్ అకౌంటెంట్లు ట్యాక్స్ మేనేజ్ మెంట్ వ్యవహారాలు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ చేయాల్సి ఉంటుంది.

డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు కూడా భారీగా డిమాండ్ ఉంది. టెలికం, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రిటైల్, ఐటీ రంగాల్లో కూడా డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. బ్లాక్ చెయిన్ డెవలపర్ల ఉద్యోగాలకు ఇప్పుడిప్పుడే దేశంలో డిమాండ్ పెరుగుతోంది. ఈ ఐదు ఉద్యోగాలలో ఏదో ఒక ఉద్యోగాన్ని కెరీర్ ఆప్షన్ గా ఎంచుకోవడం వల్ల సులభంగా ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చు.