Tag Archives: Linking Aadhaar

Aadhaar: ఇకపై ఆస్తులతో ఆధార్ అనుసంధానం… ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!

Aadhaar: ఆధార్ ప్రస్తుతం ఒక వ్యక్తికి ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పాలి. ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఓటర్ కార్డ్ పాన్ కార్డ్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ తో అనుసంధానం జరిగింది.ఇలా ఒక వ్యక్తికి ఆధార్ అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఇకపై ఒక వ్యక్తి ఆస్తిపాస్తులను కూడా ఆధార్ తో అనుసంధానం చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆస్తులతో ఆదర్ అనుసంధానం చేయాలని ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది.దేశ పౌరుల స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలనుకోవడం మంచి విషయమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి దాఖలైన పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టు సోమవారం కేంద్రం నుంచి తమ అభిప్రాయాలను కోరారు.

ఈ పిటిషన్‌ను విచారించిన చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మలతో కూడిన ధర్మాసనం.. ఈ అంశంలో నాలుగు వారాల్లో ప్రతిస్పందన ఇవ్వాలని కోరారు. అవినీతి నల్లధనం,బినామీ చెల్లింపులను అరికట్టడం కోసం ఆస్తులను కూడా ఆధార్ అనుసంధానం చేయాలని ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్ విచారణ తిరిగి జూలై 18 వ తేదీకి వాయిదా పడింది.

Aadhaar: నల్లధనం అరికట్టడమే లక్ష్యం…

ఇక అవినీతి, నల్లధనం, ఆస్తులు జప్తు చేయడం ప్రభుత్వ బాధ్యత అని న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ పై దర్యాప్తు జరిపిన హైకోర్టు ఇది మంచి అంశమని అయితే ఈ విషయంపై మరిన్ని స్పందనలు కూడా రావాలని కోర్టు కోరారు.ఇలా ఆస్తులకు కూడా ఆదార్ అనుసంధానం చేయాలి అంటూ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయంపై పలువురు స్పందిస్తూ ఇప్పటికే ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి కూడా ఆధార్ అనుసంధానం చేయబడింది. ఇక మిగిలినది ఆస్తులు మాత్రమేనంటూ పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై తదుపరి విచారణలో కోర్టు ఏ విధమైనటువంటి తీర్పును వెల్లడిస్తుందో తెలియాల్సి ఉంది.