Tag Archives: lip lock scenes

Lavanya Tripati: లిప్ లాక్ సన్నివేశాలకు భయపడి ఆ బ్లాక్ బస్టర్ వదులుకున్న లావణ్య త్రిపాఠి?

Lavanya Tripati: లావణ్య త్రిపాఠి పరిచయం అవసరం లేని పేరు. అందాల రాక్షసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించారు. ఇకపోతే మరి కొద్ది రోజులలో ఈమె తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్నారు.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నటువంటి లావణ్య త్రిపాఠి ఏకంగా తనతో కలిసి ఏడు అడుగులు నడవడానికి సిద్ధమయ్యారు.

ఇప్పటికే ఈమె ఎంతో ఘనంగా నిశ్చితార్థం కూడా జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈమె సినీ కెరియర్ విషయానికి వస్తే ఎన్నో తెలుగు సినిమాలలో నటించిన ఈమె తాజాగా పులిమేక అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈమె సినీ కెరియర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్నానని చెప్పుకొచ్చారు.ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా లిప్ లాక్ సన్నివేశాలలో లావణ్య త్రిపాఠి నటించిన సందర్భాలు లేవు.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండతో కలిసి తనకు గీతాగోవిందం సినిమాలో నటించే అవకాశం వచ్చిందట అయితే ఇందులో లిప్ లాక్ సన్ని వేషాలు అధికంగా ఉండడంతో కేవలం ఆ సన్నివేశాలలో నటించడానికి భయపడి తాను ఈ బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్నానని లావణ్య త్రిపాఠి ఓ సందర్భంలో తెలియజేశారు. ఈ సినిమాను నేను రిజెక్ట్ చేయడంతోనే రష్మిక ఈ సినిమాలో నటించిందని తెలిపారు.

Lavanya Tripati: పాన్ ఇండియా స్టార్ అయ్యేదాన్ని…


ఒకవేళ ఈ సినిమాలో కనుక నేను నటించి ఉంటే రష్మిక లాగా నేను కూడా ఈపాటికి పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే దానిని అంటూ గీత గోవిందం సినిమా గురించి ఆ సినిమాని వదులుకోవడం గురించి లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anikha Surendran: రెండో సినిమాకే లిప్ లాక్ సీన్లలో రెచ్చిపోయిన అనిఖా సురేంద్రన్… వైరల్ అవుతున్న ట్రైలర్ వీడియో!

Anikha Surendran: హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాలో ఆయన కుమార్తెగా నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమాలో నాగార్జునకు మేనకోడలుగా నటించి సందడి చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ గురించి పరిచయం అవసరం లేదు.ఇలా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈమె అనంతరం హీరోయిన్ గా మారి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తెలుగులో బుట్ట బొమ్మ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలోనే మలయాళంలో ఓ మై డార్లింగ్ అనే సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారు. అనిఖా సురేంద్రన్, మెల్విన్ జి బాబు జంటగా నటించిన ఈ సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ట్రైలర్ కనుక చూస్తే ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అని అర్థమవుతుంది.

Anikha Surendran: లిప్ లాక్ సీన్లలో నటించిన అనిఖా…

ఇక ఈ ట్రైలర్ లో భాగంగా హీరోయిన్ ఏకంగా హీరోకి లిప్ లాక్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మడికి ఇండస్ట్రీ నీళ్లు బాగా ఒంటబట్టినట్లు ఉన్నాయి. అందుకే రెండో సినిమాకి ఇలా లిప్ లాక్ సీన్లలో రెచ్చిపోయి నటించారు అంటూ ఈ ట్రైలర్ పై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kamal Hassan: కమల్ హాసన్ హీరోయిన్లకు ఇలాంటి కండిషన్ పెట్టేవారా… తప్పకుండా సినిమాలో ఆ సీన్స్ ఉండాల్సిందేనా?

Kamal Hassan: చిత్ర పరిశ్రమలో లెజెండరీ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే విశేష ఆదరణ సంపాదించుకున్న కమల్ హాసన్ ఇప్పటికి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు.

తాజాగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టిన విషయం మనకు తెలిసిందే. ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ హాసన్ తన సినిమాలలో నటించే హీరోయిన్లకు మాత్రం ఓ కండిషన్ పెట్టేవారట. ఈయన సినిమాలలో తప్పకుండా హీరోయిన్లతో లిప్ లాక్ సన్నివేశాలు ఉండాలని కండిషన్ పెట్టేవారట.

కమల్ హాసన్ నటించిన సినిమాలలో తప్పనిసరిగా లిప్ లాక్ సన్నివేశాలు ఉండాలని,హీరోయిన్లు కూడా అతనితో పెదవి కలపాలని చెప్పినప్పటికీ పలువురు హీరోయిన్లు సినిమాలు చేయడానికి ఇష్టపడేవారు. ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లుగా కొనసాగిన రేవతి,గౌతమి, మనీషా కోయిరాలా పూజ కుమార్ వంటి వాళ్ళు కమల్ హాసన్ తో కలిసి లిప్ లాక్ సన్ని వేషాలలో నటించారు.

Kamal Hassan: మహిళా అభిమానులకు మైనస్ అయిన కమల్ హాసన్..


ఇండస్ట్రీలో గొప్ప నటుడు గొప్ప నిర్మాత అయినప్పటికీ
స్త్రీ లోలుడు అన్న విమ‌ర్శ‌లు ఆయ‌న‌పై తీవ్రంగా ఉన్నాయి. క‌మ‌ల్ వైవాహిక జీవితంలో రెండు, మూడు పెళ్లిళ్లు విడాకులు అవ్వడం మైనస్ కావడంతో మహిళా అభిమానులలో మైనస్ గా మారాడు అదే ఆయన కెరియర్లో ఎంతో బాడ్ అయింది. ఇక హీరోయిన్లు కూడా కమల్ సినిమా అంటే లిప్ లాక్ సన్నివేశాలకు సిద్ధంగా ఉండేవారని చెప్పాలి.

Rashmika: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. లిప్ లాక్ సన్నివేశాలపై రష్మిక కామెంట్స్ వైరల్!

Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. నటి రష్మిక మందన్న కన్నడ నటి అయినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో అగ్రనటిగా కొనసాగుతున్నటువంటి ఈమె ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక నటించిన గుడ్ బై సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.ఈ సినిమా అక్టోబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమెకు లిప్ లాక్ సన్ని వేషాలపై ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.

రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో విజయ్ దేవరకొండ తో కలిసి డియర్ కామ్రేడ్,గీత గోవిందం వంటి సినిమాలలో నటించారు. ఈ రెండు సినిమాల్లో కూడా ఈమె లిప్ లాక్ సన్ని వేశాలలో నటించారు.అయితే ఈ సినిమాలలో లిప్ లాక్ సీన్లలో నటించడం వల్ల ఎలాంటి భావన కలిగిందనే విషయంపై రష్మిక స్పందించారు.

Rashmika: ఆ ట్రోల్స్ బాధపెట్టాయి..

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఈ సినిమాలో ఇలాంటి సన్నివేశాలలో నటించినప్పుడు తనకి ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. అయితే సినిమా విడుదలైన తర్వాత ఈ సన్నివేశాల గురించి వచ్చిన ట్రోల్స్ తనని చాలా బాధపెట్టాయని రష్మిక వెల్లడించారు. నేటిజన్స్ చేసిన ఆ ట్రోల్స్ గుర్తుచేసుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు గడపానని రాత్రిపూట నిద్ర కూడా పట్టేది కాదంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.