Anikha Surendran: హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాలో ఆయన కుమార్తెగా నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమాలో నాగార్జునకు మేనకోడలుగా నటించి సందడి చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ గురించి పరిచయం అవసరం లేదు.ఇలా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈమె అనంతరం హీరోయిన్ గా మారి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగులో బుట్ట బొమ్మ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలోనే మలయాళంలో ఓ మై డార్లింగ్ అనే సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారు. అనిఖా సురేంద్రన్, మెల్విన్ జి బాబు జంటగా నటించిన ఈ సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ట్రైలర్ కనుక చూస్తే ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అని అర్థమవుతుంది.
ఇక ఈ ట్రైలర్ లో భాగంగా హీరోయిన్ ఏకంగా హీరోకి లిప్ లాక్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మడికి ఇండస్ట్రీ నీళ్లు బాగా ఒంటబట్టినట్లు ఉన్నాయి. అందుకే రెండో సినిమాకి ఇలా లిప్ లాక్ సీన్లలో రెచ్చిపోయి నటించారు అంటూ ఈ ట్రైలర్ పై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…