Featured

Hero Varun Sandesh : మోహన్ బాబు ఎవరో కూడా నాకు తెలియదు… పొద్దున్నే మా ఇంటికి వచ్చి చేసిన పనికి షాక్ అయ్యాను… ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్నా…: హీరో వరుణ్ సందేశ్

Varun Sandhesh : శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో 2007 సంవత్సరంలో తెలుగు సినిమాకు పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్, ‘హ్యాపీ డేస్’ సినిమాలో తమన్నాకు జోడిగా చందు పాత్రలో ఒదిగిపోయాడు. ఆ తరువాత 2008 లో వచ్చిన ‘కొత్త బంగారంలోకం’ సినిమా ద్వారా మరోసారి హిట్ కొట్టాడు. వరుసగా మంచి హిట్స్ అందుకున్న వరుణ్ సందేశ్ కథలను సరిగా ఎంచుకోక పోవడం వల్ల ఆ తరువాత పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. ఇక సినిమా కెరీర్ ను వదిలేసి మళ్ళీ అమెరికా వెళ్లిపోయిన వరుణ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

మోహన్ బాబు గారు అలాంటి వారు…

వరుణ్ సందేశ్ ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో కలిసి నటించిన వితికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక సోలో హీరోగానే కాకుండా సహాయక పాత్రలలో కూడా వరుణ్ కనిపించాడు. మోహన్ బాబు ఆయన కుమారులతో కలిసి నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో వరుణ్ నటించాడు. ఇక ఆ సినిమాతో మోహన్ బాబు గారితో పరిచయమేర్పడి ఆయన గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. వరుణ్ సందేశ్ పెళ్ళి రిసార్ట్ లో చాలా దూరంగా జరగడం వల్ల రానందుకు మోహన్ బాబు గారు స్వయంగా ఆయన స్టాఫ్ తో మరుసటి రోజు పొద్దున్నే ఇంటికి వచ్చి కొత్త జంటకు విష్ చేశారట.

మోహన్ బాబు గారిలాంటి గొప్ప వ్యక్తి అలా రావడం చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని వరుణ్ సందేశ్ చెప్పారు. ఇక వరుస హిట్లతో దూసుకుపోయిన వరుణ్ మధ్యలో కథల ఎంపికలో తడబడటం వల్ల ఫ్లాపులను చూసాడు. ఆ సమయంలో కొంచెం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుని మళ్ళీ అమెరికా వెళ్లిపోయాడట వరుణ్. ఇక మళ్ళీ సినిమాల్లోకి రావాలా వద్దా అనే కన్ఫ్యూషన్ లో ఉన్నానని అయితే సినిమా మీద ఇష్టం మళ్ళీ లాక్కొచ్చిందంటూ చెప్పారు వరుణ్ సందేశ్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago