Movie News

Kutty Padmini: నాకు రెండో పెళ్లి జరిగినా మొదటి భర్తను కూడా ఇంట్లో పెట్టుకొని చూసుకున్నాను… నటి పద్మని కామెంట్స్ వైరల్!

Kutty Padmini: చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కుట్టి పద్మిని ప్రస్తుతం నిర్మాతగా మారారు.మూడు నెలల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అనంతరం బాలనటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఉత్తమ బాలనటిగా అవార్డులు కూడా అందుకున్నారు. పద్మిని తల్లి రాధ కూడా నటి కావడంతో ఈమె మూడు నెలల వయసులోనే సినిమాలలో నటించారు.

ఇలా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా కుట్టిపద్మిని ప్రస్తుతం వైష్ణవి ఫిలింస్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అనే బ్యానర్ ద్వారా సీరియల్స్ నిర్మిస్తూ నిర్మాతగా మారిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన సినీ కెరియర్ గురించి పలు విషయాలు తెలిపారు.తనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు వచ్చింది అలాగే తనకు హీరోయిన్గా అవకాశాలు కూడా వచ్చాయని అయితే అడ్జస్ట్ కావాలని
అడగటంతో సినిమా అవకాశాలను కూడా వదులుకున్నానని తెలిపారు.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కుమార్తె అర్హ నటించిన భరతుడి పాత్ర తాను కూడా ఎన్టీఆర్ హీరోగా నటించిన శకుంతల సినిమాలో భరతుడు పాత్రలో నటించానని అప్పుడు తాను నిజమైన పులిపై వచ్చానని ఈమె ఆ పాత్ర గురించి గుర్తు చేసుకున్నారు. ఇక సినిమా విషయాలు మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ…తాను మొదట వివాహం చేసుకున్న తర్వాత తన భర్త తాగుడుకు బానిస కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయామని తెలిపారు.


Kutty Padmini: ఆరోగ్యం బాగా లేకపోతే నేనే చూసుకున్నా.

ఇలా మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత రెండవ వివాహం చేసుకున్నాను. తనకు ఇద్దరు పిల్లలు జన్మించారని తెలిపారు.అయితే తన మొదటి భర్త ఎలాంటి ఉద్యోగం లేకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురి కావడంతో ఆయనను తీసుకువచ్చి మా ఆఫీస్ కింద ప్రత్యేకంగా గది నిర్మించి అక్కడ పెట్టి తనని చూసుకున్నానని తెలిపారు. ఇక నా రెండో భర్త తన సెక్రటరీని రెండవ వివాహం చేసుకొని వెళ్లిపోయారని ప్రస్తుతం తాను తన పిల్లలతో ఒంటరిగా గడుపుతున్నానని తెలిపారు.రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భర్తతో బెడ్ షేర్ చేసుకోకూడదు కానీ తన అవసరాలు తీర్చడంలో నాకు తప్పనిపించలేదని అందుకే తన మొదటి భర్తను తన ఇంట్లోనే పెట్టి చూసుకున్నానంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago