Venu Thottempudi : ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో వేణు తొట్టెంపూడి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని ఆ తరువాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఉరేళితే వంటి సినిమాలతో మంచి హిట్లు అందుకున్నాడు. అయితే ‘దమ్ము’ సినిమా తరువాత సినిమాలకు దూరమైన వేణు చెన్నైలో స్థిరపడి తన వ్యాపారాల్లో బిజీ అయ్యారు. మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తరువాత రవితేజ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో నటించారు. మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్న వేణు ఆయన సినిమా కెరీర్ గురించి విశేషాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
జగపతి బాబుతో మాటలు లేవు… అదే కారణం…
వేణు తన కెరీర్ లో ఇతర హీరోలతో కలిసి ఎక్కువగా సినిమాలను చేసారు. శ్రీకాంత్, జగపతి బాబు ఇలా ఇతర హీరోలతో కలిసి మల్టీ స్టార్రర్ సినిమాలను అందులోనూ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసారు. ఇక జగపతి బాబు తో కలిసి హనుమాన్ జంక్షన్, ఖుషీ ఖుషీగా సినిమాల్లో కలిసి నటించారు. ఆయనతో మంచి సంబంధాలే ఉన్నాయంటూ తెలిపిన వేణు అయితే ఆయనతో ప్రస్తుతం మాటలు లేవు అంటూ తెలిపారు.
ఒక వ్యక్తికి డబ్బు అప్పుగా ఇచ్చినపుడు జగపతి బాబు గారు హామీ ఇచ్చి ఇప్పించారు. అయితే ఆ వ్యక్తి డబ్బు ఇప్పటికీ ఇవ్వలేదు. మొత్తం 14 లక్షలు పోయాయి. ఆ సమయంలో నాకది చాలా ఎక్కువ డబ్బు. కానీ జగపతి బాబు గారు కనీసం ఫోన్ చేసి ఆ తరువాత ఒకసారి కూడా ఇచ్చాడా లేదా అని అడగలేదు. ఆ ఇష్యూని నేను ఇక వదిలేసాను, అతను ఇవ్వడని అర్థమైంది. ఆ తరువాత జగపతి బాబు గారు నాతో మళ్ళీ మాట్లాడలేదు, కొంచెం బాధేసింది. ఇప్పటికీ ఆయనతో మళ్ళీ మాట్లాడలేదు అంటూ చెప్పారు వేణు తొట్టెంపూడి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…