Movie News

Lavanya Tripati: లిప్ లాక్ సన్నివేశాలకు భయపడి ఆ బ్లాక్ బస్టర్ వదులుకున్న లావణ్య త్రిపాఠి?

Lavanya Tripati: లావణ్య త్రిపాఠి పరిచయం అవసరం లేని పేరు. అందాల రాక్షసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించారు. ఇకపోతే మరి కొద్ది రోజులలో ఈమె తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్నారు.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నటువంటి లావణ్య త్రిపాఠి ఏకంగా తనతో కలిసి ఏడు అడుగులు నడవడానికి సిద్ధమయ్యారు.

ఇప్పటికే ఈమె ఎంతో ఘనంగా నిశ్చితార్థం కూడా జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈమె సినీ కెరియర్ విషయానికి వస్తే ఎన్నో తెలుగు సినిమాలలో నటించిన ఈమె తాజాగా పులిమేక అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈమె సినీ కెరియర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్నానని చెప్పుకొచ్చారు.ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా లిప్ లాక్ సన్నివేశాలలో లావణ్య త్రిపాఠి నటించిన సందర్భాలు లేవు.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండతో కలిసి తనకు గీతాగోవిందం సినిమాలో నటించే అవకాశం వచ్చిందట అయితే ఇందులో లిప్ లాక్ సన్ని వేషాలు అధికంగా ఉండడంతో కేవలం ఆ సన్నివేశాలలో నటించడానికి భయపడి తాను ఈ బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్నానని లావణ్య త్రిపాఠి ఓ సందర్భంలో తెలియజేశారు. ఈ సినిమాను నేను రిజెక్ట్ చేయడంతోనే రష్మిక ఈ సినిమాలో నటించిందని తెలిపారు.

Lavanya Tripati: పాన్ ఇండియా స్టార్ అయ్యేదాన్ని…


ఒకవేళ ఈ సినిమాలో కనుక నేను నటించి ఉంటే రష్మిక లాగా నేను కూడా ఈపాటికి పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే దానిని అంటూ గీత గోవిందం సినిమా గురించి ఆ సినిమాని వదులుకోవడం గురించి లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago