Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. నటి రష్మిక మందన్న కన్నడ నటి అయినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో అగ్రనటిగా కొనసాగుతున్నటువంటి ఈమె ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక నటించిన గుడ్ బై సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.ఈ సినిమా అక్టోబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమెకు లిప్ లాక్ సన్ని వేషాలపై ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.
రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో విజయ్ దేవరకొండ తో కలిసి డియర్ కామ్రేడ్,గీత గోవిందం వంటి సినిమాలలో నటించారు. ఈ రెండు సినిమాల్లో కూడా ఈమె లిప్ లాక్ సన్ని వేశాలలో నటించారు.అయితే ఈ సినిమాలలో లిప్ లాక్ సీన్లలో నటించడం వల్ల ఎలాంటి భావన కలిగిందనే విషయంపై రష్మిక స్పందించారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఈ సినిమాలో ఇలాంటి సన్నివేశాలలో నటించినప్పుడు తనకి ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. అయితే సినిమా విడుదలైన తర్వాత ఈ సన్నివేశాల గురించి వచ్చిన ట్రోల్స్ తనని చాలా బాధపెట్టాయని రష్మిక వెల్లడించారు. నేటిజన్స్ చేసిన ఆ ట్రోల్స్ గుర్తుచేసుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు గడపానని రాత్రిపూట నిద్ర కూడా పట్టేది కాదంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…