The Ghost movie review : నాగార్జున చాలా రోజులకు ఒక యాక్షన్ సినిమాతో మన ముందుకు వచ్చారు. విభిన్న సినిమాల దర్శకుడు పవన్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 5న దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. తమిళంలో నేరుగా విడుదల అయిన ఈ సినిమా హిందీ లో మాత్రం కాస్త ఆలస్యంగా విడుదల కానుంది. నాగార్జున కి జోడిగా లెజెండ్ బ్యూటీ సోనాలి చౌహన్ నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా ఆల్రడీ ఎలా ఉందో ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా చెప్పేస్తున్నారు. మరి నాగార్జున, పవన్ సత్తార్ కాంబినేషన్ వర్క్ అవుట్ అయిందో లేదో రివ్యూతో తెలుసుకుందాం.
ఒక చేత్తో గన్స్ అండ్ ఒక చేత్తో గర్ల్స్…
ది ఘోస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అయితే నాగార్జున అనగానే మినిమం హీరోయిన్ తో రొమాన్స్ ఎక్సపెక్ట్ చేస్తారు ఆడియన్స్. ఈ వయసులో కూడా మన్మధుడు అనిపించుకుంటున్న నాగ్ సోనాలి చౌహన్ కెమిస్ట్రీ స్క్రీన్ మీద బాగుంది. ఇక సినిమాలో మెయిన్ హైలైట్ ఇంట్రెవెల్ ముందు 20 నిమిషాలు వచ్చే యాక్షన్ ఎలేవేషన్ సీన్స్, చాలా బాగుంటాయి. ఇక సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మంచి ప్లస్ పాయింట్, థియేటర్లో జనాలను ఆకట్టుకుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో సోనాలి తో నాగార్జున సీన్స్, ఇంకా ఎమోషనల్ సీన్స్ వర్క్ అవుట్ అవలేదు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున చెల్లెలుగా గుల్ పనాగ్ మేనకోడలిగా అనికా సురేంద్రన్ నటించారు.
రిచ్ బ్యాక్ గ్రౌండ్ లో దర్శకుడు సన్నివేశాలను బాగా చిత్రీకరించినా ఎమోషనల్ సీన్స్ లో మాత్రం సరిగా నటించకపోవడం వల్ల తెచ్చిపెట్టుకున్న ఏడుపు చూడలేక పోయారు జనాలు. ఏదో డైరెక్టర్ తిడతాడేమో అన్నట్లుగా కొన్ని సన్నివేశాల్లో బాధను నటించారు యాక్టర్స్. ఓవరాల్ గా సినిమా ఒకసారి చూడొచ్చు అనేలా ఉందంటూ టాక్ వినిపిస్తోంది. కొంతమంది ఆడియన్స్ సినిమా యాక్షన్, థ్రిల్లింగ్ సన్నివేషాలతో కథలో మనల్ని డైరెక్టర్ లీనం చేయిస్తాడు, చాలా బాగుంది సినిమా, నాగ్ హిట్ కొట్టాడు అంటున్నారు. మరికొంతంది మాత్రం నాగార్జున నటన, యాక్షన్ సన్నివేశాల్లో స్టైలిష్ నటన పక్కనపెడితే సెంటిమెంట్ సన్నివేశాలు పండలేదని పండగ నాడు ఒకసారి సినిమా చూడొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మిక్సడ్ టాక్ తో ది ఘోస్ట్ సినిమా రన్ అవుతోంది. పండగ సెలవులు సినిమా ప్లస్ అవ్వొచ్చు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…