Featured

God Father movie review : మెగాస్టార్ మాస్ ఎంటర్టైనర్ నచ్చిందా… చిరుకి దసరా పండుగ కలిసోచ్చిందా.. లేదా..!

God Father movie review : మెగాస్టార్ చిరంజీవి చాలా రోజులకు ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఆ తరువాత వచ్చిన ‘సైరా’ అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఈ మధ్య వచ్చిన ‘ఆచార్య’ ఏకంగా చిరుని భయపెట్టేసింది. రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన ఆచార్య సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. ఇక ఆచార్య ఫలితంతో మెగా అభిమానులు ‘గాడ్ ఫాదర్’ సినిమా మీద గంపెడు ఆశలతో ఉన్నారు. గాడ్ ఫాదర్ సినిమా మోహన్ లాల్ నటించిన మలయాళం సినిమా ‘లూసిఫర్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కనుకగా అక్టోబర్ 5న విడుదల అయింది. సినిమా విదేశాల్లో అపుడే రిలీజ్ అవడం వల్ల ట్విట్టర్ లో ప్రేక్షకుల రివ్యూలు వచ్చేసాయి.

గాడ్ ఫాదర్ తో బాస్ ఇస్ బ్యాక్ ..??

ఆకలితో ఉన్న వ్యక్తి కి బిర్యానీ దొరికినట్లు ఆచార్య తో నిరాశలో ఉన్న మెగా అభిమానులకు గాడ్ ఫాదర్ బిర్యానీలా దొరికిందని చెప్పొచ్చు. మెగాస్టార్ ని మాస్ హీరోగా ఎలివేట్ చేసి డైరెక్టర్ సక్సెస్ అయినట్లే. చిరు తో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగులో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇక లూసిఫర్ సినిమా తెలుగులో కూడా డబ్ అవడం వల్ల ఆల్రెడీ సినిమా కథ ఏంటి అనేది అందరికీ తెలుసు. అయితే సినిమాలో చిరుని ఎలా చూపించాడు, మన తెలుగు నేటివిటీ కి తగ్గట్టు కథను డైరెక్టర్ మలిచాడా ప్రేక్షకులకు నచ్చిందా అన్నదే పాయింట్. మెగాఫ్యాన్స్ కి సినిమా పండగ అనే చెప్పాలి.

పొలిటికల్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటం వల్ల మెగాస్టార్ అభిమానులకు నచ్చితుంది. అయితే కామన్ ఆడియన్స్ కి సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ ల్యాగ్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ కి గబ్బర్సింగ్ ఎలానో చిరు కి గాడ్ ఫాదర్ అలాగ అంటున్నారు. అయితే సినిమాలో సల్మాన్ ఖాన్ క్యారెక్టర్ నిరాశ పరిచిందని అంటున్నారు. సల్మాన్ యాక్షన్ సన్నివేశాల్లో గ్రాఫిక్స్ వర్క్ బాగోలేదంటూ టాక్ వినిపిస్తోంది. అయితే క్లైమాక్స్ మాత్రం అదిరిపోయిందంటూ టాక్. ఇక నయనతార, సత్యదేవ్ పర్వాలేదనిపించారు. అయితే సినిమా ఒకసారి చూడొచ్చు అంటూ కామన్ ఆడియన్స్ అంటుంటే చిరు ఫ్యాన్స్ మాత్రం సినిమా సూపర్ అంటున్నారు.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

18 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

19 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago