Tag Archives: LTC facility

ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. ఆ ట్యక్స్ మినహాయింపు..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా, లాక్ డౌన్ ఇతర రంగాలతో పోల్చి చూస్తే ఆతిధ్య రంగంతో పాటు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నెల నాలుగవ వారం నుంచి దేశంలో లాక్ డౌన్ ఆంక్షలు అమలు కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెషన్ ను వినియోగించుకోలేకపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేసింది.

ఉద్యోగులు 2018 – 2021 సంవత్సరాలకు సంబంధించి సెలవులను నగదుగా మార్చుకునే సదుపాయం కల్పించడంతో పాటు ఉద్యోగులకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కేంద్రం భావిస్తోంది. ఇలా చేయడం వల్ల నగదు వినియోగం గతంతో పోలిస్తే భారీగా పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. అక్టోబర్ నెల 12వ తేదీన దీనికి సంబంధించిన జీవో జారీ అయింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.

సాధారణంగా లీవ్ ట్రావెల్ కన్సెషన్ కు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో ఎల్టీసీ సెలవులను నగదుగా మార్చుకునే వారికి కూడా పన్ను మినహాయింపును కల్పిస్తున్నట్టు కేంద్రం వెల్లాడించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎల్టీసీ సౌకర్యం పొందే ఇతర ఉద్యోగులకు కూడా కేంద్రం ఇదే తరహా ప్రయోజనాలను కల్పించేందుకు సిద్ధమవుతోంది.

కేంద్ర ప్రభుత్వం నిబంధంనలకు అనుగుణంగా గరిష్టంగా 36,000 రూపాయలకు ఆదాయపు పన్ను మినహాయించే అవకాశాలు ఉంటాయని సమాచారం. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు ప్రశంసిస్తున్నారు.