Tag Archives: maa elections 2021

మా ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బాబు గోగినేని.. నల్లా దగ్గర లొల్లి అంటూ..!

అక్టోబర్ 10వ తేదీన మా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మా సభ్యుల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఒకరి ప్యానెల్ సభ్యుల పై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి ప్యానెల్ సభ్యులకు మద్దతు తెలుపుతున్న వారు సైతం మీడియా వేదికగా మరొకరు పై విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మా ఎన్నికల పై బాబు గోగినేని స్పందించారు. ఇదివరకే ఒక సారి మా ఎన్నికల గురించి బాబు గోగినేని మాట్లాడుతూ తమదైన శైలిలో కొందరి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి బాబు గోగినేని మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ బెదిరింపు మాటలు బడాయి మాటలే మాట్లాడతారు అంటూ బాబు గోగినేని మా ఎన్నికల గురించి స్పందించారు.

ప్రస్తుతం మా ఎన్నికలలో ఓటుకు 10,000 ఇస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.ఈ విషయంపై బాబు గోగినేని మాట్లాడుతూ ఓటుకు నోటు అంటూ మా ప్రతిష్టను బ్రష్టు పట్టిస్తున్నారు. పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నువ్వు మగాడివైతే అంటూ మాట్లాడడం వెంటనే నీకు డీసెంన్సీ అంటూ ప్రశ్నించడమే కాకుండా మా కుటుంబం మమ్మల్ని ఇలా పెంచింది అంటూ మురిసిపోవడం ఏంటి అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.

మీరు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే మీ ప్యానెల్ లోని ఆడవాళ్లు ఏం చేస్తున్నారు? పైగా సినీపెద్దలట .. హీరోయిన్ల పై చేతులు చేసుకునేవారు సినీపెద్దలా?సినిమా ఇండస్ట్రీలో మీటు ఉద్యమం జరుగుతున్నప్పుడు నక్కినక్కి చూస్తున్న వారు సినీపెద్దలా? సినిమాలలో డూప్ పెట్టుకొనే వీళ్లు హీరోలా… పక్క రాష్ట్రాల నుంచి హీరోయిన్లను తేప్పించుకున్న వారే అడగాలి మా ఎన్నికలలో అధ్యక్షత పదవికి పోటీ చేయడం కోసం ప్రాంతీయంగా ఎవరు దొరకలేదా…అని ఆపండి మీ నల్లా దగ్గర లొల్లి అంటూ తనదైన శైలిలో మా ఎన్నికల గురించి బాబు గోగినేని షాకింగ్ కామెంట్ చేశారు.

ఎన్టీఆర్ కి క్షమాపణ చెప్పిన జీవిత రాజశేఖర్.. ఎందుకంటే?

అక్టోబర్ 10వ తేదీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలలో పోటీ చేసే వారిలో టెన్షన్ మొదలైంది అని చెప్పవచ్చు. ఇప్పటికే మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ -మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో పోటీలు ఏర్పడి పెద్దఎత్తున ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉన్నటువంటి జీవితా రాజశేఖర్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పారు. అసలు ఈమె ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్పడానికి కారణం ఏమిటనే విషయానికి వస్తే… ఇటీవలకాలంలో జీవిత రాజశేఖర్ ఎన్టీఆర్ ను కలిసినప్పుడు మా ఎన్నికలలో తమకు ఓటు వేయాలనే అడిగినప్పుడు ఎన్టీఆర్ ఏ విధంగానూ స్పందించలేదు.

ఈ క్రమంలోనే జీవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ మా ఎన్నికలలో ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదంటూ మీడియాకు తెలియజేశారు.ఈ క్రమంలోనే మంచు విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తనకు మద్దతు తెలుపుతూ తనకు ఓటు వేస్తానని చెప్పినట్లు విష్ణు తెలియజేశారు.

తాజాగా జీవిత రాజశేఖర్ మీడియా సమావేశంలో భాగంగా ఎన్టీఆర్ గురించి మీడియా ఎదుట అలా చెప్పినందుకు ఎన్టీఆర్ క్షమించాలని క్షమాపణలు కోరింది. ఎన్టీఆర్ చాలా క్యాజువల్ గా చర్చించిన విషయాలను తాను అలా మీడియా ఎదుట చెప్పకుండా ఉండాల్సిందని అలా చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చాయని, ఇలాంటి సమయంలోనే ఒకరి వ్యక్తిగత విషయాలను ఎప్పుడు ఇలా బహిర్గతం చేయకూడదనే తప్పును తెలుసుకోవటం వల్ల ఎన్టీఆర్ ను క్షమాపణ కోరుతున్నట్లు ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ తెలియజేశారు.

బ్యాన్ చేసిన పరిశ్రమకు అధ్యక్షుడు కావాలనుకోవడం వెనుక ప్రకాష్ రాజ్ వ్యూహం ఏంటి.. రివేంజా లేక..?

దక్షిణాది సినీ పరిశ్రమలో నటుడు ప్రకాష్ రాజ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్నటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మా అధ్యక్షుడు పదవికి పోటీ చేయబోతున్నారు. ఈ ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీ జరుగనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ చేసే వారి మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నువ్వా నేనా అంటూ పోటీపడుతూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ లు పెట్టి ఇ ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు.ఇక ఎన్నికలు కేవలం నాలుగు రోజులు ఉన్న నేపథ్యంలో ప్రకాష్ ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆలీ ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి గతంలో ఎన్నో సార్లు తనని బ్యాన్ చేసిన టాలీవుడ్ పరిశ్రమకు అధ్యక్షుడు కావడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? రివెంజ్ తీర్చుకోవడం కోసమేనా అంటూ అలీ ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు ప్రకాష్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అసలు ఆ విషయాన్ని ఇప్పుడు మీరు గుర్తు చేస్తే తప్ప నాకు గుర్తు లేదని, నేనెప్పుడో ఈ విషయాన్ని మర్చిపోయానని ప్రకాష్ తెలియజేశారు. ఈ క్రమంలోనే తనని సినీ పరిశ్రమ బ్యాన్ చేయడానికి కారణాలు కూడా వివరించారు. ఒకసారి సినిమా సెట్లో ఓ మహిళను ఒక వ్యక్తి రాళ్లతో దాడి చేస్తుంటే ఏంటిది అని తనని తోశాను దీంతో తనపై చేయి చేసుకున్నారని కేసు వేయడంతో ఇండస్ట్రీ బ్యాన్ చేసిందని,అదేవిధంగా ఆగడు సినిమా షూటింగ్ సమయంలో ఓ సన్నివేశంలో భాగంగా దర్శకుడు శ్రీను వైట్లతో విభేదించడం వల్ల తనని రిజెక్ట్ చేసి మరుసటి రోజు నా స్థానంలో సోనుసూద్ ను తీసుకున్నారని ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాష్ రాజ్ తెలియజేశారు.

నువ్వు మగాడివి అయితే నా గురించి మాట్లాడు.. మా ఫ్యామిలీ గురించి ఎందుకు తెస్తావ్ ? : మంచు విష్ణు

అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు కలిసి ఉన్న నటులు, నటీమనుల మధ్య ప్రస్తుతం ఒకరంటే ఒకరిపై పచ్చిగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు అవుతోంది. ఈ ఎన్నికల్లో మొదటి నుంచి మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ల మధ్యే పోటీ ఎక్కువగా ఉంటుందని భావించారు.

ప్రస్తుతం కూడా అలానే సాగుతోంది. మధ్యలో బండ్ల గణేష్, సీవీఎల్ నరసింహారావు పోటీలో నిలబడ్డా.. వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరకు మంచు ప్యానల్, ప్రకాశ్ రాజ్ ప్యానల్ మాత్రమే నిలిచారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ పై మంచు ప్యానల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

మంచు ప్యామిలీ అంటూ.. వ్యక్తిగతంగా విమర్శిస్తే బాగోదని.. తన కుటుంబం పేరు తీస్తే.. మీ పేరు తర్వాత గారు ఉండదని హెచ్చరించారు. తాను మా ఎన్నికలలో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను. తనకు ఓటు అడిగే హక్కు ఉంటుందని.. మీకు దమ్ముంటే.. మగాడు అయితే మీరు విమర్శించే సమయంలో కేవలం తన పేరు మాత్రమే ప్రస్తావించండి అంతేకానీ.. అక్క, తమ్ముడు, నాన్నను ఇందులోకి లాగకండి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

నా కోసం నా కుటుంబం ఓటు అడగవచ్చు అంటూ స్పష్టం చేశారు. మీరు ఓటు అడగడానికి వెళ్లినప్పుడు గిరిబాబు ఇచ్చిన క్లాస్ సరిపోలేదా అంటూ వ్యంగంగా విమర్శించారు. అక్టోబర్ 10 తర్వాత అందరం ఒకే దగ్గర ఉండి పని చేయాల్సి వస్తుంది.. మర్యాదగా మాట్లాడితే మంచిదని అన్నారు. అక్టోబర్ 11వ తేదీన ప్రకాశ్ రాజ్ విమానం ఎక్కి వెళ్లిపోతారు.. శ్రీకాంత్ గారు, బెనర్జీ గారు మీరంటే చాలా ఇష్టం.. మన ముఖాలు అక్టోబర్ 10 తర్వాత ఒకరినొకరు చూసుకోవాలి అంటూ అన్నారు. మనమంతా మా కుటుంబం అని .. ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదంటూ మంచు విష్ణు అన్నారు.

ప్రకాశ్ రాజ్ అప్పుల చిట్టా విప్పిన నరేష్…7.30 కోట్ల చెక్ బౌన్స్ కేసు అంటూ ఆగ్రహం..!

మా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఒకరిపై ఒకరు మాటల తూటాలు సంధించుకుంటున్నారు. ఎన్నికలను పోస్టల్ బ్యాలెట్ ద్వారా మంచు విష్ణు కుట్రకు తెరదీశారంటూ ప్రకాశ్ రాజ్ అనడంతో.. విష్ణు ప్యానల్ సభ్యులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. విష్ణుకు మద్ధతుగా నరేశ్ మాట్లాడుతూ.. జయసుధ పోటీ చేసిన సమయంలో మాత్రమే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పేపర్ వాడామని.. అంతకముందు ఇలాంటివి లేవని.. అతడు చెప్పాడు.

దీనిపై వివిధ రకాలుగా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. దీనిపై విష్ణు మనోవేధనకు గురైనట్లు పుర్కొన్నాడు. అగ్రదేశాలు కూడా పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడిన మాటలు అస్సలు బాగాలేదని అన్నారు. ప్రకాశ్ రాజ్ జీ ఛానెల్, అశోక్ తివారీలకు బాకీ పడ్డారని.. దాదాపు అతడిపై ఏడున్నర కోట్ల చెక్ బౌన్స్ కేసు ఉందని.. అతడు గుర్తు చేశారు. అంతకముందు.. దీనిపైనే ప్రకాశ్ రాజ్ మంచు ప్యానల్ పై శ్రీకాంత్, జీవితా రాజశేఖర్ తో కలిసి వచ్చి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

ఓట్లు కోసం అడ్డదారులు తొక్కడానికి విష్ణు, మోహన్ బాబు ప్రయత్నం చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి ఇక్కడ డబ్బులు కట్టారని, వారితో ఓటు వేయించుకునే కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఎన్నికల్లో 60ఏళ్లు పైబడినవారే పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు అని, వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి డబ్బులు కట్టారని మండిపడ్డారు. మోహన్ బాబు కంపెనీలో మేనేజర్ 56మందికి సంబంధించి రూ. 28వేలు మోహన్ బాబు ఎలా కడతారని ప్రశ్నించారు.

ఎన్నికలు జరుగుతున్న తీరుపై ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్‌, శరత్‌బాబు తదితరుల పోస్టల్‌ బ్యాలెట్‌ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారన్నారు. గెలవడం కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగున్న విషయం తెలిసిందే.

‘మా’ ఎన్నికల పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో సుమన్.. ‘నటించేటప్పుడు ప్రాంతాలు గుర్తురాలేదా’ అంటూ..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు సుమన్ తాజాగా విశాఖపట్నంలోని గాజువాకలో ఏర్పాటుచేసిన కరాటే ఛాంపియన్ షిప్ ఈ కార్యక్రమంలో నటుడు సుమన్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుమన్ మా ఎన్నికల గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అక్టోబర్ 10వ తేదీ జరగబోయే ఈ ఎన్నికలలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై సుమన్ మాట్లాడుతూ ఎన్నికలలో పోటీ చేయడానికి ఎవరైనా అర్హులేనని తెలియజేశారు.

మా ఎన్నికలలో స్థానిక స్థానికేతర అంటూ ప్రాంతీయ విభేదాలు చూపడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఒక్కసారి సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఎక్కడ అవకాశాలు వచ్చినా అక్కడ నటిస్తారని అప్పుడు లేని స్థానిక ప్రాంతీయత ఎన్నికలలో ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ఈ ఎన్నికలలో ఎవరు గెలిచినా ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏక తాటిపై నిలబడి ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని, సినీ పరిశ్రమలో ఎంతోమంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే చాలామంది షుగర్ బీపీ వంటి సమస్యలతో బాధపడుతూ మందులు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు వారిద్దరికి సినీపరిశ్రమ సహాయం చేయాలని, మా అభివృద్ధి కోసం తన వంతు సహాయం చేస్తానని ఈ సందర్భంగా సూచించారు.

‘మా’ బరిలో నిలిచిన తుది జాబితా ఇదే.. వెల్లడించిన కృష్ణమోహన్

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష ఎన్నికలను ఈ నెల 10 న నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ తేదీ దగ్గర పడుతున్న వేళ అధ్యక్ష బరి నుంచి బండ్ల గణేష్ , సీవీఎల్ నరసింహారావులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇక అధ్యక్ష పోటీలో మిగిలింది మంచు విష్ణు, ప్రకాష్ రాజ్. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వెల్లడించారు.

2021-23 కార్యవర్గానికి సంబంధించి మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా.. మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్, విష్ణు మినహా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీవీఎల్ నరసింహారావు, కె.శ్రావణ్ కుమార్ చివరి నిమిషంలో తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

ఇక చివరకు వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందని మొదటి నుంచి చెప్పుకుంటున్నట్లుగానే జరిగింది. చివరకు వీళ్లిద్దరే మిగిలారు. తుది జాబితాలో పేర్లు ఇలా ఉన్నాయి. మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి విష్ణు ప్యానల్ నుంచి బాబుమోహన్, ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. మా అసోసియేషన్‌లో ఉండే రెండు వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు మంచు విష్ణు ప్యానెల్ నుంచి పృథ్వీరాజ్, మాదాల రవి పోటీలో ఉండగా.. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి బెనర్జీ, హేమలు పోటీలో ఉన్నారు. ఇక మా అసోసియేషన్ లో అత్యంక కీలకమైన జనరల్ సెక్రటరీ పోస్టు విషయానకి వస్తే.. మొత్తం ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు.

అందులో జీవితా రాజశేఖర్, రఘుబాబు మరియు బండ్ల గణేష్.. అయితే దీనిలో బండ్ల గణేష్ తప్పుకోగా… ఇక విష్ణు ప్యానల్ నుంచి రఘుబాబు, ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జీవితా రాజశేఖర్ మిగిలారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా… రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణి లు పోటీలో ఉన్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. ఇక ఈసీ పోస్టుల విషయానికి వస్తే మొత్తం 18 పోస్టులు ఉండగా.. దానికి 39 మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలు ఫిల్మ్‌నగర్‌లోని జూబ్లీ పబ్లిక్ పాఠశాలలో జరుగుతాయనే విషయం తెలిసిందే.

నన్ను ఎలక్షన్స్ నుంచి తప్పుకొమ్మని మా నాన్నగారికి కాల్ చేశారు: మంచు విష్ణు

టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10 వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే వారు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో ఎన్నో సమావేశాలు జరగా తాజాగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ మా అసోసియేషన్ పుట్టి పాతిక సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది కార్మికులకు అన్నం పెడుతోందని తెలిపారు. చాలా మంది సినిమా హీరోలు అంటే తెరపై చూపినట్లు ఎంతో ఖరీదైన జీవితాన్ని గడుపుతారని భావిస్తారు కానీ ఒక్కసారి మేకప్ తొలగిస్తే మా జీవితాలు కూడా అందరిలాగే సాధారణ జీవితాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు.

మా ఎన్నికలఅధ్యక్ష పదవికి పోటీ చేస్తానని తన తండ్రితో చెప్పినప్పుడు అందుకు తన తండ్రి నీ ఇష్టం అని చెప్పారు. ఎప్పుడూ కూడా నాన్న ముందు అడుగు వేయలేదు. కానీ కొందరు మా నాన్నకు ఫోన్ చేసి విష్ణుని ఎలక్షన్స్ నుంచి తప్పుకొమ్మని ఫోన్ చేశారు. ఎప్పుడైతే అలా ఫోన్ చేశారో అప్పుడే నాన్నగారు సుమారు 700 మందికి ఫోన్లు చేసి విష్ణు ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు తనకు ఓటు వేసి తనకు మద్దతుగా నిలబడాలని చెప్పారు.

అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ విష్ణు తను ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచయం చేశానని.. అప్పటి వరకు ఏమీ తెలియని వారిని పి.ఆర్.ఓ లుగా కూడా చేశానని వాళ్లకు ఉద్యోగాలు కూడా కావాలంటే ఫోన్ చేసి కొన్ని ఆర్గనైజేషన్స్ కి ఫోన్ చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించాను. ఇప్పటివరకు నా కోసం నేను ఎవరిని ఏమీ అడగలేదు కానీ వారి కోసం అన్నీ చేశాను.

అదేవిధంగా నా స్నేహితులకు పరిచయం చేసి మంచి వాళ్ళని చెప్పడంతో ప్రస్తుతం వాళ్ళు ఇండస్ట్రీలో ఒక లీడింగ్ పి.ఆర్.ఓ లుగా ఉన్నారని ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారని తెలిసిందో అప్పుడు నా స్నేహితులతో ఇప్పుడు మేము వేరే సినిమాలతో బిజీగా ఉన్నాము రాలేమని చెప్పండి అంటూ చెప్పారని ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే మా లో ఎన్నో సవాళ్లు ఉన్నాయని వాటన్నిటినీ ఎదుర్కొనే సత్తా మా ప్యానెల్ కి ఉందని, ఈ ఎన్నికలలో తప్పకుండా తనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

‘మా’ అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధం.. మంచు విష్ణు ప్యానల్‌ ఇదే..!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష ఎన్నికలు ఈ సారి హాట్ హాట్ గా సాగిపోతున్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలో నిర్వహించే సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. నువ్వా.. నేనా అన్నట్టుగా అభ్యర్థుల మధ్య పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన సభ్యులు సోషల్ మీడియాలో.. మీడియా సమావేశాలలో బహిరంగా విమర్శలు చేసుకుంటున్నారు.

మా అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం బరిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. అయితే మంచు విష్ణు ప్రకటించిన మా బిల్డింగ్ తను కట్టిస్తానని చెప్పిన దగ్గన నుంచి దాని చుట్టే ఎన్నికలు తిరుగుతున్నాయి.ఇదే ప్రధాన అంశంగా అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తమ ప్యానెల్ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మంచు విష్ణు కూడా తమ ప్యానెల్ సభ్యులను ప్రకటించాడు. ఇందులో ఈసీ సభ్యులుగా 18 మందిని ప్రకటించాడు విష్ణు. మంచు విష్ణు ప్యానల్ లో.. అధ్యక్షుడిగా మంచు విష్ణు, ఉపాధ్యక్షుడిగా మాదల రవి, పృథ్వీరాజ్ ఉన్నారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్, ట్రెజరర్ గా శివ బాలాజీ, జాయింట్ సెక్రటరీలు కరాటే కల్యాణి, గౌతమ్‌ రాజు లు ఉన్నట్లు ప్రకటించారు.

ఈసీ సభ్యుల్లో అర్చన, అశోక్‌కుమార్‌, గీతాసింగ్‌, హరినాథ్‌బాబు, జయవాణి, మలక్‌పేట్‌ శైలజ, మాణిక్‌, పూజిత, రాజేశ్వరీ రెడ్డి, సంపూర్ణేశ్‌ బాబు, శశాంక్‌, శివన్నారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల, రేఖ ఉన్నారు. అయితే అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‏లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.. నియమ, నిబంధనలు ఇవే..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. ఏ తేదీన, ఏ సమయాన ఎన్నికలు నిర్వహిస్తారనే విషయాలను ప్రకటించారు. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు.

అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. సెప్టెంబరు 27 నుంచి సెప్టెంబర్ 29 వరకు అంటే మూడు రోజులు నామినేషన్లను స్వీకరించి 30న వాటిని పరిశీలిస్తామని కృష్ణమోహన్‌ వివరించారు.

వాటి ఉపసంహరణకు అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఉపసంహరణకు అవకాశం ఉండగా.. తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ పోటీల్లో నిలిచే అభ్యర్థులు ఒక పోస్టుకు ఒక్కరు మాత్రమే పోటీ చేయాలని తెలిపారు. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారని తెలిపారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నామినేషన్లు వేయాలని సూచించారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్, సీవీఎల్‌ నర్సింహరావు ఉన్నారు. దీనిలో గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి.. 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోతే పోటీ చేసే అర్హత ఉండదని పేర్కొన్నారు.