Tag Archives: malaika arora

Malaika Arora: నా భర్తకు విడాకులు ఇవ్వడానికి అదే కారణం… అసలు విషయం చెప్పిన మలైకా అరోరా!

Malaika Arora: ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుంటున్నారో… అంతే తొందరగా వారి పెళ్లికి బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మలైకా అరోరా సైతం తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆరోరా తన భర్తతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఈమె ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న సమయంలోనే అర్భాజ్ ఖాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహమైన అనంతరం విడాకులు తీసుకొని విడిపోయారు.

ఈ సందర్భంగా విడాకుల గురించి మలైకా స్పందిస్తూ తాను తన ఇంటి నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన ఉండడం వల్లే పెళ్లి చేసుకున్నానని తెలిపారు తనకు కూడా తన జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉన్నాయి ఆ లక్ష్యాలను నెరవేర్చుకోవాలంటే కొన్ని బంధాలను దూరం చేసుకోవాల్సి వస్తుంది. నేను మనిషిగా నేడు ఈ స్థానంలో ఉన్నాను అంటే అందుకు గల కారణం అర్భాజ్ ఖాన్ .


Malaika Arora: లక్ష్యం కోసమే భర్తకు విడాకులు ఇచ్చాను…

తన జీవితంలో కొన్ని విభిన్నమైన లక్ష్యాలను కలిగి ఉండడం వల్ల తన భర్త నుంచి విడిపోవాల్సి వచ్చిందని కొన్ని నెరవేరాలంటే కొన్ని బంధాలకు దూరం కావాల్సి ఉంటుంది అందుకే తాను తన భర్తకు విడాకులు ఇచ్చి దూరంగా ఉన్నానని ఈమె విడాకులకు గల కారణాలను తెలియజేశారు. అయితే ప్రస్తుతం మలైకా అరోరా అర్జున్ కపూర్ ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Arjun Kapoor – Malaika Arora: చైతూ… సామ్ బాటలోనే విడిపోవడానికి సిద్ధమైన మరొక బాలీవుడ్ స్టార్ జంట?

Arjun Kapoor – Malaika Arora: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారు ఎప్పుడు ప్రేమలో పడతారో ఎప్పుడు మనస్పర్ధలు వస్తాయో ఎవరికీ తెలియదు.ఈ క్రమంలోని ఎంతోమంది ప్రేమలో పడి సహజీవనం చేస్తూ వారి రిలేషన్ ని కంటిన్యూ చేయగా మరికొందరు వారి మధ్య మనస్పర్థల కారణంగా వారి రిలేషన్ కి బ్రేక్ అప్ చెబుతుంటారు.

Arjun Kapoor – Malaika Arora: చైతూ… సామ్ బాటలోనే విడిపోవడానికి సిద్ధమైన మరొక బాలీవుడ్ స్టార్ జంట?

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఉన్నటువంటి సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ జంట విడాకుల ప్రకటన చేయగానే ఎంతో మంది అభిమానులు షాక్ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా వీరి బాటలోనే మరో బాలీవుడ్ జంట పయనిస్తోందని చెప్పాలి.

Arjun Kapoor – Malaika Arora: చైతూ… సామ్ బాటలోనే విడిపోవడానికి సిద్ధమైన మరొక బాలీవుడ్ స్టార్ జంట?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలకు కొనసాగిన అర్జున్ కపూర్ , మలైకా అరోరా తమ బంధానికి బ్రేక్ అప్ చెప్పినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోని గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారనీ బాలీవుడ్ టాక్. గతంలో మలైకా అరోరా సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న మలైకా అతనితో విడాకులు తీసుకొని గత నాలుగు సంవత్సరాల నుంచి అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లిన జంటగా కలిసి వెళ్లే ఈ ఇద్దరు ప్రస్తుతం ఒకరినొకరు కలుసుకోవడంలేదని వీరిద్దరు విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అర్జున్ కపూర్ తన సోదరి ఇంటికి డిన్నర్ కి వెళ్ళిన అక్కడ మలైకా కనిపించకపోవడంతో అందరికీ అనుమానాలు పెరిగాయి.

మాల్దీవుల ట్రిప్ తో అనుమానాలకు చెక్…

ఇలా వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ జంట మాత్రం ఈ విషయంపై స్పందించకపోవడంతో మరింత అనుమానాలు కలుగుతున్నాయి.అయితే గత కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి గురించి వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పడినట్లు అయింది. అయితే ఈ ట్రిక్ అనంతరం వీరిద్దరూ విడిగా ఉంటున్నారనే వార్తలు బీ టౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి.నాలుగు సంవత్సరాల నుంచి సహజీవనంలో ఉన్న ఈ జంట కొన్ని కారణాల వల్ల విడిపోతున్నారని త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది.

అలాంటి మగాళ్లంటే ఇష్టం .. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మలైకా అరోరా..

సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు ద్వారా వార్తల్లో నిలుస్తూ ఐటెం సాంగ్స్, గ్లామర్ షోతో బాలీవుడ్ లో పాపులర్ అయిన నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో ఐటమ్ సాంగులతో గ్లామరస్ గా కనిపిస్తూ సందడి చేసిన ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ.. తన గ్లామరస్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నెటిజన్లను సందడి చేస్తున్నారు.

ఇలా ఎన్నో సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈమె తాజాగా నటుడు మిలింద్ తో కలసి సూపర్ మోడల్ అఫ్ ది ఇయర్ షోకి జడ్జ్  లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం మధ్యలో వీరిద్దరి మధ్య ఒక కన్వర్జేషన్ జరిగింది. ఈ క్రమంలోని మిలింద్ అడిగిన కొన్ని ప్రశ్నలకు మలైకా బోల్డ్ సమాధానం చెబుతూ… అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ కార్యక్రమంలో భాగంగా మిలింద్ మగాళ్ళలో మీకు మూడ్ తెప్పించే అంశాలు ఏంటని అడగడంతో.. ఈ ప్రశ్నకు ఏ మాత్రం సంకోచం చెందకుండా మలైకా తనకు క్లీన్ షేవ్ చేసుకున్న మగాళ్లంటే ఇష్టముండదని, ఎక్కువగా ముద్దులు పెడుతూ..సరసమాడే వాడై ఉండాలని అలాంటి వారు అంటేనే తనకు ఇష్టం అంటూ బోల్డ్ సమాధానం చెప్పింది. ఇలా మలైకా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయి.

ఇలా బోల్డ్ కామెంట్, ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం అభిమానులను సందడి చేసే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఇక నాలుగు పదుల వయస్సులో ఉన్నప్పటికీ ఈమె తన శరీర ఫిట్ నెస్ పై దృష్టి సారిస్తానని.. శరీర ఫిట్నెస్ కోసమే ఎక్కువ సమయం గడుపుతూ కఠిన వ్యాయామాలు చేస్తుందని చెప్పవచ్చు.

బ్లాక్ వాటర్ తాగుతున్న సెలబ్రిటీలు.. ఎందుకు ఇంత ప్రత్యేకత.. బ్లాక్ వాటర్ లో ఏముంది..?

చాలామందికి మినరల్‌ వాటర్‌, రోజ్‌వాటర్‌ అంటే తెలుసు కానీ బ్లాక్ వాటర్ అంటే ఏమిటలో తెలియదు. వినడానికి ఈ పేరు కాస్త కొత్తగా ఉంది కదా.. ఎందుకంటే మన దగ్గర ఇలాంటి ఓ వాటర్ ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఇప్పుడు బ్లాక్ వాటర్ అనేది మార్కెట్‌లోకి వచ్చింది. బాలీవుడ్ సెలబ్రిటీస్ కొందరు ఇదే తాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ ఎప్పటి నుంచో ఈ నలుపు నీళ్లు తాగుతున్నారు.

తాజాగా బాలీవుడ్ న‌టి మ‌లైకా ఆరోరా సైతం ఈ బ్లాక్‌వాట‌ర్‌నే తాగుతుంది. అసలు ఈ నలుపు వాటర్ ఏంటి అంటూ.. నెటిజన్లు గూగుల్ లో తెగ వెతుకుతున్నారు. దీని వల్ల లాభాలేంటి అనేది వారు తెలుసుకుంటున్నారు. అందులోనూ మలైకా అరోరా లాంటి బడా సెలబ్రిటీ సైతం బ్లాక్ వాటర్ తాగుతుందంటే.. అందులో ఏంటి స్పెషల్ అంటూ ఆరా తీస్తున్నారు. సాధార‌ణంగా మ‌నం తాగే మిన‌ర‌ల్ వాట‌ర్ ఖ‌రీదు ఒక లీట‌ర్‌కు రూ. 20 నుంచి 30 వరకు ఉంటుంది. కానీ దానికి మూడింతలు ధరతో బ్లాక్ వాటర్ ల‌భిస్తుంది.

లీటర్‌ బ్లాక్‌ వాటర్‌ బాటిల్‌కు దాదాపు రూ. 100 ఉంటుందట. దీనిలో ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో చాలా ఆరోగ్య సూత్రాలు దాగున్నాయి. లీట‌ర్ బ్లాక్ వాట‌ర్‌లో 70 మిన‌ర‌ల్స్ ఉంటాయి. అవి జీర్ణ‌శ‌క్తిని పెంపొందిస్తాయి. దాంతో పాటు మెటబాలిజం పెంపొందిస్తుంది. ఇమ్యూనిటీ పెంచడమే కాకుండా లోయర్ అసిడిటి కూడా రాకుండా చూసుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే మలైకా అరోరా ఈ బ్లాక్ వాటర్ తాగేస్తుంది. అంతేకాదు ఈ వాటర్ తాగడం వల్ల వయసు కూడా తక్కువగా కనిపిస్తుందట. అంటే యవ్వనంగా ఉండేలా చేస్తుందన్నమాట. కేవలం మలైకా అరోరా మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీ, శృతి హాసన్, ఊర్వశి రౌతెలా లాంటి సెలబ్రిటీస్ కూడా బ్లాక్ వాటర్ తాగుతున్నారు. సెలబ్రిటీలు వీటిని తాగడంతో వాటి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.