చాలామందికి మినరల్ వాటర్, రోజ్‌వాటర్ అంటే తెలుసు కానీ బ్లాక్ వాటర్ అంటే ఏమిటలో తెలియదు. వినడానికి ఈ పేరు కాస్త కొత్తగా ఉంది కదా.. ఎందుకంటే మన దగ్గర ఇలాంటి ఓ వాటర్ ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ఇప్పుడు బ్లాక్ వాటర్ అనేది మార్కెట్‌లోకి వచ్చింది. బాలీవుడ్ సెలబ్రిటీస్ కొందరు ఇదే తాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ శ్రుతిహాసన్ ఎప్పటి నుంచో ఈ నలుపు నీళ్లు తాగుతున్నారు.
తాజాగా బాలీవుడ్ నటి మలైకా ఆరోరా సైతం ఈ బ్లాక్‌వాటర్‌నే తాగుతుంది. అసలు ఈ నలుపు వాటర్ ఏంటి అంటూ.. నెటిజన్లు గూగుల్ లో తెగ వెతుకుతున్నారు. దీని వల్ల లాభాలేంటి అనేది వారు తెలుసుకుంటున్నారు. అందులోనూ మలైకా అరోరా లాంటి బడా సెలబ్రిటీ సైతం బ్లాక్ వాటర్ తాగుతుందంటే.. అందులో ఏంటి స్పెషల్ అంటూ ఆరా తీస్తున్నారు. సాధారణంగా మనం తాగే మినరల్ వాటర్ ఖరీదు ఒక లీటర్‌కు రూ. 20 నుంచి 30 వరకు ఉంటుంది. కానీ దానికి మూడింతలు ధరతో బ్లాక్ వాటర్ లభిస్తుంది.
లీటర్ బ్లాక్ వాటర్ బాటిల్‌కు దాదాపు రూ. 100 ఉంటుందట. దీనిలో ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో చాలా ఆరోగ్య సూత్రాలు దాగున్నాయి. లీటర్ బ్లాక్ వాటర్‌లో 70 మినరల్స్ ఉంటాయి. అవి జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. దాంతో పాటు మెటబాలిజం పెంపొందిస్తుంది. ఇమ్యూనిటీ పెంచడమే కాకుండా లోయర్ అసిడిటి కూడా రాకుండా చూసుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే మలైకా అరోరా ఈ బ్లాక్ వాటర్ తాగేస్తుంది. అంతేకాదు ఈ వాటర్ తాగడం వల్ల వయసు కూడా తక్కువగా కనిపిస్తుందట. అంటే యవ్వనంగా ఉండేలా చేస్తుందన్నమాట. కేవలం మలైకా అరోరా మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీ, శృతి హాసన్, ఊర్వశి రౌతెలా లాంటి సెలబ్రిటీస్ కూడా బ్లాక్ వాటర్ తాగుతున్నారు. సెలబ్రిటీలు వీటిని తాగడంతో వాటి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…