రేపు అనగా ఆగస్టు 22 న రాఖీ పౌర్ణమి. ఇది అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు ఎంతో ఇష్టమైన పండుగ. రక్షా బంధన్, రాఖీ, ఇలా ఏ పేరుతో పిలిచినా.. అందులో ఉండే పవర్ మాత్రం ఒకటే. తమ సోదరులు క్షేమంగా ఉండాలని అని కోరుకుంటూ.. సోదరీమణులు వారికి ఈ రాఖీని కడుతారు. అందుకు ఫలితంగా సోదరులు వారికి తమకు తోచన బహుమానాన్ని అందజేస్తారు.
ఈ సాంప్రదాయం కొన్ని వందల సంవత్సరాలుగా మన భారతదేశంలో కొనసాగుతూ వస్తోంది. ఈ రాఖీ పండగకు మరొకరోజు మాత్రమే ఉండగా.. ఇప్పటికే వీధుల్లో రాఖీ షాపింగ్‌లతో కోలాహలం మొదలైంది. అయితే సాధారణంగా రాఖీ పండుగకు సోదరులు.. తమ అక్క లేదా చెల్లల్లకు కానుకలు ఇస్తారు. ఇది మొదటి నుంచి వస్తున్నా ఆచారం.
కానీ, కొణిదెల నట వారసురాలు నిహారికా ఈసారి తన అన్న వరుణ్ తేజ్‌కు రాఖీ పండుగ కానుకను డిఫరెంట్ గా అందించింది. అది మరేంటో కాదు.. ‘బ్రో’ సినిమాలోని ‘అన్నయ్యా నువ్వు పిలిస్తే’ అనే లిరికల్ సాంగ్ వరుణ్ తేజ్‌కి డెడికేట్ చేస్తున్నట్లు తెలిపింది నిహారిక. అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అనురాగం, ఆప్యాయతలను తెలియజేసే విధంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీత పాడిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
కార్తీక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2020 సంవత్సరం డిసెంబర్ లో చైతన్య జొన్నలగడ్డని నిహారిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వైవాహిక జీవితంతో బిజీగా ఉన్న నిహారిక.. మరో వైపు తన ప్రొడక్షన్‌లో వెబ్ సిరీస్‌ని నిర్మిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…