Featured

దాదాపు ఒకే కథతో వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడాయో చూడండి..!!

సినీ పరిశ్రమలోసమవుజ్జీలుగా ఉన్న ఇద్దరు హీరోల చిత్రాలు ఒకేరోజు విడుదల అవ్వడం చూశాం. లేదా ఒక హీరో చిత్రాలు ఒకే రోజు రెండు విడుదలవడం చూశాం. లేదా ఒకే టైటిల్ తో రెండు చిత్రాలు రావడం చూశాం. కానీ ఒకే కథను ఆధారంగా చేసుకుని రెండు చిత్రాలు రావడం అరుదు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో ఒకే కథతో ఇద్దరు హీరోలు వేరువేరు చిత్రాలు చేశారు.

అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర కుమార్ కుమారుడే సుమంత్. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ కథ’ చిత్రం తో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత యువకుడు, సత్యం లాంటి చిత్రాల్లో ఆయన నటించారు. జెనీలియాతో జత కట్టిన “సత్యం” సినిమా సుమంత్ కి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత వచ్చిన సుమంత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిపోయాయి.

2005, ఆర్.ఎస్.మూవీ ప్రొడక్షన్స్, వి.సముద్ర దర్శకత్వంలో “మహానంది” సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో శ్రీహరి ప్రధాన పాత్ర పోషించగా, సుమంత్, అనుష్క హీరో, హీరోయిన్లుగా నటించారు. సంగీత దర్శకుడు కృష్ణమోహన్ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సుమంత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

విలక్షణ నటుడు మోహన్ బాబు పెద్ద కుమారుడు హీరో విష్ణు. ‘రగిలే గుండెలు’ అనే సినిమాతో బాలనటుడిగా తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టారు. 2003లో విష్ణు సినిమాతో హీరోగా తెరపై కనిపించాడు. సూర్యం, అస్త్రం, గేమ్ లాంటి చిత్రాల్లో నటించిన విష్ణుకి విజయాన్ని ఇవ్వలేకపోయాయి. అలాంటి క్రమంలో.. 2007, సిరి వెంకటేశ్వర ఫిలిమ్స్, శ్రీను వైట్ల దర్శకత్వంలో “ఢీ” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో శ్రీహరి ప్రధాన పాత్ర పోషించగా విష్ణు, జెనీలియా హీరో, హీరోయిన్లుగా నటించారు. చక్రి అందించిన సంగీతం పర్వాలేదు అనిపించుకుంది. “డీ” చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది.

ఈ రెండు చిత్రాల్లో శ్రీహరి సెటిల్మెంట్, దాదాగిరి పాత్రలో నటించారు. ఆయనకు ‘మహానంది’ సినిమాలో గారాల చెల్లిగా అనుష్క నటించగా, “ఢీ” సినిమాలో జెనీలియా నటించింది. మహానందిలో సుమంత్, శ్రీహరికి సన్నిహితుడిగా నటించగా, డీ చిత్రంలో శ్రీహరి “అడ్డా”లో విష్ణు గుమస్తాగా నటించారు. శ్రీహరికి తెలియకుండా, లేదా ఎదిరించి రెండు చిత్రాల్లో హీరోలు ఆయన చెల్లెలిని వివాహం చేసుకుంటారు. ఇలా అనేక రకాలైన అంశాలు రెండు చిత్రాల్లో కనబడడం గమనార్హం. చివరికి ప్రత్యర్థులపై పోరాడి విజయం సాధిస్తారు. దాదాపు రెండు సంవత్సరాల తేడాతో వచ్చిన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఒకటి యావరేజ్ గా నిలువగా మరొకటి హిట్ కొట్టింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago