సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ఎంత టాలెంట్ ఉన్నా.. లక్ లేకపోతే వారి గమనం అక్కడే ఆగిపోతుంది. రెండు.. మూడు సినిమాలు పెద్ద హిట్ అయినా తర్వాత కెరీర్ సరిగ్గా ఉండదు. ఇలా తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారు. అందులో ఒకరు హీరో రోహిత్.16 సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోహిత్ మంచి హిట్ అందుకున్నాడు. తనకంటూ ఓ మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. తర్వాత నేను సీతా మహాలక్ష్మి, జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలతో దూసుకుపోయాడు.
అప్పటి నుంచి అతడికి యూత్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అటు హీరోగా చేస్తూ కూడా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో కూడా నటించాడు రోహిత్. అంతేకాకుండా తరుణ్ హీరోగా నటించిన ‘నవ వసంతం’ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి తన నటనతో అందరినీ మెప్పించాడు. అయితే సినిమాలో అతడి ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. ఇటీవల అతడు ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. చిన్న తనం నుంచి వాళ్ల అమ్మ అతడిని బాగా చూసుకునేదని.. వాళ్ల నాన్న ఎప్పుడూ తాగి వచ్చేవాడని.. దీంతో తాము రోడ్డున పడాల్సిన పరిస్థతి వచ్చిందని చెప్పాడు.
అప్పుడు సినిమాలోకి వచ్చి కుటుంబానికి అండగా ఉన్నా.. తర్వాత కాలంలో సినిమా అవకాశాలు తగ్గినట్లు చెప్పాడు. ఈయనతో పాటు ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి స్టార్ హీరోలకు వచ్చిన గుర్తింపు వచ్చినప్పటికీ.. వాళ్లతో పాటు రోహిత్ కూడా తర్వాత కాలంలో ఫేడ్ అవుట్ అయి పోయారు. అయితే ఇదంతా ఇబ్బంది అనిపించలేదు కానీ.. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం కొంచెం కష్టం అయిందని చెప్పుకొచ్చాడు. అయితే ఓ అమ్మాయిని పుస్తకంపై చూసి ఇష్టపడినట్లు.. ఆ అమ్మాయినే భాగస్వామిని చేసుకోవాలని అనుకున్నాడు.. దీంతో ఆమె అతడి జీవితంలోకి రావడంతో ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.
ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అని.. మా ఇద్దరి మధ్య 10 ఏళ్ల గ్యాప్ ఉన్నా.. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నామని.. తనని అర్థం చేసుకుంటుందని అతడు చెప్పాడు. ప్రస్తుతం రోహిత్ కు ఒక పాప ఉన్నట్లు తెలిపాడు. తనకు మళ్లీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని కూడా తెలిపాడు. మరో సారి సినిమాలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…