రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలోనే వారిద్దరు విలక్షణ నటులు. ఎవరైనా సినిమాలలో నటిస్తారు.. కానీ వారిద్దరు జీవించేస్తారు. అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. వారిద్దరు మధ్య ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. రావు గోపాలరావును చూసి కోట శ్రీనివాసరావు రూం క్లీనర్ అనుకున్నాడంట. అది ఎలా జరిగిందంటే.. అల్లరి అల్లుడు సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.
రావు గోపాలరావు ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వాళ్లు హైదరాబాద్ లో ప్రశాంత్ కుటీర్ అనే హోటల్ లో దిగారు. అప్పట్లో సినిమా వాళ్లంతా ఇదే హోటల్ కు వచ్చేవారు. ఈ హోటల్లోకి రాగానే కోటా కూడా ఇదే హోటల్లో ఉన్నాడని ఎవరో రావు గోపాలరావుకు చెప్పారట. ఆయనను కలిసేందుకు అతడు వెళ్లి తన రూం కాలింగ్ బెల్ కొట్టాడు. కోట శ్రీనివాసరావు విసుగ్గా ఎవరు అంటూ డోర్ తీశాడు. ఎదురుగా రావు గోపాల రావు కనిపించాడు.
అయ్యో గురువు గారు.. మీరా.. నేను రూం క్లీనర్ అనుకున్నాను అంటూ అన్నాడంట. వెంటనే వెళ్లి బట్టలు వేసుకొని వచ్చి రావు గోపాలరావును రూంలోకి ఆహ్వానించి మర్యాదపూర్వకంగా కుర్చీవేసి కూర్చోబెట్టాడు. నిన్ను చూడాలని వచ్చాను. నీకు ఓకే అయితే రెండు మాటలు మాట్లాడి వెళ్తాను అని చెప్పాడు రావు గోపాలరావు. అయ్యే మీరు పిలిస్తే నేనే వచ్చావాడినంటూ కోట శ్రీనివాసరావు చెప్పాడంట. అతడు కింద కూర్చొని మాట్లాడుతుండగా.. కోటాను పైకిలేపి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇద్దరి మధ్య సంభాషణ చోటుచేసుకుంది.
నీ నటన, డైలాగులు చెప్పే విధానం చాలా బాగుంటుందని మెచ్చుకున్నాడు. మా కుటుంబ సభ్యులంతా నీ అభిమానులు అని చెప్పాడు. గోపాల రావు మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో నీవు మంచి స్థాయికి చేరుకుంటావు కోటయ్యా. నువ్వు చాలా గొప్ప నటుడివయ్యా. ఆయన వెళ్తుంటే అభిమానంతో అలాగే చూస్తూ ఉండిపోయాడు కోటా. వెంటనే కోటా లేచి తన కాళ్లకు నమస్కరించాడు. తన ఆశీర్వాదం తీసుకున్నాడు. చాలా కాలం సినిమా పరిశ్రమలో ఉండాల్సిన వాడివి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…