Arjun Kapoor - Malaika Arora: చైతూ… సామ్ బాటలోనే విడిపోవడానికి సిద్ధమైన మరొక బాలీవుడ్ స్టార్ జంట?
Arjun Kapoor – Malaika Arora: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారు ఎప్పుడు ప్రేమలో పడతారో ఎప్పుడు మనస్పర్ధలు వస్తాయో ఎవరికీ తెలియదు.ఈ క్రమంలోని ఎంతోమంది ప్రేమలో పడి సహజీవనం చేస్తూ వారి రిలేషన్ ని కంటిన్యూ చేయగా మరికొందరు వారి మధ్య మనస్పర్థల కారణంగా వారి రిలేషన్ కి బ్రేక్ అప్ చెబుతుంటారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఉన్నటువంటి సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ జంట విడాకుల ప్రకటన చేయగానే ఎంతో మంది అభిమానులు షాక్ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా వీరి బాటలోనే మరో బాలీవుడ్ జంట పయనిస్తోందని చెప్పాలి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలకు కొనసాగిన అర్జున్ కపూర్ , మలైకా అరోరా తమ బంధానికి బ్రేక్ అప్ చెప్పినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోని గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారనీ బాలీవుడ్ టాక్. గతంలో మలైకా అరోరా సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న మలైకా అతనితో విడాకులు తీసుకొని గత నాలుగు సంవత్సరాల నుంచి అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు.
ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లిన జంటగా కలిసి వెళ్లే ఈ ఇద్దరు ప్రస్తుతం ఒకరినొకరు కలుసుకోవడంలేదని వీరిద్దరు విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అర్జున్ కపూర్ తన సోదరి ఇంటికి డిన్నర్ కి వెళ్ళిన అక్కడ మలైకా కనిపించకపోవడంతో అందరికీ అనుమానాలు పెరిగాయి.
ఇలా వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ జంట మాత్రం ఈ విషయంపై స్పందించకపోవడంతో మరింత అనుమానాలు కలుగుతున్నాయి.అయితే గత కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి గురించి వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పడినట్లు అయింది. అయితే ఈ ట్రిక్ అనంతరం వీరిద్దరూ విడిగా ఉంటున్నారనే వార్తలు బీ టౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి.నాలుగు సంవత్సరాల నుంచి సహజీవనంలో ఉన్న ఈ జంట కొన్ని కారణాల వల్ల విడిపోతున్నారని త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…