Tag Archives: naa saamiranga movie

Nagarjuna: ఆ సమయంలో నా మాటలు ఎవరు నమ్మలేదు.. పిచ్చెక్కినట్లు చూశారు.. నాగార్జున కామెంట్స్ వైరల్?

Nagarjuna: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తాజాగా నటించిన చిత్రం నా సామిరంగ. మలయాళంలో సూపర్ హిట్ అయిన పొరింజు మరియమ్ జోస్ అనే చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలె జనవరి 14న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల అయ్యింది. సంక్రాంతి పండగకి తగ్గట్లుగానే ఆ వైబ్ కనిపించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించి ప్రణాళికతో రిలీజ్ చేశారు. కీరవాణి సంగీతం, నాగార్జున మాస్ గెటప్, అల్లరి నరేశ్, హీరోయిన్ ఆషిక రంగనాథ్ నా సామిరంగ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలవడానికి కారణాలు అని చెప్పవచ్చు.

అయితే భారీ విజయాన్ని అందుకోకపోయినప్పటికీ ఈ సినిమా పరవాలేదు అనిపించింది. ప్రస్తుతం ఈ చిత్రం బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. 38 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఈ సందర్భంగా తాజాగా నా సామిరంగ చిత్ర యూనిట్ తాజాగా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ. అక్కినేని అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు చాలా లేట్ గా కంఫర్మ్ చేశాము. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాకు సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు. చిత్ర యూనిట్ ని ప్రతి క్షణం మిస్ అవుతున్నాను. సినిమా రిలీజ్ టార్గెట్ తక్కువ సమయం ఉన్నప్పటికీ ఎవరూ ఒత్తిడి ఫీల్ అవకుండా నవ్వు ముఖాలతోనే పని చేశారు అని తెలిపారు నాగార్జున.

ఆ మాటలకు ఆశ్చర్యపోయారు..

నాన్నగారి పుట్టినరోజు సెప్టెంబర్ 20న ఈ చిత్రాన్ని లాంచ్ చేసాము. ఒకవైపు నాన్నగారి స్టాచ్యూ ఆవిష్కరణ జరుగుతోంది. అప్పటి వరకు ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తున్నట్లు నా ఫ్యామిలీకి కూడా తెలియదు. ఎక్కడికి వెళుతున్నారు అని అమల అడిగింది. ఇలా మూవీ లాంచ్ ఉంది వెళ్ళాలి అని చెప్పాను. ఇలా స్టాచ్యూ లాంచ్ జరుగుతోంది కదా కాస్త ఆలస్యంగా వెళ్ళండి అని చెప్పింది. లేదు నేను వెళ్ళాలి.. ఎందుకంటే ఈ చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేయాలని అని చెప్పాను. అప్పడు అమల పిల్లలు చైతు, అఖిల్ నాకు పిచ్చిపట్టినట్లు చూశారు. ఎవ్వరూ నమ్మలేదు. మూడు నెలల టైం కూడా లేదు ఎలా రిలీజ్ చేస్తారు అని ఆశ్చర్యపోయారు. కానీ నా టీం మాత్రం నమ్మింది. అనుకున్న టైంకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాం అని నాగార్జున తెలిపారు. కీరవాణి గారు కూడా ఒక టైం టేబుల్ వేసుకుని ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చారు అని అని చెప్పుకొచ్చారు హీరో నాగార్జున. ఈ సందర్భంగా నాగార్జున చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.