Tag Archives: nagarjuna

Chiranjeevi: ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ అయిన మెగాస్టార్.. ఏడో తరగతిలోనే?

Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన చిరంజీవి కొంతకాలం రాజకీయాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలలో పాల్గొన్న చిరంజీవి తన సొంతంగా స్థాపించిన తన పార్టీని ఇతర రాజకీయ పార్టీలలో విలీనం చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 అని బ్లాక్ బస్టర్ సినిమాని ప్రేక్షకులకు అందించాడు.

ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇదిలా ఉండగా చిరంజీవి చిన్నప్పుడే ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ వెల్లడించారు.చిరంజీవి సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సినిమా నిర్మాణ పనులు కూడా చేపట్టారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా అనే సినిమాని తెలుగులో సమర్పిస్తున్నాడు.

ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అమీర్ ఖాన్, నాగచైతన్య, చిరంజీవితో కలిసి నాగార్జున ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఈ ఇంటర్వ్యూ ని ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేశాడు. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ..లాల్ సింగ్‌ చడ్డా లో అమీర్‌ ఖాన్ ఒక చిన్న పిల్లాడిలా, కాలేజ్‌ స్టూడంట్‌లా, ఆర్మీ ఆఫీసర్‌లా కనిపిస్తారు. ఈ టాన్స్ఫర్మేషన్‌ ఎలా సాధ్యమైంది’ అని అడగ్గ…వీఎఫ్‌ఎక్స్‌ వాళ్ళే దానికి కారణం చెప్పాడు. వెంటనే చిరంజీవి కల్పించుకొని దీన్ని ఎడిటింగ్ లో తీసేయండి అనగానే వారు ఒక్కసారిగ నవ్వారు.

Chiranjeevi: ఏడో తరగతిలో ప్రేమలో పడ్డాను..

ఇక అమీర్ ఖాన్ చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడుతూ మీకు కూడా చిన్నప్పుడు ఏవైనా లవ్ స్టోరీలు ఉన్నాయా అని అడగ్గా… నేను పదేళ్ల వయసులో ఏడో తరగతి చదువుతున్న సమయంలో ఒక అమ్మాయి నాకు సైకిల్ నేర్పించేది. అయితే నేను సైకిల్ తొక్కకుండా ఆ అమ్మాయిని చూస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో నా దృష్టి అంతా సైకిల్ తొక్కడం మీద కాకుండా ఆ అమ్మాయి మీద ఉండేది. అప్పుడు ఆమె ముందుకు చూడు అంటూ నా మొహాన్ని తిప్పేది. సాధారణంగా ఆ రోజుల్లో మొగల్తూరులో ఒక అమ్మాయి సైకిల్ తొక్కడం చాలా పెద్ద విశేషం. అయితే ఒక అమ్మాయి వద్ద నేను సైకిల్ నేర్పించుకోవడం కూడా అక్కడ అందరికి పెద్ద విద్య. ఇలా తన చిన్ననాటి ప్రేమ గురించి చిరంజీవి అందరి ముందు ఓపెన్ అయ్యాడు

Akkineni Compound: అర్ధరాత్రి అక్కినేని కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్… ఆ సమయంలో ఏం పని.. వైరల్ అవుతున్న న్యూస్?

Akkineni Compound: ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం అంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు ఉండేవి. అయితే అక్కినేని నాగేశ్వరరావు మరణం తర్వాత అక్కినేని అనే బ్రాండ్ కు పూర్తిగా వ్యాల్యూ తగ్గిందని చెప్పాలి. అందుకు గల కారణం అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోల సినిమాలు ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడం ఒక కారణం అయితే అక్కినేని హీరోలు వారి వ్యక్తిగత జీవితంలోను అలాగే వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవడంలో కూడా ఫెయిల్ అయ్యారని.

 

ఇప్పటికే అక్కినేని వారసుడిగా నాగార్జున మొదటి భార్యకు విడాకులు ఇచ్చే రెండవ వివాహం చేసుకున్నారు. ఇక ఆయన బాటలోనే ఆయన తనయలు నాగచైతన్య సైతం సమంతకు విడాకులు ఇవ్వడంతో వీరి విడాకుల విషయం ఏకంగా నేషనల్ ఛానల్ లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇలా అక్కినేని కుటుంబం పలు కారణాలవల్ల తరచు వార్తలు నిలుస్తూ ఉన్నారు.

ఈ విధంగా ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే ఈ కుటుంబం తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత ఒంటరిగా ఒక ఇంట్లో నివసిస్తున్నారనే విషయం మనకు తెలిసిందే.ఇక విడాకుల అనంతరం నాగచైతన్య రెండవ పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ఈయన పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన ఆ నటి కేవలం తన మధ్య స్నేహం మాత్రమే ఉందంటూ సమాధానం చెప్పారు.

పడిపోయిన అక్కినేని బ్రాండ్ వాల్యూ…

ఇకపోతే తాజాగా అర్ధరాత్రి నాగచైతన్య కాంపౌండ్ లోకి ఒక హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందని వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఇలా ఒంటరిగా ఉన్న ఓ హీరో ఇంటికి అర్ధరాత్రి సమయంలో హీరోయిన్ ఎందుకు వెళ్ళింది అనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే సమంత అభిమానులు రెచ్చిపోతూ మా హీరోయిన్ ను నిందించడం ఆపేసి అర్ధరాత్రి సమయంలో మీ హీరో దగ్గరకు ఆ హీరోయిన్ రావడానికి గల కారణం ఏంటో చెప్పండి అంటూ సమంత ఫ్యాన్స్ చైతన్య అభిమానులను రెచ్చగొడుతున్నారు.మొత్తానికి ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Naga Chaitanya Mother: నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విషయాలు తెలుసా.. విడాకులకు కారణం అదేనా?

Naga Chaitanya Mother: నాగార్జున ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత దగ్గుబాటి వారసురాలు దగ్గుబాటి లక్ష్మీని వివాహం చేసుకున్నారు.దగ్గుబాటి రామానాయుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సమయంలోనే లక్ష్మి జన్మించారు. ఈమె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే ఇంటీరియర్ డిజైనర్ గా స్థిరపడ్డారు.ఇకపోతే రామానాయుడు ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగుపెట్టిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో మంచి పరిచయం ఏర్పడింది.

ఈ విధంగా ఈ రెండు కుటుంబాల మధ్య మంచి పరిచయం ఏర్పడటంతో వీరిద్దరూ వియ్యంకులుగా మారాలని భావించారు.ఇలా అనుకున్నదే తడవు దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మీతో నాగార్జున వివాహానికి అన్ని సిద్ధం చేశారు. అయితే అమెరికా జీవన శైలికి అలవాటు పడిన లక్ష్మి ఇండియా రావడానికి ఇష్టపడలేదు. అయితే ఆమెకు నచ్చజెప్పి ఇండియా రప్పించి వీరి వివాహాన్ని చెన్నైలో ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు.

ఇకపోతే వివాహమైన తర్వాత లక్ష్మి ఇండియాలో ఇమడలేకపోయింది దీంతో తాను అమెరికా వెళ్లి స్థిరపడాలని నాగార్జునపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే నాగార్జున ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా రాణించాలనే ఉద్దేశంతో తాను అమెరికా వెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.వీరి మధ్య గొడవలు జరగడంతో ఇరు కుటుంబ సభ్యులు వీరికి నచ్చ చెప్పారు.

ఇండియాలో ఉండలేక గొడవలు పడి విడిపోయిన లక్ష్మి..

ఇక ఈ దంపతులకు నాగచైతన్య జన్మించకా లక్ష్మి ఇండియాలో ఉండలేక నాగార్జునతో గొడవలు పడి విడాకులు తీసుకుని విడిపోయారు.విడాకులు ఇచ్చిన తర్వాత నాగార్జునకు అమల పరిచయం కాగా ఆమెతో ప్రేమలో పడి తనని వివాహం చేసుకున్నారు. అదేవిధంగా లక్ష్మీ సైతం తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని తిరిగి అమెరికాలో స్థిరపడ్డారు.ఇక నాగచైతన్య కొద్దిరోజుల పాటు తన తల్లి లక్ష్మీ వద్ద పెరిగినా అనంతరం తండ్రి నాగార్జున దగ్గర కూడా పెరిగారు.

Nagarjuna -Amala: నాగార్జున అమల లవ్ స్టోరీలో ముందుగా ప్రపోజ్ చేసింది తనేనా.. అసలు విషయం చెప్పినా అమలా బ్రదర్?

Nagarjuna -Amala: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున సినీ కెరీయర్ ఎంతో అద్భుతంగా కొనసాగుతోంది. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ముందుగా దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకుని అనంతరం తనకు విడాకులు ఇచ్చారు.

Nagarjuna -Amala: నాగార్జున అమల లవ్ స్టోరీలో ముందుగా ప్రపోజ్ చేసింది తనేనా.. అసలు విషయం చెప్పినా అమలా బ్రదర్?

ఈ క్రమంలోనే నాగార్జున నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ముందుగా ఎవరు ఎవరికి ప్రపోస్ చేశారనే విషయం గురించి ఇప్పటి వరకు క్లారిటీ లేదు.ఈ విషయంలో క్లారిటీ తెలుసుకోవాలనుకున్న నాగార్జునను ఈ ప్రశ్న అడిగే ధైర్యం ఎవరికీ లేదనే చెప్పాలి.

Nagarjuna -Amala: నాగార్జున అమల లవ్ స్టోరీలో ముందుగా ప్రపోజ్ చేసింది తనేనా.. అసలు విషయం చెప్పినా అమలా బ్రదర్?

ఇన్ని రోజులు ఈ విషయం గురించి ఎవరికీ తెలియక పోయినప్పటికీ తాజాగా అమల బ్రదర్ సురేష్ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వీరి ప్రేమ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ తాను అమలకు సొంత తమ్ముడు కాకపోయినా తనని తోబుట్టువుగానే చూసుకున్నారని తెలిపారు. ఇలా మేమిద్దరం ఎంతో స్నేహంగా దగ్గరగా ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించుకోలేదని తెలిపారు.

అమలకు ప్రపోజ్ చేసిన నాగ్…

అందరిలాగే నాగార్జున అమల మద్య ఏదో ఉందని వచ్చిన వార్తల వరకే తనకు కూడా తెలుసని, అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ముందుగా నాగార్జున తన ప్రేమ గురించి అమల దగ్గర బయట పెట్టారని సురేష్ చక్రవర్తి వెల్లడించారు. ఈ విషయాలను సురేష్ చక్రవర్తి బయట పెడుతూనే సారీ నాగ్ తప్పు ఉంటే క్షమించు అంటూ తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తుంటే ముందుగా నాగార్జున అమలకు ప్రపోజ్ చేశారని తెలుస్తోంది.

Annamayya : అన్నమయ్య సినిమాలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రను వద్దనుకున్న హీరోలు ఎవరో తెలుసా..?

Annamayya : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన కమర్షియల్ సినిమాలలోనే కాకుండా భక్తి చిత్రాల్లోనూ నటించి అందరిని ఆకట్టుకున్నారు. నాగార్జున శ్రీరామదాసు, నమో వెంకటేశాయ, షిరిడి సాయి వంటి భక్తి కథా చిత్రాలలో నటించాడు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో ఒకరైన రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున ఎన్నో సినిమాలలో నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భక్తి కథా చిత్రం అన్నమయ్య.

Nagarjuna: అన్నమయ్య సినిమాలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రను వద్దనుకున్న హీరోలు ఎవరో తెలుసా..?

ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. లవ్ అండ్ యాక్షన్ హీరోగా గుర్తింపు పొందిన నాగార్జున ఇలా భక్తి చిత్రాల్లో నటిస్తున్నాడని తెలియగానే చాలామంది ఆశ్చర్యపోయారు.కానీ ఎల్లప్పుడూ వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఆశపడే నాగార్జున మాత్రం విమర్శలను పట్టించుకోకుండా ఈ సినిమాలో అన్నమయ్య పాత్రలో నటించాడు.

Nagarjuna: అన్నమయ్య సినిమాలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రను వద్దనుకున్న హీరోలు ఎవరో తెలుసా..?

ఈ సినిమాలో శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుడు పాత్రలో నాగార్జున నటనకి ప్రశంశలు దక్కాయి. అప్పట్లో ఈ సినిమా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకొని రికార్డ్ సృష్టించింది. అయితే ఈ సినిమాలో మొదట వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ కాకుండా ఇద్దరు హీరోలను సంప్రదించారు. అన్నమయ్య పాత్ర కోసం మొదట శోభన్ బాబు గారిని సంప్రదించారు. కానీ ఆయన పాత్ర కోసం ఎక్కువ రెమ్యూనరేషన్ అడగటం వల్ల అయన్ని వద్దనుకున్నారు.

ఇద్దరూ టాప్ హీరోలే…

శోభన్ బాబు తర్వత అన్నమయ్య వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించటానికి బాలకృష్ణ బాగా సరిపోతాడని అనుకున్నారు. కానీ ఆ సమయంలో బాలకృష్ణ , నాగర్జున ఇద్దరు కూడా టాప్ హీరోలు . వీరిద్దరినీ ఒకే సినిమాలో ఉంచితే వారి అభిమానుల మధ్య గొడవలు జరుగుతాయని వద్దనుకున్నారు. తర్వత బాగా ఆలోచించి ఆ పాత్ర కోసం సుమన్ ని సంప్రదించారు. సుమన్ ని పిలిపించి వెంకటేశ్వర స్వామి గెటప్ వేసి ఫోటో షూట్ చేయించారు. ఆ గెటప్ సుమన్ కి బాగా సెట్ అవ్వటంతో ఇక వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ నటించాడు.

Nagarjuna: సమంత తండ్రిని కలిసిన నాగార్జున… కారణం అదేనా?

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య నటి సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత పెళ్లి అప్పట్లో తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని సమంతనే బలవంతంగా వీరి వివాహానికి తన తల్లిదండ్రులను ఒప్పించింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Nagarjuna: సమంత తండ్రిని కలిసిన నాగార్జున… కారణం అదేనా?

ఇలా పెద్దలకు ఇష్టం లేకపోయినా, వారిని ఒప్పించి వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.వీరి వివాహం అనంతరం కొన్ని సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన సమంత నాగచైతన్య పలు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే వీరి విడాకులకు గల కారణం ఏంటి అనే విషయం మాత్రం తెలియలేదు.

Nagarjuna: సమంత తండ్రిని కలిసిన నాగార్జున… కారణం అదేనా?

నాగార్జున, సమంత తండ్రి ఈ విషయంపై స్పందిస్తూ ఈ విషయంలో పూర్తిగా వారి నిర్ణయాన్ని వదిలేస్తున్నామని వెల్లడించారు.సమంత తీసుకున్న నిర్ణయం వెనుక కారణం ఉంటుందని తన తండ్రి తనకు సపోర్ట్ చేయగా నాగార్జున సైతం విడాకులు తీసుకున్నప్పటికీ సమంత మా ఇంటి బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు.అయితే తాజాగా నాగార్జున ఉన్నఫలంగా సమంత తండ్రిని కలిసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఆందోళనలో అభిమానులు

నాగార్జున సమంత తండ్రితో కలిసి సుమారు గంటకు పైగా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే నాగార్జున ఈ విధంగా సమంత తండ్రిని కలవడానికి కారణం ఏంటి అంటూ పెద్దఎత్తున ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు.అయితే గత కొద్దిరోజుల నుంచి నాగచైతన్య రెండవ వివాహం చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై నాగార్జున సమంత తండ్రిని కలిసి వారి భవిష్యత్ గురించి ప్రస్తావించి ఉంటాడని ఇండస్ట్రీ సమాచారం. మరి నాగార్జున ఎందుకు సమంత తండ్రిని కలిసారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలిసిన అక్కినేని అభిమానులు ఎంతో కంగారుగా నాగార్జున తన తండ్రిని కలగడానికి కారణం ఏంటి అంటూ పెద్దఎత్తున చర్చలు మొదలు పెట్టారు.

Nagarjuna: “నాగార్జునతో సినిమా వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపొయింది..” డైరెక్టర్ వీరభద్రం షాకింగ్ కామెంట్స్ !

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన స్టార్ హీరో నాగార్జున గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలిసారిగా విక్రమ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాగార్జున ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. పైగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

Nagarjuna: నాగార్జున వల్ల ఈ డైరెక్టర్ కెరీర్ నాశనం అయ్యిందా..!

ఇక ఈయన ఏ డైరెక్టర్ సినిమాకైనా తేడా చూపించకుండా వారికి అవకాశాలు ఇస్తాడు. ఆ సినిమాలు ప్లాప్ అయినా మళ్లీ కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇక ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు నాగార్జున. ప్రస్తుతం బిగ్ బాస్ లో హోస్టింగ్ తో ఓ రేంజ్లో దూసుకుపోతున్నాడు.

ఇదిలా ఉంటే ఈయన వల్ల కో డైరెక్టర్ కెరీర్ నాశనం అయింది అని.. దాంతో ఆ దర్శకుడికి నాగార్జున వల్ల విభేదాలు వచ్చాయని గతంలో బాగా వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా దీని గురించి ఆ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు బయట పెట్టాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. వీరభద్రం చౌదరి.

ఈయన దర్శకుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నాగార్జున నటించిన బాయ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ నాగార్జున కెరీర్లో ఇది చాలా ఘోరమైన సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాతో ఊహించని రిజల్ట్ సొంతం చేసుకున్నాడు నాగార్జున. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో నాగార్జున చాలా నిరాశ చెందాడు.

Nagarjuna: నాగార్జున వల్ల ఈ డైరెక్టర్ కెరీర్ నాశనం అయ్యిందా..!

నాగార్జునతో తనకు విభేదాలు లేవన్న డైరెక్టర్..

బాయ్ కథ హిలేరియస్ కథ అని.. కానీ చేసిన మార్పుల వల్ల సినిమా సీరియస్ కథ గా మారింది అని అన్నాడు. ఈ సినిమాలో కామెడీ లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది అని అన్నాడు. సినిమా ఫ్లాప్ అయిన హిట్ అయిన డైరెక్టర్ అదే బాధ్యత అని కూడా అన్నాడు. ఇక భాయ్ సినిమా వల్ల తనకు నాగార్జునకు విభేదాలు లేవని అన్నాడు. కానీ నాగార్జున వల్లే ఆయనకు పరోక్షంగా కెరీర్ దెబ్బతిన్నదని అర్థమవుతుంది.

Annamayya : అన్నమయ్యకు మీసం.. పైగా ఆయన తన భార్యలతో సరస గీతాలు.. హవ్వా.!! ఇదెక్కడి చోద్యం.. అనే విమర్శలు చెరిపేస్తూ..!!

సాంఘిక చిత్రాలు ఎన్నో వచ్చిన పౌరాణిక చిత్రానికి ఉండే ప్రాధాన్యత వేరే విధంగా ఉంటుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ సినిమాతో దాదాపుగా అన్ని చిత్రాలని రూపొందించారని చెప్పవచ్చు. సింహబలుడు లాంటి జానపద చిత్రం, అన్నమయ్య తో పౌరాణిక చిత్రాన్ని రూపొందించిన ఘనత ఆయనకు దక్కింది.

అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నాగార్జునకు అంత పేరు రావడానికి ఈ సినిమానే ప్రధాన కారణమని చెప్పవచ్చు.యాక్షన్, ప్రేమ కథలకి ఆయన పరిమితమని విమర్శలను చెరిపేస్తూ నాగర్జున ఈ సినిమాలో నటించడం ఓ సాహసోపేతమైన చర్యగా భావించవచ్చు. యాక్షన్ చిత్రాల చట్రంలో ఇరుక్కు పోయిన సుమన్ చాలా సంవత్సరాల తర్వాత అన్నమయ్య చిత్రంలో శ్రీ వెంకటేశ్వరస్వామి పాత్ర ధరించి సుమన్ తన మూసచట్రంలో నుంచి బయటకు వచ్చారు. శ్రీవెంకటేశ్వరుని పాత్ర ఆయన కెరీర్ లో ఓ మైలురాయిగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు. మానవ కోటి కష్టాల కన్నీళ్లను తీర్చడానికి కలియుగంలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు రూపంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సతీమణి అలివేలు మంగను కీర్తిస్తూ అన్నమయ్య “శ్రీ వెంకటేశ్వర శతకం” రచించాడు. ఆయన రచించిన కీర్తనలు చాలావరకు అదృశ్యం కాగా 15 వేల కీర్తనలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

అయితే ఆయన కీర్తనలు ఎక్కువగా శృంగార కీర్తనలుగా ఉండడం విశేషం. అన్నమయ్యపై చిత్రాన్ని తీయాలని జంధ్యాలతో పాటు అనేకమంది దర్శకులు ప్రయత్నించి విఫలమయ్యారు. చిత్ర కవి ఆత్రేయ 18 పాటలను కూడా నమోదు చేయించి, స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నాడు. కానీ, ఆయన మరణంతో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. జె.కె.భారవి, రాఘవేంద్రరావుల కృషి ఫలితంగా ఈ చిత్రం సాకారం అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి పౌరాణికచిత్రం అన్నమయ్యే. 1997 దొరైస్వామిరాజు నిర్మాణం, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో “అన్నమయ్య” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి హీరో, హీరోయిన్లుగా నటించగా… సుమన్ శ్రీవెంకటేశుని పాత్రలో కనిపించడం విశేషం. భానుప్రియ, శ్రీ కన్య, మోహన్ బాబు, రోజా ఇతర ప్రధానపాత్రల్లో కనిపించారు.

అన్నమయ్య చిత్రాన్ని మొదటగా తిరుమలలో చిత్రించాలనుకున్నారు. కానీ అందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒప్పుకోకపోవడంతో అన్నపూర్ణ స్టూడియోలో శ్రీ వేంకటేశ్వరుని గుడి సెట్ వేయడం జరిగింది. పైగా తిరుపతి వేంకటేశుని ప్రాంగణంలో ఆధునిక విద్యుత్ దీపాలు ఉండడంతో ఆనాటి దేవాలయ దృశ్యాలను చిత్రీకరించడానికి అవి అడ్డుగా ఉన్నాయని భావించి సినిమా చిత్రీకరణ అక్కడ జరపకూడదని యూనిట్ సభ్యులు నిర్ణయించుకున్నారు. కేరళ రాష్ట్రంలో పశ్చిమ కనుమలను తిరుపతి ఏడుకొండలుగా చిత్రీకరించడం జరిగింది.

ఈ చిత్రంలో కీరవాణి అందించిన సంగీతం అనిర్వచనీయం. ఈ సినిమాలో మొత్తం నలభై ఒక్క పాటలు ఉన్నాయి. ఏలే ఏలే మరదలా… అనే పాట ఒకప్పుడు ఎం ఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన “సీతారామయ్యగారి మనవరాలు” చిత్రంలోని “పూసింది పూసింది పున్నాగా.. అనే పాటను నేను పోలి ఉంటుంది. 1997 మే 22 రోజున అన్నమయ్య చిత్రం విడుదలయ్యింది. అయితే అన్నమయ్యకు ఈ చిత్రంలో మీసాలు ఉండటం ఏమిటి.?. పైగా ఆయన తన ఇద్దరి భార్యలతో సరస గీతాలు పాడడం ఏమిటి..? అనే విమర్శలు తీవ్ర ఎత్తున రావడం జరిగింది. కానీ సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. 42 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది.రెండు కేంద్రాలలో 175 రోజులు ఏకధాటిగా కొనసాగింది. ఈ సినిమాను తమిళంలో అన్నమాచారియర్ గానూ, హిందీలో తిరుపతి శ్రీ బాలాజీగానూ అనువదించి విడుదల చేశారు.

Tollywood Heros Remuneration: చిరంజీవి నుంచి మొదలుకొని మన టాలీవుడ్ హీరోల లేటెస్ట్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా?

Tollywood Heroes Remuneration: ఒకప్పుడు మన టాలీవుడ్ సినిమాలు కేవలం దక్షిణాది సినిమా ఇండస్ట్రీ వరకు మాత్రమే పరిమితమయ్యాయి.అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ద్వారా తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. దీంతో ఉన్నఫలంగా తెలుగు సినిమా మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే ఒకప్పుడు 10 నుంచి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే మన తెలుగు హీరోలు ప్రస్తుతం 50 నుంచి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఏ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది తెలుసుకుందాం…

ప్రభాస్: బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్నప్రభాస్ ఒక్కో సినిమాకి 100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు ఇక ఈయన 25వ చిత్రం స్పిరిట్ సినిమాకి 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత ఒక్కో సినిమాకు 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు.

మహేష్ బాబు: ఈయన నటిస్తున్న సర్కారీ వారి పాట చిత్రానికి ఏకంగా 55 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్: రాజమౌళి సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ 45 కోట్ల పారితోషికం తీసుకోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోయే సినిమాకు ఏకంగా 60 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

రామ్ చరణ్: రామ్ చరణ్ రాజమౌళి సినిమాకి 45 కోట్లు శంకర్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమాకి 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

చిరంజీవి: రామ్ చరణ్ సొంత బ్యానర్ లోనే ఆచార్య సినిమా తీయటం వల్ల ఈయన రెమ్యునరేషన్ తెలియకపోయినప్పటికీ మార్కెట్ విలువ సుమారు 50 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం.

అల్లు అర్జున్: సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప రెండు భాగాలకుగాను అల్లు అర్జున్ 60 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు.

బాలకృష్ణ: అఖండ సినిమా కోసం బాలయ్య బాబు 11 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా తన తదుపరి చిత్రానికి 15 కోట్లకు పెంచినట్లు సమాచారం.

నాగార్జున: నాగార్జున ఒక్క సినిమాకు 7 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

వెంకటేష్: వెంకటేష్ కూడా ఒక్కో సినిమాకు 7 కోట్లు పారితోషికం తీసుకోనున్నారు.

విజయ్ దేవరకొండ: చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వీరితో పాటు నాని 8 కోట్లు, మాస్ మహారాజ రవితేజ 13 కోట్లు, వరుణ్ తేజ్ 8 కోట్లు, శర్వానంద్ 4 కోట్లు, నితిన్ 4 కోట్లు, నాగచైతన్య 6 కోట్లు, గోపీచంద్ 3 కోట్లు, రామ్ 8 కోట్లు సాయి ధరమ్ తేజ్ 6 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Nagarjuna-Naga Chaitanya: నాగ చైతన్య విషయంలో ఎక్కువగా బాధపడుతున్న నాగార్జున.. కారణం ఇదే..!

Nagarjuna-Naga Chaitanya: ప్రస్తుతం ఒక్క తెలుగులోనే కాదు.. మొత్తం సినిమా పరిశ్రమలోనే పాన్ ఇండియా లెవల్లో సినిమాలను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇప్పుడున్న యూత్ లో తెలుగు నుంచి ఆ రుచి చూపించిన వ్యక్తి ఎవరంటే.. దాదాపు ప్రభాస్ అనే చెప్పాలి. అతడి సినిమా బాహుబలి.. పాన్ ఇండియా లెవల్లోనే కాదు.. ప్రపంచలో కొన్ని దేశాల్లో కూడా ఆడింది.

Nagarjuna-Naga Chaitanya: నాగ చైతన్య విషయంలో ఎక్కువగా బాధపడుతున్న నాగార్జున.. కారణం ఇదే..!

అతడి దారిలోనే అల్లు అర్జున్, చరణ్, తారక్ వెళ్తున్నారు. అందులో బన్నీ పుష్ప సినిమాతో కాస్త ఆ విజయాన్ని అందుకున్నాడనే చెప్పాలి. తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్, తారక్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఇలా చేయడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి.

Nagarjuna-Naga Chaitanya: నాగ చైతన్య విషయంలో ఎక్కువగా బాధపడుతున్న నాగార్జున.. కారణం ఇదే..!

ఒక్క భాషలో నటించి.. డబ్బింగ్ చెబితే చాలు.. ఆ నటనకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా వివిధ భాషల్లో వాటిని విడుదల చేస్తున్నారు. ఇలా ఒక్క సినిమాతో చాలా భాషల్లో పాపులారిటీ సంపాదించుకోవచ్చు. దీంతో అక్కడ నుంచి మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫైనల్ గా రెమ్యూనరేషన్ విషయంలో కూడా.. భారీగా డిమాండ్ చేయవచ్చు. ఇలా ఒక్క సినిమాతోనే ఇలాంటి లాభాలు వస్తుంటే.. హీరోలు మాత్రం ఎందుకు వద్దు అంటారు.. అందుకే తీసే సినిమాలను కూడా పాన్ ఇండియా లెవల్లో ఉండే విధంగా ప్రయత్నిస్తున్నారు.


నాగచైతన్య మాత్రం అటువైపు ఆలోచించడం..

అయితే అక్కినేని వారసుడు.. నాగచైతన్య మాత్రం అటువైపు ఆలోచించడం లేదు. ఎందుకంటే అతడు తీసిన సినిమాలే చాలా తక్కువగా ఉన్నాయి. అందులో హిట్ అయినవి కూడా చాలా తక్కువ. దీంతో అతడికి తెలుగులోనే ఎక్కువ పాపులారిటీ లేదు.. అలాంటిది మిగతా భాషల్లో ఆదరిస్తారా అనేది ప్రశ్నార్థకం.

చైతు ఇంకా యాక్టింగ్, డ్యాన్స్ పరంగా డెవలప్ అవ్వాలి.. నాగ చైతన్య కూడా నేర్చుకుంటున్నాడు. దీనిపై నాగార్జున కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నట్లు సమాచారం. కొడుకుల భవిష్యత్తు ఢీలా పడిపోతున్నాయని ఆందోళన చెందుతున్నాడట నాగార్జున. మిగతా హీరోలు పెళ్లిళ్లు చేసుకొని.. చక్కగా పాన్ఇండియా సినిమాలు చేస్తుంటే.. ఇక్కడ ఆ రెండు లేవు. అందుకే నాగార్జున తెగ ఫీల్ అవుతున్నాడట. రూ.100 కోట్ల క్లబ్ లోకి రయ్ మంటూ మిగతా హీరోలు దూసుకుపోతుంటే.. రూ.50కోట్ల క్లబ్ లోనే ఉన్నాడు చైతు. చూద్దాం ఫీచర్లో ఏం జరుగుతుందో.