Tag Archives: nani

Actress Madhavi Latha: తన మాట విననందుకు మాధవీలతకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. అందుకే అవకాశాలు రావట్లేదా?

Actress Madhavi Latha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా అవకాశాలు ఇవ్వాలని ఎంతోమంది తెలుగు నటీమణులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వక పోవడానికి కూడా దర్శక నిర్మాతలు కారణాలు చెబుతున్నారు. తెలుగు హీరోయిన్లు గ్లామర్ షో చేయడానికి వెనకాడటం వల్లే వాళ్లకు అవకాశాలు లేవు అనే మాటలు వినపడుతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే బల్లారి నుంచి తెలుగు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి నచ్చావులే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు నటి మాధవి లత. ఈమె డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె నాని సరసన స్నేహితుడా సినిమాలో నటించారు.

ఇక ఈమె నటించిన నచ్చావులే సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ తనని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, తను చెప్పిన విధంగా నడుచుకోకపోవడంతో చెట్టు కింద కూర్చోబెట్టి మరి బండ బూతులు తిట్టారంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు నుంచి వచ్చిన హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే దర్శక నిర్మాతలు చెప్పే విషయాలను వినాలి. వారు అడగకపోయినా మనమే అర్థం చేసుకొని కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయంటూ ఈమె అసలు విషయం బయటపెట్టారు.

Actress Madhavi Latha: రాజకీయాలలో బిజీగా ఉన్న మాధవి లత…

ఇక తెలుగు ఇండస్ట్రీలో కొనసాగాలంటే తెలుగమ్మాయిలు గ్లామర్ షో చేయాలని వాళ్ళు గ్లామర్ షో చేయకపోవడం వల్లే ముంబై నుంచి హీరోయిన్లను తీసుకువస్తున్నారంటూ వాదన వినపడుతోంది. అయితే తాను స్నేహితుడా సినిమాలో చేసింది ఏంటి గ్లామర్ షో కాదా అంటూ ఈమె ప్రశ్నించారు. పాత్ర డిమాండ్ చేస్తే తప్పకుండా ఆ పాత్రకు అనుగుణంగా నటిస్తారని ఈమె తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో మాధవి లత పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

Shraddha Srinath: లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న నా పేరు తెలియదా.. మీడియాపై మండిపడిన జెర్సీ హీరోయిన్?

Shraddha Srinath: శ్రద్దా శ్రీనాథ్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యారు.ఇలా పలు సినిమాలలో నటిగా నటించిన ఈమెకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇకపోతే తాజాగా ఒక మీడియా సంస్థపై నటి శ్రద్ధా శ్రీనాథ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు మీడియా సంస్థ శ్రద్ధ శ్రీనాథ్ ఫోటోని ప్రచురించి కింద పేరు మాత్రం శ్రద్ధాదాస్ అని రాయడంతో ఒక్కసారిగా ఈమె మండిపడ్డారు. ఈ విషయంపై స్పందించిన శ్రద్దా శ్రీనాథ్ లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న మీకు కనీసం నా పేరు కూడా తెలియదా? అలాగే తన పేరును ఎంతో స్పష్టంగా పలుకుతున్న అభిమానులకు ఈమె కృతజ్ఞతలు తెలిపారు. మీ కీ బోర్డులో కపూర్, దాస్ వంటి పదాలు వస్తున్నప్పటికీ మీరు ఎంతో ఓపికగా శ్రద్దా శ్రీనాథ్ అని టైప్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో తన పేరును శ్రద్దా రామ శ్రీనాథ్ అని మార్చుకున్నానని బహుశా ట్విట్టర్లో కూడా అలాగే మార్చుకోవాల్సి వస్తుందేమోనని ఈమె తెలిపారు. ఇకపోతే రామ అనే పదం తన తల్లి పేరు అంటూ ఈ సందర్భంగా ఈమె క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఈ విషయంపై మీరు చింతించకండి మీరు కేవలం శ్రద్ధ శ్రీనాథ్ అని మాత్రమే పిలిస్తే చాలు.

Shraddha Srinath: ట్విట్టర్ కు బ్రేక్ ఇచ్చిన శ్రద్దా శ్రీనాథ్…

కొంతమంది పెద్ద పెద్ద మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులు సైతం తన పేరును సరిగ్గా రాయలేకపోతున్నారని బహుశా వాళ్ళు జర్నలిజం క్లాసులు సరిగ్గా వినలేదేమో, అయితే ఇకపై తన పేరును సరిగ్గా రాయమని ఈమె వెల్లడించారు. ఇదిలా ఉండగా కొన్ని కారణాల వల్ల తాను ఒక నాలుగు నెలల పాటు ట్విట్టర్ కు బ్రేక్ ఇస్తున్నానని, నాలుగు నెలల తర్వాత తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఈ సందర్భంగా ఈమె వరుస ట్వీట్స్ చేశారు.

Krithi Shetty: నానితో బెడ్ రొమాన్స్‌పై బేబ‌మ్మ కండీష‌న్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! ..!

Nani-Krithi Shetty: ఉప్పెన బ్యూటీ బేబమ్మగా పరిచయం అయిన కృతి శెట్టి వరస విజయాలతో దూసుకుపోతోంది. ఉప్పెనతో పాటు తను తాజాగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అందానికి, అభినయం తోడైతే కృతి శెట్టి అన్నరీతిలో ఆమె కెరీర్ కొనసాగుతోంది.

తొలి సినిమా విజయంతోనే దాదాపుగా ఆరడజను ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టింది. ఈ అమ్మడు. తన అందానికి కుర్రకారు కూడా ఫిదా అవ్వడంతో డైరెక్టర్ల లేటెస్ట్ ఛాయిస్ కృతి శెట్టి అవుతోంది.  నిండా పాతికేళ్లు నిండకుండానే వరస హిట్లతో అమ్మడు ఫుల్ స్పీడ్ లో ఉంది. దీంతో పాటు తన చేస్తున్న బోల్డ్ క్యారెక్టర్లు కూడా కృతికి పేరు తీసుకువస్తున్నాయి.

Nani-Krithi Shetty: ఉప్పెన బ్యూటీ బేబమ్మతో నాని బెడ్ రూం సన్నివేశం..కృతి షాకింగ్ కండీషన్స్..!

ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ తో ‘‘జలజల జలపాతం నువ్వు’’ సాంగ్ లో రొమాన్స్ చేసి యువత గుండెలను కొళ్లగొట్టింది. తరువాతి సినిమా శ్యాంసింగరాయ్ లో కూడా ఇదే విధంగా నానితో రొమాన్స్ చేసింది బేబమ్మ. లిప్ లాక్, బెడ్ సీన్లతో రచ్చ చేసింది. అయితే కథలో కీలకం కావడంతోనే కృతి శెట్టి ఈ సీన్లకు ఒప్పుకుంటుంది. 

రాహుల్ కి చాలానే కండీషన్లు పెట్టిందట..

ఇదిలా ఉంటే కృతిశెట్టి శ్యాంసింగరాయ్ లో ఈ సీన్లు చేయడానికి డైరెక్టర్ రాహుల్ కి చాలానే కండీషన్లు పెట్టిందట. ఇవన్నీ కండీషన్లు ఓకే అయితేనే తాను ఈసీన్లు చేస్తా అని తెగేసి చెప్పిందట. అయితే డైరెక్టర్ ఈ కండీషన్లకు ఒప్పుకోవడంతోనే నానితో లిప్ లాక్, బెడ్ సీన్లు చేసింది. అయితే ఆకండీషన్లు ఏమిటంటే.. సీన్లు చేసేటప్పుడు హీరో నాని, కెమెరామెన్, డైరెక్టర్ మాత్రమే ఉండాలని.. ఒక వేళ సీన్ మామూలుగా వచ్చినా ఓకే చెప్పాలని.. ఎక్కువ టేకులు తీసుకోవద్దని కండీషన్లు పెట్టిందట. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఈ సీన్లు కీలకం కావడంతోనే కృతి శెట్టి సీన్లకు ఒప్పుకుందట. ఇదిలా ఉంటే ఈ భామ చేతిలో ప్రస్తుతం అరడజను ప్రాజెక్ట్ ఉన్నాయి. నాగచైైతన్యతో చేసిన బంగర్రాజ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా చేస్తోంది. ఇక రామ్ పోతినేని లింగుస్వామి ద్విభాషా చిత్రం, అలాగే నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

Radhe Shyam: త్వరలో ఓటీటీలో రాధేశ్యామ్.. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా.. అసలు నిజం ఏంటి?

Radhe Shyam: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి మరోసారి కరోనా దెబ్బతాకింది. రాష్ట్రాలన్నీ కరోనా ఆంక్షల్లోకి వెళ్లాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాకు పెద్ద ఎదురుదెబ్బలు తాకాయి. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ జనవరి 7న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Radhe Shyam: త్వరలో ఓటీటీలో రాధేశ్యామ్.. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా.. అసలు నిజం ఏంటి?

ఓమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేయాలని అక్కడి ప్రభుత్వాలు ఆదేశించాయి.  భారీ బడ్జెట్ చిత్రాలకు ఇప్పుడు కరోనా కారణంతో సెగ తగిలింది. ఇప్పటికే ఆర్ ఆర్ఆర్ఆర్ వాయిదా పడగా… ’రాధేశ్యామ్‘ సినిమాపై ప్రేక్షకులకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాధేశ్యామ్ సినిమా జనవరి 14న విడుదల అవుతుందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

Radhe Shyam: త్వరలో ఓటీటీలో రాధేశ్యామ్.. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా.. అసలు నిజం ఏంటి?

అయితే ఆర్ఆర్ఆర్ లాగే ఇది కూడా వాయిదా పడుతుందనే రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే కొంత మంది మాత్రం రాధే శ్యాం ఓటీటీల్లో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు. అయితే ఈ వాదనను కొట్ట పారేయలేమని అంటున్నారు. అయితే ఫ్యాన్సీ ఆఫర్ వస్తే ఓటీటీలో కూడా రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లు మరో సమస్య..

ప్రస్తుతం కరోనా వేవ్ ఎన్ని రోజులు ఉంటుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. దీంతో ఓటీటీలో విడుదల చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా థియేటర్ల మూతపడటంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ల రేట్లు మరోసమస్యగా భారీ బడ్జెట్ ప్రతిరోధకంగా ఉంది. టికెట్ ధరలపై కమిటీ వేసినా… ధరలు పెరుగుతాయనే నమ్మకం లేదు. ఇప్పటికే పుష్ప, శ్యాంసింగరాయ్ సినిమాలకు ఏపీలో కలెక్షన్లు తక్కువగానే వచ్చాయి. దీంతో పాటు కరోనా ముప్పుతో థియేటర్లు మూతపడటం లేకపోతే 50 శాతం ఆక్యుపెన్సీతో నడిచేలా ఉన్న పరిస్థితుల్లో రాధేశ్యామ్ యూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Shyam Sigha Roy: శ్యామ్ సింగరాయ్ సినిమా రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన నాని..ఎందుకో తెలుసా..?

Shyam Sigha Roy: నానికి చాలా రోజుల తర్వాత హిట్ పడింది. ‘శ్యామ్‌ సింగరాయ్‌’  సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’ మూవీ డిసెంబర్ 24న విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. న్యాచురల్ స్టార్ నాని రెండు క్యారెక్టర్లతో ఇరగదీశాడు.

Shyam Sigha Roy: శ్యామ్ సింగరాయ్ సినిమా రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన నాని..ఎందుకో తెలుసా..?

దీనికి తోడు కృతి శెట్టి అందాలు, సాయిపల్లవి మెస్మరైజింగ్ ఫెర్ఫామెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిక్కి జే మేయర్ మ్యూజిక్ చాలా బాగా కుదిరి సినిమా హిట్ కు కారణమయ్యాయి. వరసగా.. వీ, టక్ జగదీశ్ సినిమాలు ఘోరంగా నిరాశ పరచడంతో నాని కాస్త వెనకబడ్డాడు. అయితే వీటిని ఓటీటీల్లో రిలీజ్ చేశారు.

Shyam Sigha Roy: శ్యామ్ సింగరాయ్ సినిమా రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన నాని..ఎందుకో తెలుసా..?

కాగా ఈసారి ఎలాగైనా శ్యాంసింగరాయ్ ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనే గట్టి పట్టుదలతో నాని తో పాటు నిర్మాత వెంకట్‌ బోయినపల్లి ఉన్నారు. దీనికి అనుగుణంగానే సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. నిర్మాత వెంకట్ బోయినపల్లి అయినా.. అన్ని నానినే ముందుండి నడిపించాడు. సినిమా ప్రమోషన్లతో బాగా కష్ట పడ్డాడు. 

తెలంగాణలో బాగానే ఉన్నా.. ఏపీలో మాత్రం..

నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. అయితే తెలంగాణలో కలెక్షన్లు బాగానే ఉన్నా… ఏపీలో ప్రభుత్వం థియేటర్ల టికెట్ రేట్లను తగ్గించడంతో అక్కడ కలెక్షన్లపై తీవ్రంగా ప్రభావం పడింది. తెలంగాణలో ఇప్పటి వరకు రూ. 8 కోట్ల వరకు సినిమా కలెక్ట్ చేసింది. కాగా ఇటీవల నాని ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు కూడా రచ్చకు దారి తీశాయి. అయితే లేటెస్ట్ గా ఓ విషయం ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశం అయింది. నాని తన రెమ్యునరేషన్ లో 60 శాతం రిటన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. శ్యాం సింగరాయ్ సినిమాకు రూ. 8 కోట్లు పారితోషకం తీసుకోగా.. రూ. 5 కోట్లు ప్రొడ్యూసర్లకు తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.అయితే నాని రెమ్యూనరేషన్ ఎందుకు తిరిగి ఇచ్చారు అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయంపై ఇటు నిర్మాతలు కానీ… అటు నాని కానీ స్పందించలేదు.

Shyam Sigha Roy: శ్యామ్ సింగరాయ్ సెలబ్రేషన్స్.. మామూలుగా లేవుగా?

Shyam Sigha Roy: డిసెంబర్ నెలలో తెలుగులో మంచి సినిమాలు విడుదల అయ్యాయి. అందులో స్టార్ హీరోల దగ్గర నుంచి.. చిన్న హీరోల వరకు ప్రతీ సినిమా థియేటర్లలో విడుదల అయ్యాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసుకున్నారు. అయితే ఎన్నో అంచనాల మధ్య డిసెబర్ 17 పుష్ప పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయి.. మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

Shyam Sigha Roy: శ్యామ్ సింగరాయ్ సెలబ్రేషన్స్.. మామూలుగా లేవుగా?

అయితే పుష్ప సినిమా ద్వారా ఏమైనా ఇబ్బంది అవుతాందా..అని ఆలోచించకుండా.. తన కథపై నమ్మకంతో క్రిస్మస్ కు ఒకరోజు ముందు థియేటర్లలోకి వచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్. దీనిలో నానీ హీరోగా.. డబుల్ రోల్ ప్లే చేశాడు. ఉప్పెన్ ఫేమ్ హీరోయిన్ కృతి శెట్టి , మడోన్నా సెబాస్టియన్‌ మరియు సాయి పల్లవి హీరోయిన్లుగా నటించారు.

Shyam Sigha Roy: శ్యామ్ సింగరాయ్ సెలబ్రేషన్స్.. మామూలుగా లేవుగా?

అయితే ఈ సినిమా అనుకున్నట్లుగానే పాన్ ఇండియా లెవల్ లో విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. విడుదల అయిన ప్రతీ సెంటర్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తమ కథపై నమ్మకంతో విడుదల చేసిన ఈ సినిమా అనుకున్నట్లుగానే హిట్ టాక్ తెచ్చుకుంది.

త్వరలోనే సీక్వెల్ ప్లాన్..

అయితే ఈ సినిమాకు సంకృత్యాన్‌ దర్శకత్వం వహించని విషయం తెలిసిందే. అయితే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని.. దానిని దర్శకుడు ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్యామ్ సింగరాయ్ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. దీనిలో నాని, వెంకట్‌ బోయినపల్లి చిత్రయూనిట్‌కి షీల్డ్స్‌ను ప్రదానం చేశారు. ఈ సినిమాను వెంకట్‌ బోయినపల్లి నిర్మించిన విషయం తెలిసిందే .

Nani-Thaman: హీరో నానికి కౌంటర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్..! కారణం ఏంటో తెలుసా..?

Nani-Thaman: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు థమన్. అంతలా హిట్లు కొడుతున్నాడు థమన్. మరో వైపు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొడుతున్నాడు. అలవైకుంఠపురం నుంచి థమన్ గ్రాఫ్ కంప్లీట్ గా ఛేంజ్ అయింది. మ్యూజిక్ పరంగా వరస హిట్లు ఇస్తున్నాడు. తాజాగా అఖండ బ్లాక్ బస్టర్ లో థమన్ పాత్ర కూడా కీలకమైంది. ఇదిలా ఉంటే తాజాగా థమన్ చేసిన ఓ ట్విట్ న్యాచురల్ స్టార్ నానికి కౌంటరేనని ఆడియన్స్ అనుకుంటున్నారు.

Nani-Thaman: హీరో నానికి కౌంటర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్..! కారణం ఏంటి..?

విషయానికి వస్తే నాని నటించిన ’టక్ జగదీష్‘ సినిమాకు ముందుగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. అయితే సాంగ్స్ అన్నింటికి మ్యూజిక్ కంపోజ్ చేసిన తర్వాత..ఏమైందో ఏమో కానీ థమన్ ను సినిమా నుంచి తప్పించారు. గోపీ సుందర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్టోర్ తో పాటు డైరెక్టర్ శివ నిర్వాణ రాసిన ఓ పాటను కూడా కంపోజ్ చేశాడు గోపీసుందర్. అయితే నాని, థమన్ కు మధ్య చెడటంతోనే థమన్ ను అర్థాంతరంగా సినిమా నుంచి తప్పించినట్టు గుసగుసలు వినిపించాయి. 

Nani-Thaman: హీరో నానికి కౌంటర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్..! కారణం ఏంటి..?

ఇదిలా ఉంటే ఇటీవల శ్యాంసింగరాయ్ ప్రమోషన్ లో భాగంగా హీరో నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ’సినిమాను సాంగ్స్ ఎలివేట్ చేసేలా ఉండాలి తప్పితే డామినేట్ చేసేలా ఉండకూడదని.. పాట మాత్రమే కాదు యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఇలా డామినేట్ చేసిందనుకోండి.. ఇలా ఏదో ఒకటే బయటకు కనిపిస్తే.. ఎక్కడో తేడా కొట్టిందని లెక్క. సినిమా సరిగా లేదని అర్థం. అన్ని కలిసిన సినిమానే గొప్ప సినిమా అవుతుందని..దాన్నే నేను నమ్ముతా‘ అని నాని వ్యాఖ్యానించాడు.

తాజాతా థమన్ ట్విట్ విషయానికి వస్తే…

అన్ని శాఖలు అద్భుతమైన పనితీరు కనబరిచినప్పుడే.. అది కంప్లీట్ సినిమా అని మేం అంటాం.. ఎప్పడూ ఒకరు డామినేట్ చేశారని అంటే బాగా నవ్వొస్తోంది. సినిమాను అర్థం చేసుకోవడానికి లోతైన అవగాహన అవసరమని థమన్ చెప్పుకొచ్చాడు. డైలాగుల్లో డెప్త్, స్టోరీ నెరేషన్, గ్రేట్ విజువలైజేషన్, గ్రేట్ క్యారెక్టరైజేషన్, నటీ నటుల పనితీరు ఇవన్నీ తోడు అయినప్పుడు.. సినిమా వన్ మ్యాన్ షో కాదని థమన్ అన్నారు. మేం సినిమాను ప్రేమిస్తాం. సినిమా కోసం పనిచేస్తాం అని ట్విట్ చేశాడు. అయితే ఈ ట్విట్ థమన్ , హీరో నానిని ఉద్దేశించి చేసినవే అని సగటు సిని అభిమాని, నెటిజన్ల అనుమానం.

Nani: హీరోల మధ్యనే ఐక్యత లేదు.. ఇక సమస్య ఎలా పరిష్కారం అవుతుంది..? హీరో నానీ

Nani: టికెట్‌ రేట్ల విషయంలో జగన్‌ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించిన నాని.. టాలీవుడ్‌లో సినీ హీరోల మధ్య ఐక్యత లేదని, అందుకే ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వకీల్ సాబ్ విడుదల సమయంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు హీరోలు, పరిశ్రమలు ఆయనకు మద్దతిచ్చాయని నాని అభిప్రాయపడ్డారు. కానీ ఏపీ మంత్రులు మాత్రం నానిని విమర్శించారు.

Nani: హీరోల మధ్యనే ఐక్యత లేదు.. ఇక సమస్య ఎలా పరిష్కారం అవుతుంది..? హీరో నానీ

సినీ పరిశ్రమకు సాధారణ సమస్య వచ్చినప్పుడు హీరోలు కలిసి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిశ్రమకు మేలు చేస్తుంటే ఏపీ ప్రభుత్వం పరిశ్రమను చంపే ప్రయత్నం చేస్తోందన్నారు. అప్పుడే ప్రభుత్వానికి సరిగ్గా చెప్పి ఉంటే.. పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదని నానీ అభిప్రాయపడ్డాడు.

Nani: హీరోల మధ్యనే ఐక్యత లేదు.. ఇక సమస్య ఎలా పరిష్కారం అవుతుంది..? నానీ వ్యాఖ్యలు వైరల్..

మరోవైపు నాలుగు రోజుల క్రితం తాను చేసిన వ్యాఖ్యలను ఒక్కొక్కొరు ఒక్కో విధంగా అర్థం చేసుకున్నారన్నారు. సోషల్ మీడియాలో దానిపై ఒక్కో విధంగా ట్రోల్ చేశారంటూ నాని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లలో వచ్చే వసూళ్ల కంటే.. కిరాణకొట్టులో వచ్చే రోజువారి కలెక్షన్స్‌ ఎక్కువని నాని కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు మరోసారి థియేటర్లపై కామెంట్‌ చేశారు నాని.

సీఎం అపాయింట్‌మెంట్ కోరిన చిరంజీవి..

టాలీవుడ్ లో ఐక్య‌త లేద‌ని అన్నారు నానీ. అంద‌రూ ఒకే తాటి పై ఉంటే ఈ సమ‌స్య ఎప్పుడో పరిష్కారం అయ్యేద‌ని అన్నారు. తాజాగా ఈ హీరో నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా విడుదల కాగా.. దానికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బాగానే రాణిస్తోంది. తెలంగాణలో నాని బాక్సాఫీస్ దద్దరిల్లుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇక టిక్కెట్ల సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్‌ను మెగాస్టార్ చిరంజీవి అపాయింట్‌మెంట్ కోరినట్లు చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు చాలా తక్కువగా ఉండటంతో థియేటర్లు రోజు, రోజు బంద్ అవుతున్నాయి. దీంతో సినీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Shyam Singha Roy: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న శ్యామ్ సింగరాయ్..ఆ వివరాలివే..!

Shyam Singha Roy: నాని శ్యామ్ సింగ రాయ్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కరోనా మహమ్మారి తర్వాత నాని తొలి సినిమా థియేటర్‌లలో విడుదలైంది. ఈ సినిమా ప్రతీ ఒక్కరి హృదయాలను గెలుచుకుంది. అంతే కాదు ఈ సినిమా అన్ని జోనర్ వాళ్లకు నచ్చింది. ఈ సినిమా అనుకూలమైన సమీక్షలను పొందుతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Shyam Singha Roy: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న శ్యామ్ సింగరాయ్..ఆ వివరాలివే..!

సాయి పల్లవి మరియు కృతి శెట్టిల నటన విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. కాన్సెప్ట్, కథాంశం, సంగీతం, సినిమాటోగ్రఫీ ఎంటర్‌టైనర్‌కి హై పాయింట్స్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేయడంతోపాటు.. నటనలో తన 100 శాతం న్యాయం చేశాడు. ఇక సినిమా బిజినెస్ విషయానికి వస్తే..ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రూ. 4.17 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

Shyam Singha Roy: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న శ్యామ్ సింగరాయ్..ఆ వివరాలివే..!

ఈ కలెక్షన్ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నాని అభిమానులు మరియు ఫాలోవర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎక్కువ కలెక్షన్లను కురిపిస్తుందని చిత్ర సభ్యులు ఆశిస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం శని, ఆది వారాలు సెలవు దినం కావడంతో ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా రూ.29.9 కోట్లు:

డిసెంబరు 17న విడుదలైన అల్లు అర్జున్ నటించిన పుష్పతో ఈ చిత్రానికి భారీ క్లాష్ ఏర్పడటం గమనార్హం. శ్యామ్ సింగరాయ్ డే 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే.. నైజాంలో రూ. 2.12 కోట్లు, సీడెడ్ లో రూ. 62 లక్షలు, ఉత్తర ఆంధ్రలో రూ. 51 లక్షలు, ఈస్ట్ లో రూ. 20 లక్షలు, వెస్ట్ లో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 26 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలు, ఏపీ/టీజీ మొత్తం: రూ. 4.17 కోట్లు( రూ. 6.90 కోట్లు గ్రాస్), ఓఎస్లో రూ. 1.35 కోట్లు.. మొత్తం వరల్డ్ వైడ్ గా రూ. 29.9 కోట్లు వసూలు చేసింది.

Shobhu Yarlagadda: నాని వ్యాఖ్యలకు అనుకూలంగా మాట్లాడిన ప్రముఖ నిర్మాత..ఆదాయం పొందాలంటే ఇలా చేయండంటూ..!

Shobhu Yarlagadda: ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కు, టాలీవుడ్ కు మధ్య టికెట్ల రేట్ల వ్యవహారం రచ్చకు దారితీస్తోంది. జగన్ సర్కార్ నిర్ణయం పట్ల చాలా మంది సినిమా ప్రముఖులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ గవర్నమెంట్ తీసుకువచ్చిన విధానం తెలుగు సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేదిగా ఉందంటూ.. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆరోపించారు.

Shobhu Yarlagadda: నాని వ్యాఖ్యలకు అనుకూలంగా మాట్లాడిన ప్రముఖ నిర్మాత..ఆదాయం పొందాలంటే ఇలా చేయండంటూ..!

తాజాగా హీరో నాని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సినిమా థియేటర్లకు వచ్చే కలెక్షన్ల కన్నా.. కిరాణా షాపుకు వచ్చే కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ.. నేరుగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. టికెట్ ధర పెంచినా.. కొనుక్కునే సామర్థ్యం ప్రేక్షకుడికి ఉందని.. టికెట్ ధరను తగ్గించి ప్రేక్షకుడిని అవమానించినట్లే అని విమర్శించారు. ఈ విమర్శలకు ఏపీ మంత్రుల నుంచి  కౌంటర్లు కూడా వచ్చాయి. 

Shobhu Yarlagadda: నాని వ్యాఖ్యలకు అనుకూలంగా మాట్లాడిన ప్రముఖ నిర్మాత..ఆదాయం పొందాలంటే ఇలా చేయండంటూ..!

అయితే హీరో నాని చేసిన వ్యాఖ్యలకు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా మద్దతు తెలిపాడు. ఏపీలో టికెట్ ధరల వ్యవహారం దీర్ఘకాలంలో ఎగ్జిబిటర్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని… చిత్ర పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నానికి మద్దతు తెలుపుతూ.. వరసగా ట్విట్లు చేశారు శోభు యార్లగడ్డ. టికెట్ల విషయంలో ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే దీనిపై ఆధారపడ్డ ఎంతో మందిపై ప్రభావం చూపిస్తుందన్నారు. అయితే దీనికి సొల్యూషన్స్ ను కూడా ఆయన ప్రభుత్వానికి చెప్పారు.

ఎమ్మార్పీలను నిర్ణయించేది ప్రొడ్యూసర్లు:

పన్నుల రూపంలో ఆదాయం పొందాలనుకుంటే ఇలా చేయొచ్చు అంటూ.. అన్ని థియేటర్లలో 100శాతం టికెట్ అమ్మకాలను కంప్యూటరైజ్డ్ చేయందని.. టికెట్ అమ్మకాల విషయంలో ఆటోమేటిక్, రియల్ టైమ్ అప్డేట్ పెట్టండని… టికెట్ ధరల విషయంలో ఉచితం, వేరియబుల్ ధర (సినిమాల విడుదలను బట్టి ధరల నిర్ణయం )లను ఏర్పాటు చేయండని సూచనలు చేశారు.  మరొక విషయం చెబుతున్నా అంటూనే ‘‘ఎమ్మార్పిలను నిర్ణయించేది ప్రొడ్యూసర్లు/ వస్తువు తయారీ దారలు మాత్రమే అని ప్రభుత్వాలు కాదంటూ’’ ప్రభుత్వానికి చురకలంటిస్తూ ట్విట్ చేశాడు.