Actress Madhavi Latha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా అవకాశాలు ఇవ్వాలని ఎంతోమంది తెలుగు నటీమణులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వక పోవడానికి కూడా దర్శక నిర్మాతలు కారణాలు చెబుతున్నారు. తెలుగు హీరోయిన్లు గ్లామర్ షో చేయడానికి వెనకాడటం వల్లే వాళ్లకు అవకాశాలు లేవు అనే మాటలు వినపడుతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే బల్లారి నుంచి తెలుగు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి నచ్చావులే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు నటి మాధవి లత. ఈమె డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె నాని సరసన స్నేహితుడా సినిమాలో నటించారు.
ఇక ఈమె నటించిన నచ్చావులే సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ తనని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, తను చెప్పిన విధంగా నడుచుకోకపోవడంతో చెట్టు కింద కూర్చోబెట్టి మరి బండ బూతులు తిట్టారంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు నుంచి వచ్చిన హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే దర్శక నిర్మాతలు చెప్పే విషయాలను వినాలి. వారు అడగకపోయినా మనమే అర్థం చేసుకొని కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయంటూ ఈమె అసలు విషయం బయటపెట్టారు.
ఇక తెలుగు ఇండస్ట్రీలో కొనసాగాలంటే తెలుగమ్మాయిలు గ్లామర్ షో చేయాలని వాళ్ళు గ్లామర్ షో చేయకపోవడం వల్లే ముంబై నుంచి హీరోయిన్లను తీసుకువస్తున్నారంటూ వాదన వినపడుతోంది. అయితే తాను స్నేహితుడా సినిమాలో చేసింది ఏంటి గ్లామర్ షో కాదా అంటూ ఈమె ప్రశ్నించారు. పాత్ర డిమాండ్ చేస్తే తప్పకుండా ఆ పాత్రకు అనుగుణంగా నటిస్తారని ఈమె తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో మాధవి లత పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…