Radhe Shyam: త్వరలో ఓటీటీలో రాధేశ్యామ్.. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా.. అసలు నిజం ఏంటి?
Radhe Shyam: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి మరోసారి కరోనా దెబ్బతాకింది. రాష్ట్రాలన్నీ కరోనా ఆంక్షల్లోకి వెళ్లాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాకు పెద్ద ఎదురుదెబ్బలు తాకాయి. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ జనవరి 7న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఓమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేయాలని అక్కడి ప్రభుత్వాలు ఆదేశించాయి. భారీ బడ్జెట్ చిత్రాలకు ఇప్పుడు కరోనా కారణంతో సెగ తగిలింది. ఇప్పటికే ఆర్ ఆర్ఆర్ఆర్ వాయిదా పడగా… ’రాధేశ్యామ్‘ సినిమాపై ప్రేక్షకులకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాధేశ్యామ్ సినిమా జనవరి 14న విడుదల అవుతుందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.
అయితే ఆర్ఆర్ఆర్ లాగే ఇది కూడా వాయిదా పడుతుందనే రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే కొంత మంది మాత్రం రాధే శ్యాం ఓటీటీల్లో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు. అయితే ఈ వాదనను కొట్ట పారేయలేమని అంటున్నారు. అయితే ఫ్యాన్సీ ఆఫర్ వస్తే ఓటీటీలో కూడా రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కరోనా వేవ్ ఎన్ని రోజులు ఉంటుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. దీంతో ఓటీటీలో విడుదల చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా థియేటర్ల మూతపడటంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ల రేట్లు మరోసమస్యగా భారీ బడ్జెట్ ప్రతిరోధకంగా ఉంది. టికెట్ ధరలపై కమిటీ వేసినా… ధరలు పెరుగుతాయనే నమ్మకం లేదు. ఇప్పటికే పుష్ప, శ్యాంసింగరాయ్ సినిమాలకు ఏపీలో కలెక్షన్లు తక్కువగానే వచ్చాయి. దీంతో పాటు కరోనా ముప్పుతో థియేటర్లు మూతపడటం లేకపోతే 50 శాతం ఆక్యుపెన్సీతో నడిచేలా ఉన్న పరిస్థితుల్లో రాధేశ్యామ్ యూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…