Featured

Hyper Aadi : హైపర్ ఆది కి ఒంగోలు పిల్లతో పెళ్లి ఫిక్స్.. నోరు జారిన ఆది తండ్రి.!

Hyper Aadi Marriage: తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ బుల్లితెర సెన్సేష‌న్ .. ఏమాత్రం వీలు దొరికినా సినిమాల్లోనూ న‌టిస్తూ వెండితెర ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రిస్తూ వస్తున్నాడు.

అయితే ఇతడి పెళ్లి గురించి అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆది ప‌లానా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని.. ప‌లానా జిల్లాకు అల్లుడు కాబోతున్నాడ‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతుండ‌టాన్ని మనం చదువుతూనే ఉంటాం.

Hyper Aadi Marriage: ఆది పెళ్లి గురించి మాట జారిన తండ్రి..ఆ జిల్లా అమ్మాయిని చూశామని..!

కానీ అవన్నీ వట్టి పుకార్లే అని ఆది చాలాసార్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. కానీ ఈ సారి ఆది తండ్రినే ఆది పెళ్లి గురించి ఓ మాట జారాడు. అదేంటంటే.. కొత్త సంవత్సరం సందర్భంగా ఈటీవీలో ‘పెళ్లాం వద్దు పార్టీ ముద్దు’ అనే ఈవెంట్ జరిగింది. దీనికి కమెడియన్స్ వాళ్ల తండ్రులతో హాజరయ్యారు.

ఆది గొప్పతనం గురించి చెప్పిన తండ్రి..

అందులో భాగంగానే హైపర్ ఆది కూడా తన తండ్రిని.. వాళ్ల అన్నయ్యలను ఈ ప్రాగ్రాంకు తీసుకొచ్చాడు. ఈ ఈవెంట్‌కు రాంగోపాల్ వర్మ స్పెషల్ గెస్టుగా రాగా.. ఇంద్రజ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఇక్కడ ముందుగా అతడు.. తన తడ్రి, సోదరుల గురించి చెప్పుకొచ్చాడు. ఆది ఈ స్థితిలో ఉండటానికి కారణం తన తండ్రి అంటూ చెప్పాడు.తర్వాత ఆది యొక్క గొప్పతనం గురించి సోదరులు, అతడి తండ్రి చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం ఇలా సాగుతుండగా.. ఆదికి పెళ్లి ఎప్పుడు చేస్తారు.. పెళ్లి గురించి వివరాలను చెప్పండి అంటూ ఇంద్రజ ఆది తండ్రిని అడుగుతుంది. ఇటీవల ఒంగోలు ఓ అమ్మాయిని చూశామన్నారు. దానిని అతడికి చెబితే.. రెండేళ్ల తర్వత చేసుకుంటా అని అన్నాడన్నారు. అంటే అతడికి ఈ పెళ్లి ఇష్టం లేదనేగా మేడం అంటూ అన్నాడు.

ఆ సమయంలోనే ఎటువంటి అమ్మాయి కోడలిగా కావాలని ఇంద్రజ అడిగగా.. విష్ణు లేచి నిలబడు అంటూ విష్ణు ప్రియను మధ్యలో లాగాడు ఆటో రాంప్రసాద్. వెంటనే ఆది తండ్రి ఏవేవో చేసే అమ్మాయి కాదు మా ఇంటి పరువు నిలేబెట్టే అమ్మాయి కావాలి అంటూ వ్యాఖ్యానించారు. ఇలా హైపర్ ఆది పెళ్లి గురించి ఏకంగా తన తండ్రి నోరు చేరడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

3 days ago