Ameesha Patel-Faisal Patel బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారు మదిని దోచుకున్న బ్యూటీ అమీషా పటేల్. తను అంతలా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ బద్రి సినిమా తరవాత మహేష్ తో నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు లాంటి సినిమాలు చేసినా పెద్దగా టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయింది.
అటు బాలీవుడ్ లో కూడా పెద్దగా హిట్లు కూడా నమోదుకాలేదు. దీంతో కెరీర్ పరంగా అమీషా పటేల్ వెనకబడిపోయింది. అయితే ఈ అమ్మడు మాత్రం తన ఘాటు ఫోటోలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. 45 ఏళ్ల వయసులో కూడా తన అందాలతో యువత మనసును దోచుకుంటుంది.
ఎప్పుడూ ఏదో ఓ ఫోటోతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. ఇక పర్సనల్ లైఫ్ గురించి అమీషా పటేల్ ఎప్పుడూ సిక్రెట్ పాటిస్తుంది. ఇప్పటి వరకు లవ్, ఎఫైర్స్ వంటి వాటికి అమీషా పటేల్ దూరంగానే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ విషయం మాత్రం సంచలనంగా మారింది. అమీషా పటేల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతున్నారనే వార్త నెట్టింట్ల వైరల్ గా మారింది.
దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల డిసెంబర్ 30న ఫైజల్ పటేల్ పుట్టిన రోజు సందర్భంగా.. అమిషా పటేల్ ‘హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు..‘‘ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. దీనికి ప్రతిగా ఫైజల్ సంచలన రిప్లే ఇచ్చాడు. ‘థాంక్యూ అమీషా.. నేను ఈ సందర్భంగా పబ్లిక్ గా ప్రపోజ్ చేస్తున్నా.. నన్ను పెళ్లి చేసుకుంటావా ?’ అని రిప్లై ఇచ్చాడు. అయితే వెంటనే పోస్ట్ ను డిలీట్ చేసినా.. అప్పటికే నెట్టింట ఇది వైరల్ గా మారింది.
దీంతో రానున్న రోజుల్లో అమీషా పటేల్ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 45 ఏళ్లకు చేరిన అమీషా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టెలా ఉంది. ఇదిలా ఉంటే ఫైజల్ అమీషా పటేల్ కన్నా మూడేళ్లు చిన్నవాడు. ఇప్పటికే ఫైజల్ పటేల్ కు వివాహం జరిగినా… 2016లో ఫైజల్ భార్య జైనాబ్ పటేల్ కార్డియాక్ సమస్యలతో మరణించారు. అయితే కొంత కాలంగా సింగిల్ గా ఉంటున్న ఫైజల్ పటేల్.. అమిషాతో ప్రేమలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…