Tag Archives: nara chandrababu naidu

Ramcharan: ఎన్టీఆర్ గారిని చూడటం అదే మొదటిసారి… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

Ramcharan: దిగ్గజ నటుడు ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు ప్రస్తుతం హైదరాబాదులో ఘనంగా నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ అన్ని తానై తండ్రి శతజయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరిపిస్తున్నాడు. హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు సినీ రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. ఈ వేడుకలకు సీనియర్ నటినటులకు మాత్రమే కాకుండా ఈతరం కుర్ర హీరో హీరోయిన్లకు కూడా ఆహ్వానం అందింది.

ఇక ఈ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా హాజరయ్యారు.
అలాగే మురళీమోహన్, జయప్రద, జయసుధ, కృష్ణవేణి లాంటి సీనియర్ నటీనటులతో పాటు.. నాగ చైతన్య, సుమంత్, అడివిశేష్, సిద్దు జొన్నలగడ్డ, రాంచరణ్ లాంటి ఈ తరం నటులు కూడా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రామ్ చరణ్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ క్రమంలో రాంచరణ్ మాట్లాడుతూ..” తాను 5వ తరగతి చదువుతున్నప్పుడు పురందేశ్వరి గారి అబ్బాయితో కలసి స్కేటింగ్ క్లాసులకు వెళ్ళేవాడిని. ఆ సమయంలో తను ఒకరోజు మా తాతగారి ఇంటికి వెళదాం రా అని పిలిచి నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు అని చెప్పుకొచ్చాడు. అయితే అప్పుడు సెక్యూరిటీ గురించి నాకు తెలియదు. కానీ వెళ్లాను.అక్కడ ఆయన మార్కింగ్ వ్యాయామాలు పూర్తి చేసుకుని పెద్ద చికెన్ పెట్టుకుని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు.

Ramcharan చికెన్ వడ్డించారు…

మాకు కూడా చికెన్ వడ్డించారు నేను ఎన్టీఆర్ గారిని చూడడం అదే తొలిసారి అని రాంచరణ్ తెలిపారు. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ గారిని తలచుకోకుండా ఉండరు. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ.. అప్పట్లోనే ఆయన సౌత్ ఇండియా సత్తాని దేశం మొత్తం చాటారు.. జై ఎన్టీఆర్ అంటూ రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాలి.

Uma Maheswari: పాడే మోసి చెల్లెళ్లకు కన్నీటి వీడ్కోలు పలికిన బాలయ్య.. అత్త అంత్యక్రియలకు దూరమైన ఎన్టీఆర్?

Uma Maheswari: దివంగత నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి సోమవారం ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించడంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈమె మరణ వార్త తెలియగానే నందమూరి కుటుంబ సభ్యులందరూ హుటాహుటిన తన ఇంటికి చేరుకున్నారు.ఇకపోతే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు దగ్గరుండి ఆమె అంత్యక్రియలను కూడా పూర్తి చేశారు.బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో హిందూ సాంప్రదాయాలు ప్రకారం ఈమెకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.

ఇకపోతే నందమూరి బాలకృష్ణ తన చెల్లెలి పాడే మోస్తూ తన చెల్లెలికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఇక ఈమె అంత్యక్రియలలో భాగంగా పలువురు రాజకీయ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇలా బాలయ్య చెల్లెలకు పాడే మోయడం చూసిన అభిమానులు కంటి తడి పెట్టుకున్నారు.ఇక అంత్యక్రియలలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు లోకేష్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.

Uma Maheswari: లండన్ పర్యటనలో ఉన్న ఎన్టీఆర్…

ఇక మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి భౌతిక కాయానికి తన భర్త దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే ఈమె వ్యక్తిగతంగా ఎంతో మంచి మనసున్న వ్యక్తి ఎందరికో సహాయం చేసిన ఉమామహేశ్వరి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఏది ఏమైనా ఎంతో ఒక మంచి మనసున్న ఉమామహేశ్వరీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం నందమూరి కుటుంబానికి తీరని లోటు అంటూ పలువురు భావిస్తున్నారు.ఇకపోతే ఈమె అంత్యక్రియలకు నందమూరి కుటుంబం మొత్తం హాజరైనప్పటికీ ఎన్టీఆర్ మాత్రం దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన తన ఫ్యామిలీతో కలిసి లండన్ వెకేషన్ లో ఉండటం వల్ల తన అత్తయ్య అంత్యక్రియలకు రాలేకపోయారు.

చంద్రబాబుకు మద్దతుగా నిలబడిన బాలయ్య ఫ్యాన్స్.. వారి దిష్టిబొమ్మలను తగలబెట్టాలంటూ పిలుపు..!

మీడియా ఎదుట ఆంధ్రప్రదేశ్ టిడిపి నేత చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే శాసనసభలో వైఎస్ఆర్ సిపి నాయకులు చంద్రబాబు నాయుడు అతని భార్య దివంగత నేత ఎన్టీ రామారావు కూతురు భువనేశ్వరి పట్ల అవమానకరంగా మాట్లాడారని చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి పలువురు టీడీపీ నేతలు స్పందించారు. అదే విధంగా ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ అభిమానులు చంద్రబాబునాయుడుకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ వైసిపి నాయకులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.

ఈ క్రమంలోనే ఆల్ ఇండియా ఎన్.బి.కె  (balakrishna) ఫ్యాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ , బి.బి.జి తిలక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్ష నాయకులు ఏ విధమైనటువంటి భాష మాట్లాడుతున్నారు యావత్ రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారని ఇలాంటివారిని మనం ఎన్నుకున్నది అంటూ ఆంధ్ర ప్రజలు విస్తుపోతున్నారని తెలియజేశారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళకు జరిగిన అవమానం చరిత్రలో మాయని మచ్చగా నిలబడి పోతుందని వీరు వెల్లడించారు.

ఈ క్రమంలోనే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, కన్నబాబు, రోజా, చంద్రశేఖర్ రెడ్డి దిష్టిబొమ్మలను తగలబెట్టాలని బాలకృష్ణ
ఫాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ ,బి బి జి తిలక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపోతే సినీ నిర్మాత అశ్వినీదత్ కూడా చంద్రబాబునాయుడు కుటుంబానికి మద్దతు తెలిపారు.

టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తాడా.. వస్తే వాళ్లు రానిస్తారా..?

సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు అతడి అల్లుడు నారాచంద్రబాబు నాయుడు లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ కావడం విశేషం. అయితే ఇలా సినిమా ఇండస్ట్రీలో సినీ నటులకు రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుందనే చెప్పాలి. ఎప్పుడో ఒక సందర్భంలో సెలబ్రిటీలు అటువైపు అడుగులు వేయకుండా ఉండలేరు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సెలబ్రెటీలు కూడా ఏదో ఒక సందర్భంలో రాజకీయాల్లోకి వెళ్లక తప్పదు.

ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగు దేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ముఖ్యమైన పట్టణాల్లో అతడు పార్టీ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే. ఆ సమయంలోనే ఖమ్మం జిల్లా దగ్గర రోడ్డు యాక్సిడెంట్ కావడంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ ను కేవలం ప్రచారం కోసమే వాడుకోవడం అభిమానులకు నచ్చలేదు. ప్రస్తుతం ఏపీ మరియు తెలంగాణలో టీడీపీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో అయితే టీడీపీ మొత్తం కనుమరుగైపోయిందనే చెప్పాలి.

ఇలాంటి కష్ట సమయంలో పార్టీని ఆదుకునే నాయకుడు కావాలని ఓ వర్గం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఒక్కరే ఇప్పుడు పార్టీని కాపాడగలడనే ఆశాభావం అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కానీ పార్టీ క్యాడర్ లో చాలా మంది అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో ఇప్పుడే వెళ్లే పరిస్థితి లేదని ఓ ఇంటర్వ్యూలో కూడా అన్నాడు.

పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానని మాత్రం చెప్పలేదు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో పాన్ ఇండియా లెవల్ లోకి అతడి మార్కెట్ వెళ్తోంది. ఇటువంటి సమయంలో అటు వైపు ఆలోచించడం కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నాడట. ఒకవేళ టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ లీడ్ చేస్తే మాత్రం పెను మార్పులు సంభవించే అవకాశం ఉందని అతడి అభిమానులు అంటున్నారు.