Featured

చంద్రబాబుకు మద్దతుగా నిలబడిన బాలయ్య ఫ్యాన్స్.. వారి దిష్టిబొమ్మలను తగలబెట్టాలంటూ పిలుపు..!

మీడియా ఎదుట ఆంధ్రప్రదేశ్ టిడిపి నేత చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే శాసనసభలో వైఎస్ఆర్ సిపి నాయకులు చంద్రబాబు నాయుడు అతని భార్య దివంగత నేత ఎన్టీ రామారావు కూతురు భువనేశ్వరి పట్ల అవమానకరంగా మాట్లాడారని చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి పలువురు టీడీపీ నేతలు స్పందించారు. అదే విధంగా ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ అభిమానులు చంద్రబాబునాయుడుకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ వైసిపి నాయకులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.

ఈ క్రమంలోనే ఆల్ ఇండియా ఎన్.బి.కె  (balakrishna) ఫ్యాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ , బి.బి.జి తిలక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్ష నాయకులు ఏ విధమైనటువంటి భాష మాట్లాడుతున్నారు యావత్ రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారని ఇలాంటివారిని మనం ఎన్నుకున్నది అంటూ ఆంధ్ర ప్రజలు విస్తుపోతున్నారని తెలియజేశారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళకు జరిగిన అవమానం చరిత్రలో మాయని మచ్చగా నిలబడి పోతుందని వీరు వెల్లడించారు.

ఈ క్రమంలోనే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, కన్నబాబు, రోజా, చంద్రశేఖర్ రెడ్డి దిష్టిబొమ్మలను తగలబెట్టాలని బాలకృష్ణ
ఫాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ ,బి బి జి తిలక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపోతే సినీ నిర్మాత అశ్వినీదత్ కూడా చంద్రబాబునాయుడు కుటుంబానికి మద్దతు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago