తెలుగు బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్స్ ప్రస్తుతం వెండితెరపై సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా గతంలో జబర్దస్త్ వేదికపై కేవలం మగవారు మాత్రమే సందడి చేసేవారు. వీరే లేడీ గెటప్ లో సందడి చేసేవారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది లేడీ కమెడియన్స్ జబర్దస్త్ వేదికపైకి ఎంట్రీ ఇస్తూ తమ అద్భుతమైన కామెడీ స్కిట్ ల ద్వారా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.
ఇలా జబర్దస్త్ వేదిక పైకి కెవ్వు కార్తిక్ టీమ్ లోకి వచ్చిన మరొక కంటెస్టెంట్ సొట్ట బుగ్గల చిన్నది షబీనా గురించి చాలామందికి తెలియదు. ఈమె అందతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఈమె జబర్దస్త్ కి రాకముందు నా పేరు మీనాక్షి, ఇంటింటి గృహలక్ష్మి, కస్తూరి వంటి సీరియల్స్లో నటించారు.అయితే ఈ సీరియల్స్లో రాని గుర్తింపు ఈమెకు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా వచ్చిందని చెప్పవచ్చు.
షబీనా షేక్అందంతో మాత్రమే కాకుండా ఈమె సొట్టబుగ్గలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. ఈమె మొట్టమొదటిసారిగా ప్రదీప్ పెళ్లి చూపులు కార్యక్రమం ద్వారా బుల్లితెరపై సందడి చేశారు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులర్ అయిన ఈమె ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూ జబర్దస్త్ వేదికపై సందడి చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…